.
పొట్లూరి పార్థసారథి... అమెరికా ఎంత గోకుతున్నా సరే, ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వెనుక అర్ధాలేమిటి..? నో హెడ్ లైన్స్! నో బ్రేకింగ్ న్యూస్!
దాదాపుగా 100 సంవత్సరాలనుండి నుండి ఆర్ధికంగా, రాజకీయంగా, ఆయుధపరంగా జియో పాలిటిక్స్ ని శాసిస్తున్న యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా ఇప్పుడు ఎలా ఉందో, ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలియచేసే సంఘటన గురుంచి తెలుసుకుందాం!
Ads
డిసెంబర్ 15, 2025 వాషింగ్టన్! అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ ‘జానెట్ ఎల్లెన్’ ( Janet Yellen) చైనాలోని బీజింగ్ లో ఉన్న ట్రెజరీ సెక్రటరీకి ఫోన్ చేసి అమెరికా రావాల్సిందిగా కోరింది! మరుసటి రోజే చైనా సెక్రటరీ అఫ్ ట్రెజరీ వాషింగ్టన్ చేరుకొని జానెట్ ఎల్లేన్ తో సమావేశం అయ్యాడు. నిజానికి ముందుగా అనుమతి తీసుకున్నది 10 నిమిషాలకి అయితే ఇరువురి మధ్య సంభాషణ మరో 35 నిముషాలకి పొడిగించబడింది. మొత్తం 45 నిమిషాలపాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది!
తరువాత రెండు రోజులకే జానెట్ ఎల్లేన్ బీజింగ్ చేరుకొని చైనా ట్రెజరీ సెక్రటరీతో సమావేశం అయ్యింది!
జనవరి 20, 2025 జానెట్ ఎల్లేన్ తన పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసింది! జో బిడెన్ హయాం ముగిసి డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే సెక్రటరీ అఫ్ ట్రెజరీ గా ‘స్కోట్ బేసెట్’ ( Scott Bessette ) ప్రమాణ స్వీకారం చేసాడు జనవరి 28, 2025 న!
స్కోట్ బేసెట్ ట్రెజరీ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైనా ట్రెజరీ సెక్రటరీతో జెడ్డాలో సమావేశం అయ్యాడు. ఈసారి జెడ్డాలోని ఒక రహస్య భూగర్భ బంకర్ లో చర్చలు జరిగాయి! అవును, మొదటి సమావేశం వాషింగ్టన్ లో, రెండవ సమావేశం బీజింగ్ లో, మూడవ సమావేశం జెడ్డాలోని రహస్య భూగర్భ బంకర్ లో జరిగాయి….
ఈ మూడు సమావేశాలు కూడా 25 రోజుల వ్యవధిలో జరిగాయి! ఈ మూడు సమావేశాల సారం ఒక్కటే!
“ మేము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి మాపట్ల కఠిన వైఖరి అవలంబించకుండా కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించండి అని అమెరికన్ సెక్రటరీస్ అఫ్ ట్రెజరీ జానెట్ ఎల్లేన్, స్కోట్ బెసెట్ చైనాని వేడుకున్నారు ”
కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించండి అంటే అర్ధం ఏమిటీ? మేము (అమెరికా) ఇబ్బందుల్లో ఉండడం అంటే అర్ధం ఏమిటీ? సాఫ్ట్ గా వ్యవహరించండి అంటే మీ ( చైనా) దగ్గర ఉన్న అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ని అమ్మకండి అని అర్ధం!
మేము ఇబ్బందుల్లో ఉన్నాము అంటే అప్పుల్లో ఉన్నాం అని అర్ధం! కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ! అమెరికా చైనాతో యుద్ధం చేసి ఓడిపోలేదు! అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటూ వస్తున్నది గత 30 ఏళ్లుగా!
అమెరికా చైనా మధ్య వాణిజ్య లోటు 2 ట్రిలియన్ డాలర్లు! అంటే అమెరికా చైనాకి చేసే ఎగుమతుల విలువ 2 ట్రిలియన్ డాలర్లు అయితే చైనా అమెరికాకి చేసే ఎగుమతుల విలువ 4 ట్రిలియన్ డాలర్లు. చైనా దగ్గర అమెరికన్ ట్రెజరీ బాండ్స్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల పైమాటే!
