Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…

February 25, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … ఆటవస్తువులు అమ్ముకునే ఓ చిన్న వ్యాపారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని నేల మీదకి దించాడు!
అమెరికన్ సుప్రీం కోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల మీద విధించిన టారిఫ్స్ చట్ట విరుద్ధం అని తీర్పు ఇచ్చింది!

ట్రంప్ 2025 అగస్టులో టారిఫ్స్ విధించగానే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని సవాలు చేస్తూ ఒక ఆట వస్తువులు అమ్ముకునే వ్యాపారి సుప్రీం కోర్టులో కేసు వేశాడు.
లెర్నింగ్ రీసోర్సెస్ ఇంక్ ( Learning Resources Inc.)
యజమాని రిక్ వల్డెన్ బెర్గ్ ( Rick Woldenberg ) ఇల్లినాయిస్ లో తన ఎడ్యుకేషనల్ టాయ్స్ బిజినెస్ నడుపుతున్నాడు గత మూడు దశాబ్దాలుగా.

Ads

ట్రంప్ ఎప్పుడైతే విచక్షణరహితంగా టారిఫ్స్ విధించాడో వెంటనే సుప్రీం కోర్టులో కేసు వేశాడు.
IEEPA – International Emergency Economic Powers Act ని ఉపయోగించుకొని ట్రంప్ టారిఫ్స్ విధించడం వలన తనతో పాటు ఇతర వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నామని, కాబట్టి IEEPA కింద టారిఫ్స్ విధించడం చెల్లదని రూలింగ్ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టుని అభ్యర్థించాడు రిక్.

రిక్ వోల్డెన్ బెర్గ్ విద్యార్థుల కోసం బొమ్మలు ( Educational Toys ) ని చైనా నుండి దిగుమతి చేసుకొని అమెరికాలో అమ్ముతుంటాడు. కొన్ని బొమ్మలు రెడీ మేడ్ వి చైనా నుండి దిగుమతి చేసుకుంటాడు, అలాగే లెర్నింగ్ రీసోర్సెస్ సంస్థలోని ఇంజినీర్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిసైన్ చేసి చైనాలో తయారు చేయించుకొని దిగుమతి చేసుకుంటాడు.

ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల చైనాలోని తయారిదారులు ధరలు పెంచి లెర్నింగ్ రీసోర్సెస్ కి ఎగుమతి చేస్తున్నారు!
టారిఫ్స్ అంటే…. అమెరికాకి ఎగుమతి చేసే వాళ్ళు తాము ఎంత మొత్తంలో ఎగుమతి చేస్తున్నారో దాని మీద 10 నుండి 50% ల మధ్య ఎంతైతే అవుతుందో అంత పన్ను చెల్లించి ఎగుమతి చేయాల్సి ఉంటుంది.

ముస్లిం దురాక్రమణదారులు గడ్డం పెంచినా, గుండు చేయించుకున్నా ఎలా అయితే జిజియా పన్ను వేసేవారో అలాంటిదే డోనాల్డ్ డంప్ ట్రక్ టారిఫ్స్!
రిక్ వొల్డంబెర్గ్ తన ఎడ్యుకేషనల్ టాయ్స్ ధరలు పెంచి అమ్ముకోవాల్సివచ్చింది, తద్వారా నష్టపోయాడు. రిక్ సుప్రీంకోర్టులో టారిఫ్స్ మీద కేసువేసిన తరువాత మిగతా వ్యాపారస్తులు, పారిశ్రామిక సంస్థలు కూడా టారిఫ్స్ మీద సుప్రీం కోర్టు తలుపు తట్టాయి!

అమెరికన్ సుప్రీం కోర్టు ఏమని తీర్పు చెప్పింది?
1.ట్రంప్ విధించిన టారిఫ్స్ రాజ్యాంగ విరుద్ధం.
2.టారిఫ్స్ విధించాలి అంటే అమెరికన్ చట్ట సభల ( కాంగ్రెస్ ) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి కానీ ట్రంప్ చట్ట సభలని బై పాస్ చేసి ఏకపక్షంగా టారిఫ్స్ విధించాడు కాబట్టి అవి చట్ట విరుద్ధం!
3. IEEPA ( ఇంటర్నెషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్స్ యాక్ట్ ) అనేది అమెరికా అధ్యక్షుడికి 1977 లో సంక్రమించిన అధికారం కానీ అమెరికాలో ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు లేవు కాబట్టి IEEPA ని అడ్డుపెట్టుకొని అధ్యక్షుడు టారిఫ్స్ విధించలేడు.

4.టారిఫ్స్ విధించడానికి ట్రంప్ చెప్తున్న కారణం వాణిజ్య లోటు… అయితే అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని దానికి కారణం కెనడా, చైనా,మెక్సికో దేశాలు అని. కానీ ట్రంప్ ఉదహరించిన కారణాలని సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. 90 దేశాలకి పైగా ట్రంప్ టారిఫ్స్ విధించడం ఏమిటని ప్రశ్నించింది.

5.1977 లో అమెరికా అధ్యక్షుడికి IEEPA ద్వారా సంక్రమించిన ఎమర్జెన్సీ అధికారాలలో ఎక్కడా కూడా టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీ ల ప్రస్తావన లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
6.టారిఫ్స్ లేదా ఇంపోర్ట్ డ్యూటీలని ఎప్పుడు ఏ దేశం మీద వేయాలి అనే అధికారం అమెరికా చట్ట సభలకి మాత్రమే ఉంటుంది కానీ అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది.

