.
మోడీ సైలెంటుగా కొట్టాడు… ట్రంపుకి దిగిరాని స్థితి క్రియేట్ చేశాడు అనే అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం… ఎందుకు..?
ఇండియాతో ట్రేడ్ డీల్ ఖరారైందనీ, ఇక 18 శాతం సుంకాలే ఉంటాయనీ, పీనల్ టారిఫ్ ఉండబోదని సాక్షాత్తూ ట్రంపే తన ‘సోషల్ ట్రుత్’ వేదికగా ప్రకటించాడు కాబట్టి… మోడీ కూడా థాంక్స్ చెప్పాడు కాబట్టి… ఇద్దరి నడుమ ఫోన్ సంభాషణ జరిగాక ఈ డీల్ ఫైనల్ అయిందనే వార్తలొస్తున్నాయి కాబట్టి…
Ads
పాకిస్థాన్ అనుకూల వైఖరి, పైకి మోడీ స్నేహితుడంటూ డొల్ల మాటలు, చేతల్లో బ్లాక్ మెయిల్ ధోరణి… ఇదీ ట్రంపు ఇప్పటిదాకా కనబరిచిన వ్యవహారశైలి… తన మాటల్ని నమ్మడానికి లేదు… అసలు అమెరికా అంటేనే అదంతే… ఈ డీల్‌లో హిడెన్ దెబ్బలు ఏమైనా ఉన్నాయో బయటపడాల్సి ఉంది…
ఎందుకంటే..? ఈ సమయం వరకు పలు మీడియా వార్తలు చదివాను గానీ అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్ అసలు వివరాలు లేవు ఎక్కడా, 18 శాతానికి సుంకాలు తగ్గించారనే ట్రంప్ ప్రకటన తప్ప, మోడీ థాంక్స్ చెప్పాడు గానీ ఇన్నాళ్లూ ఇండియా అభ్యంతరపెడుతున్న జీఎం ఫుడ్, నాన్ వెజ్ మిల్క్ మీద క్లారిటీ లేదు…
రష్యా నుంచి చమురు కొనడం లేదు, వెనిజులా నుంచి చమురు కొనబోతున్నది కాబట్టి, మనకు ఏదో వరం ఇస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటన ఉంది… నిజానికి న్యూజిలాండ్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌లతో ఇండియా ట్రేడ్ డీల్స్… యూఏఈ వంటి దేశాలతో ఇండియా బలపడుతున్న సంబంధాలు, జియోపాలిటిక్స్ వంటి చాలా కారణాలు ట్రంపుని దిగివచ్చేలా చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది…
కానీ ట్రంపు మాటల్లో నిగూఢమైన తిరకాసులుంటయ్… అత్యంత చంచల రాజకీయవేత్త… ప్రధానంగా తను వ్యాపారి… అందుకే స్పష్టత రావాలి… ఇంకా వివరాలు రావాలి… ఎందుకంటే… మనం నాన్ వెజ్ మిల్క్ దిగుమతులను అనుమతించం, జెనెటికల్లీ మోడిఫైడ్ సోయా, మక్క దిగుమతులనూ అనుమతించం… అవి మన రైతులకు తీవ్ర నష్టం, మన సాంస్కృతిక భావాలకు వ్యతిరేకం కాబట్టి…

అమెరికాలో పాడి పశువులకు మాంసాహార మిశ్రమం (Blood meal, Bone meal) మేతగా ఇస్తారు… ఇది భారతీయ మతపరమైన, సాంస్కృతిక భావాలకు విరుద్ధం… ఎప్పుడూ భారత్ ఈ విషయంలో తన ‘Red Line’ దాటలేదు… “శాకాహార ధృవీకరణ” (Vegetarian Certification) లేనిదే అమెరికా పాల ఉత్పత్తులను అనుమతించబోమని స్పష్టం చేసింది…
ప్రస్తుత డీల్‌లో ద్రవ రూపంలో ఉండే పాలను (Liquid Milk) పక్కన పెట్టి, కేవలం కొన్ని ఎంపిక చేసిన డైరీ ఉత్పత్తులకు మాత్రమే పరిమిత అనుమతులు ఇచ్చారని ఓ అంచనా…
అమెరికా సోయాబీన్, మొక్కజొన్నను భారత్‌కు పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని చూస్తోంది… మన ప్రభుత్వం జీఎం కాని (Non-GM) సోయాబీన్‌ను మాత్రమే అనుమతిస్తామని గత చర్చల్లో పేర్కొంది… అమెరికా నుండి వచ్చే మొక్కజొన్నను ఆహారం కోసం కాకుండా, కేవలం ఇథనాల్ తయారీ (Biofuels) కోసం వాడేలా షరతులు విధిస్తున్నారు… తద్వారా మన ఫుడ్ చైన్‌లోకి జీఎం పంటలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు… ఇదీ క్లారిటీ రావల్సి ఉంది…