చైనా దగ్గర అంత పెద్దమొత్తంలో డాలర్ రిజర్వ్ ఎక్కడిది?
ఒక్క రోజులో చైనా ఈ స్థితికి చేరుకోలేదు! దాదాపుగా మూడు దశబ్దాలుగా చైనా అమెరికాకి చేసే ఎగుమతుల తాలూకు వచ్చిన డాలర్లలో సింహ భాగాన్ని అమెరికా ట్రెజరీకి సంబంధించి బాండ్స్, రిసీప్ట్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చింది! అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనడం అంటే అమెరికాకి అప్పు ఇచ్చి వడ్డీ తీసుకోవడమే!
ఎప్పుడైతే సెక్రటరీ అఫ్ ట్రెజరీ జానెట్ ఎల్లెన్, స్కోట్ బెసెట్ చైనాని సాఫ్ట్ గా వ్యవహరించండి అని వేడుకున్నారో చైనాకి అప్పటికే తన వద్ద ఉన్న సమాచారం నిజమే అని రూఢి చేసుకొని మీ బాండ్స్ అమ్మబోము అని హామీ ఇచ్చింది కానీ, 2025 మార్చి నెల నుండి మెల్లిగా అమ్మడం మొదలుపెట్టింది!

అమెరికన్ ట్రెజరీ బాండ్స్ అమ్మితే అమెరికాకు వచ్చిన నష్టం ఏముంటుంది అనే సందేహం రావొచ్చు!
అమెరికా చైనా కాళ్ళు పట్టుకునేలా చేసింది సో కాల్డ్ అమెరికన్ మేధావులే! డాలర్లు ప్రింట్ చేసుకుంటూ పోవడమే కానీ దానివల్ల దీర్ఘకాల నష్టాలు ఏమిటో ఆలోచించలేదు మేధావులు!
అమెరికా పతనం ఇలా మొదలయ్యింది….
1.అమెరికా దగ్గర సంవత్సరానికి సరిపడా డబ్బు ఉండదు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతుంది.
2.ట్రెజరీ IOU లని విడుదల చేస్తుంది! IOU ( “ I OWE YOU ”) నేను నీకు అప్పు ఉన్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి చెల్లిస్తాను అనే హామీతో బాండ్స్ అమ్ముతుంది. ఈ ట్రెజరీ బాండ్స్ ని ఇతర దేశాలు కొంటూ ఉంటాయి. ట్రెజరీ బాండ్స్ ద్వారా సమకూరే డబ్బుని ఫెడరల్ రిజర్వ్ కి బదిలీ చేస్తుంది.
3.ఫెడరల్ రిజర్వ్ నుండి ఇతర బాంకులకి బదిలీ అవుతుంది. ఇతర బాంకులు ప్రజలకి, పారిశ్రామిక వేత్తలకి అప్పులు ఇస్తాయి.
4.ఎవరైతే ట్రెజరీ బాండ్స్ లో పెట్టుబడి పెడతారో వాళ్లకి వడ్డీ రూపంలో లాభాలు వస్తుంటాయి. లాభాలు పొందే జాబితాలో ఇతర దేశాలతో పాటు అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. అయితే ఇతర దేశాల కంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ట్ఫోలియోలే ఎక్కువగా లాభాలు ఆర్జిస్తాయి. భారత్ తో పాటు ఇతర దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం కోసం తమ వద్ద ఉన్న డాలర్స్ ని ఖర్చుపెడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు డాలర్స్ తమ వద్ద ఉంచుకోలేవు. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ట్ ఫోలియోలు మాత్రం ట్రెజరీ బాండ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తుంటాయి కాబట్టి ప్రభుత్వాన్ని పన్నులు పెంచనీయవు ఎందుకంటే పన్నులు పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ట్రెజరీ బాండ్స్ ని అమ్మవు.
5. తమవద్ద లేని డాలర్లని సృష్టించి వాటిని బాండ్స్ రూపంలో ఇతర దేశాలకి అమ్మి వాటికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నది అమెరికా. ఇది దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నది.
అమెరికా ఇతర దేశాలకి కానీ, ఇతర సంస్థాగత మదుపరులకి కానీ బాకీ ఉన్న అప్పు ఎంత? రెండేళ్ల క్రితం 13 ట్రిలియన్ డాలర్లు అని వార్తలు వచ్చాయి. గత సంవత్సరం అయితే అప్పు 27 ట్రిలియన్ డాలర్లు అన్నారు. ఈ రోజున $32.5 ట్రిలియన్లు అంటున్నారు! కానీ ఇవేవి నిజాలు కావు!
అమెరికా అప్పు 80 ట్రిలియన్ డాలర్ల కి పై మాటే!
అమెరికన్ ట్రెజరీ సెక్రటరీలు ఎప్పుడైతే చైనాని ట్రెజరీ బాండ్స్ అమ్మవద్దని వేడుకున్నారో అప్పటికే అప్పు అనేది తీర్చలేనంత గుది బండగా మారిందని అంచనా! నిజంగా అప్పు 32.5 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంటే దానిని అదుపు చేసుకుంటూ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకోగలదు అమెరికా!
6. గత దశాబ్దాలుగా ఏ దేశాన్ని అయితే అణిచివేయాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చిందో అదే చైనాని బాండ్స్ ని బహిరంగ మార్కెట్లో అమ్మవద్దని వేడుకుందంటే అది ఖచ్చితంగా 80 ట్రిలియన్ డాలర్ల అప్పు అయివుంటుంది!
ప్రతీ 90 రోజులకి ఒకసారి 2 ట్రిలియన్ డాలర్లని కొత్తగా సృష్టించి మార్కెట్లోకి అమ్మకానికి పెడుతున్నది. ఇక్కడ సృష్టించడం అంటే డాలర్ల ని ప్రింట్ చేయడం లేదు. జస్ట్ ఒక కీ స్ట్రోక్ తో 2 ట్రిలియన్ డాలర్ల ని సృష్టిస్తున్నది! ఇది ప్రతీ మూడు నెలలకి ఒకసారి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పీటర్ టర్చిన్ చెప్పిన జోస్యం 2020 నాటికే నిజం అయ్యింది! కానీ బయటపడకుండా చూడాలని ప్రయత్నించి విఫలం అయ్యింది. రిపబ్లికన్ అధ్యక్షుడు, డెమోక్రాట్ అధ్యక్షుడు అనే భేదం బయటికి కనపడేది, కానీ ఈ నాటకాన్ని ఆడించేది ఇల్యూమీనాటి! ట్రంప్, జో బిడెన్, ఒబామా అనేవి పేర్లు మాత్రమే!
ఎంత మంచి దర్శకుడు అయినా పాత్రధారులు స్టేజి మీద బాగా నటిస్తే కానీ నాటకం రక్తి కట్టదు! దర్శకుడు పాత్రలని మలిచేసే తీరు ఒకటే కానీ ఆ పాత్రధారులు తమ నటనకి న్యాయం చేయలేకపోతే పాత్రధారులని మారుస్తూ ఉంటాడు దర్శకుడు!
2018 వరకూ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పనిచేది!
2020 నుండి డిపార్ట్మెంట్ అఫ్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్ ని తన ఆధీనంలోకి తీసుకుంది. ట్రంప్ తన మొదటి హయాంలో తను దిగిపోతూ ఫెడరల్ రిజర్వ్ ని ట్రెజరీకి అప్పచెప్పి వెళ్ళాడు. తరువాత వచ్చిన జో బిడెన్ కూడా ట్రెజరీని ఫెడరల్ రిజర్వ్ విధులని కొనసాగనిచ్చాడు!
పీటర్ టర్చిన్ చెప్పిన జోస్యం 2020 కల్లా అమెరికా పతనం మొదలవుతుందనే!
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ బాండ్స్ మీద ఇచ్చే వడ్డీని తగ్గిస్తుందా లేక పెంచుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు కానీ ఆ పని చేస్తున్నది డిపార్ట్మెంట్ అఫ్ ట్రెజరీ అని ఎవరికీ తెలియదు!