ట్రంప్ తన ప్రకటనలో భారత్ తన సుంకాలను ‘ZERO’ కి తగ్గిస్తుందని చెప్పాడు కానీ, భారత్ అధికారికంగా దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు… మన దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుండి మినహాయించి ఉంటారని మరో అంచనా…
ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం భారత్‌తో ఉన్న “స్నేహం” మాత్రమే కారణం కాదు, అమెరికా స్నేహం ఎలాంటిదో చూస్తూనే ఉన్నాం… కానీ ఈ ట్రేడ్ డీల్ వెనుక బలమైన అంతర్జాతీయ ఒత్తిడి, భౌగోళిక రాజకీయ వ్యూహాలు (Geopolitics) ఉన్నాయనే విశ్లేషణలు మాత్రం వినిపిస్తున్నాయి…
భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అమెరికాను ఆత్మరక్షణలో పడేశాయి… ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ (భారత్ – ఈయూ ఒప్పందం) జనవరి 27, 2026న భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది…
-
ముప్పు..: దీనివల్ల యూరప్ దేశాల కార్లు, వైన్, విలాసవంతమైన వస్తువులకు భారత మార్కెట్లో సుంకాలు భారీగా తగ్గాయి…
-
ట్రంప్ భయం…: అమెరికా వస్తువులపై 50% సుంకాలు ఉండి, యూరప్ వస్తువులపై తక్కువ సుంకాలు ఉంటే… అమెరికా కంపెనీలు (ఉదాహరణకు టెస్లా, ఫోర్డ్) భారత మార్కెట్‌ను కోల్పోతాయి. ఈ పోటీని తట్టుకోవడానికే ట్రంప్ వేగంగా 18 శాతానికి తగ్గించాల్సి వచ్చింది…
-
బ్రిటన్ (UK)…: 2025 జూలైలో జరిగిన ఒప్పందం ద్వారా భారత ఐటీ నిపుణులకు, వస్త్ర రంగానికి బ్రిటన్ పెద్దపీట వేసింది…
-
న్యూజిలాండ్…: డిసెంబర్ 2025లో కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ పండ్లు, కలప వంటి ఉత్పత్తులకు భారత్ వెసులుబాటు ఇచ్చింది…
-
ఈ దేశాలన్నీ భారత్ అడిగినట్లుగా డైరీ, అగ్రికల్చర్ రంగాల్లో సున్నితమైన అంశాలను (Red Lines) గౌరవించాయి… ఇది అమెరికాపై ఒత్తిడి పెంచింది…
భారత్ ఇతర దేశాలతో (EU, UK) ఒప్పందాలు చేసుకుని, అమెరికాను పక్కన పెట్టడంతో… “మొండిగా ఉంటే లాభం లేదు, మార్కెట్ మొత్తం వేరే దేశాల పరమవుతుంది” అని ట్రంప్ గుర్తించాడు… అందుకే, పూర్తి స్థాయిలో కాకపోయినా, 18% సుంకంతోనైనా తన ఉనికిని కాపాడుకోవాలని ఈ డీల్‌కు ఓకే చెప్పాడు…
అమెరికా నుండి వచ్చే అధికారిక ప్రకటనలో H-1B వీసాల కోటా లేదా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (iCET) గురించి ఏవైనా కీలక మార్పులు ఉన్నాయేమో చూడాలి. అవి కూడా మన ఐటీ స్టాక్స్‌పై పెద్ద ప్రభావం చూపుతాయి…
మొత్తానికి, భారత్ తన "మల్టీ-లెవల్ డిప్లొమసీ" (బహుళ దేశాలతో చర్చలు) ద్వారా అమెరికాను చర్చల టేబుల్ దగ్గరకు వచ్చేలా చేసింది...
Share this Article