ట్రెజరీ బాండ్స్ మీద ఇచ్చే వడ్డీ శాతం 0.25% పెంచినా చాలు బంగారం, క్రూడ్ ఆయిల్ నుండి నిధులు వెళ్ళిపోయి బంగారం ధరలు తగ్గుతుంటాయి. డిపార్ట్మెంట్ అఫ్ ట్రెజరీ తీసుకున్న అప్పులకి వడ్డీకిగాను ప్రతీ ఏటా 1.2 ట్రిలియన్ డాలర్లని చెల్లిస్తున్నది! ఈ డబ్బు కూడా కృత్రిమంగా సృష్టిస్తున్నదే!
కొత్తగా ఉత్పత్తి జరగడంలేదు, కొత్తగా సేవలు అందించి ఆదాయం వస్తున్నది లేదు కానీ కృత్రిమ సంపద మాత్రం పెరుగుతూ పోతున్నది! ప్రతీ సంవత్సరం మూడు సార్లు బాండ్స్ విడుదల చేసి అప్పులు తీసుకుంటున్నది, వాటికి వడ్డీలు చెల్లించడానికి కొత్తగా బాండ్స్ రిలీజ్ చేసి అమ్ముతూ పోతున్నది!
కొన్ని విస్మయపరిచే నిజాలు: దశబ్దాలుగా అమెరికన్ డిఫెన్స్ బడ్జెట్ ఆడిట్ పూర్తిగా జరగడం లేదు. ప్రతీ సంవత్సరం 60% కి మించి ఆడిటింగ్ జరగడం లేదు. మిగతా 40% లెక్కల సంగతి డెమోక్రాట్లు, రిపబ్లికన్స్ కానీ అడగడం లేదు. ఎందుకంటే ఆ 40% లెక్క పార్టీలకి అతీతంగా వాళ్ళ జేబుల్లోకే వెళుతున్నాయి కాబట్టి! దీనిని బట్టి చూస్తే ఎన్ని ట్రిలియన్ డాలర్లు మాయం అయి ఉంటాయి?
గత సంవత్సరం ట్రంప్ అధికారంలోకి వచ్చాక 13 ట్రిలియన్ డాలర్లకి లెక్కలు తేలలేదని తెలిసింది. ఆ మొత్తం ఎక్కడికి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయో ఎవరికీ తెలియదు! లెక్కలు తెలియని విధంగా 13 ట్రిలియన్ డాలర్లు మాయం అయితే అమెరికా అప్పు 38.5 ట్రిలియన్ డాలర్లు అని చెప్పడం నిజం దాచడానికా?
- 38.5 ట్రిలియన్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది అంతకు రెండు రెట్లు ఎక్కువ అప్పు ఉందని తెలిస్తే ఇటు స్వదేశీ మదుపరులు అటు విదేశీ మదుపరులు ఒక్కసారిగా ట్రెజరీ బాండ్స్ అమ్మకానికి పెడతారు. ఏదన్నా బాంక్ దివాలా అంచుల్లో ఉందని తెలియగానే ఖాతాదారులు బ్యాంకుకి వచ్చి మా డిపాజిట్లు మాకిచ్చేయండి అని డిమాండ్ చేస్తే ఏ బ్యాంకు కూడా మొత్తం ఒకేసారి ఇవ్వలేదు! ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది.
అఫ్కోర్స్! ఉన్న ఫళంగా అమెరికా దివాళా తీసిందే అనుకుందాం! మాకు డాలర్లు వద్దు దానికి బదులుగా బంగారం ఇవ్వండి అని అడగడానికి వీలుందా? డాలర్ ని బంగారంతో లింక్ తెగగొట్టి దశాబ్దాలు అవుతున్నది. కాబట్టి ఆశ వదులుకోవాల్సిందే! రహస్యం బయటపడితే ట్రెజరీ బాండ్స్, అమెరికన్ ఎక్ష్ప్రెస్ చెక్ లు ఎప్పటికి బౌన్స్ కావు అనే నమ్మకం పోతుంది!
అమెరికా మునగడానికి సిద్ధంగా ఉన్న నౌక! మోడీ మౌనంగా చూస్తూ ఉండడానికి కారణం ఇదే! ఎవరిది డెడ్ ఎకానమీయో త్వరలో తెలిసిపోతుంది!
Share this Article