7.సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ( John Roberts) తీర్పు చెపుతూ అధ్యక్షుడు ట్రంప్ తనకి లేని అధికారాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో ఉపయోగించడం చట్ట విరుద్ధం అని పేర్కొన్నాడు.
8.అమెరికా సుప్రీం కోర్టులో మొత్తం 9 మంది న్యాయమూర్తులు ఈ కేసుని విచారించి చివరికి వోటింగ్ కి వెళ్లగా 6 మంది న్యాయమూర్తులు అనుకూలంగా ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకంగా ఓటు వేశారు. కేసు తీర్పుని 6 గురు న్యాయమూర్తులు బలపరిచారు అన్నమాట!

9.ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్లకి తిరిగి డబ్బు చెల్లించాలి అని కూడా సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది.
10.అమెరికన్ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకి ఎంత నష్టపోయారో అంతా తిరిగి ఇచ్చేయాల్సిందే తీర్పు ప్రకారం!
11.అసలే డాలర్లు లేక మూలుగుతుంటే ఇప్పుడు తిరిగి ఇవ్వాలంటే ట్రెజరికీ భారమే!
12. అమెరికన్స్ అయితే సరే! టారిఫ్స్ చెల్లించిన 90 కి పైగా దేశాలకి తిరిగి డాలర్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఇవ్వగలదా?

*****************

  • మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడి కోడలు నవ్వినందుకు బాధగా ఉందనే సామెత సుప్రీం కోర్టు తీర్పు ట్రంప్ విషయంలో వర్తిస్తుంది.
    ఎలా అంటే…
    ట్రంప్ ఏరి కోరి ఇద్దరు న్యాయమూర్తులని సుప్రీం కోర్టులో నియమించాడు…  వాళ్ళు…గోర్సిచ్ ( Gorsuch ),  Barrett ) బారెట్ .
    ఇద్దరూ కూడా ట్రంప్ విధించిన టారిఫ్స్ చట్ట విరుద్ధం అని తీర్పు చెప్పిన ఆరుగురు న్యాయమూర్తులలో ఉన్నారు.
    ట్రంప్ కి ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది?

****************
ట్రంప్ ఎలా స్పందించాడు?
అసలు దేశంలో ఏం జరుగుతున్నదో ఈ న్యాయమూర్తులకి తెలియదు అని అన్నాడు!
నిజమే కానీ….. అమెరికాలో గత దశాబ్దాలుగా ఏం జరిగిందో బయటపెట్టకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది?
కాగితాలు లేదా కంప్యూటర్ లో కనిపించే అప్పు 38.5 ట్రిలియన్ డాలర్లు. ఇదే ప్రపంచానికి, అమెరికన్ సమాజానికి తెలిసింది.

మరి ప్రపంచానికి, అమెరికన్ సమాజానికి చెప్పనిది?
ఒకరు 90 ట్రిలియన్ డాలర్లు అంటే ఇంకొకరు కాదు 110 ట్రిలియన్ డాలర్లు అంటున్నారు! ఎవరిది కరెక్ట్?
నిజం మాత్రం బయటికి చెప్పరు!
కానీ కొన్ని సంఘటనలని విశ్లేషిస్తే మాత్రం ఎంత అప్పు ఉందో కరెక్ట్ ఫిగర్ చెప్పలేం కానీ భరించలేనంత అని స్పష్టమవుతుంది.

గత 70 ఏళ్లలో ఎన్ని దేశాలలో ప్రభుత్వాలని కూల్చడానికి ఎన్ని ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అమెరికా?
నాటో పేరుతో యూరోపులో, ఇతర దేశాలలో అంటే మొత్తం 80 దేశాలలో అమెరికన్ మిలిటరీ బేస్ లు, ఇంస్టలేషన్స్ 750 దాకా ఉన్నాయి. 750 కంటే ఎక్కువే ఉండవచ్చు ఎందుకంటే వివరాలు పబ్లిక్ డోమైన్ లో దొరకవు!

క్లాసిఫైడ్ ఫైల్స్ పేరుతో ఎన్ని వందల బిలియన్ డాలర్లు CIA ద్వారా ఖర్చు చేయబడ్డాయో తెలియదు.
ఇజ్రాయేల్ గాజా, లేబనాన్ లలో ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ తో బిల్డింగ్స్ ని కూల్చేస్తూ వస్తున్నది! ఒక్కో ఎయిర్ టు సర్ఫేస్ మీసైల్ ధర 6 లక్షల నుండి 60 లక్షల డాలర్ల వరకూ ఉంటుంది. ఇప్పటి వరకూ కనీసం 2,000 మిసైల్స్ ఇజ్రాయేల్ ప్రయోగించిందని అంచనా. ఇవి కాక లేజర్ గైడెడ్ బాంబ్స్, ఐరన్ డోమ్ కోసం అయిన ఖర్చు అదనం! ఇదంతా లెక్కల్లో చూపని డబ్బే కదా? ఎవరు ఎవరికిచ్చారు?

నేను కావాలి అనుకుంటే ఏ దేశాన్ని అయినా నాశనం చేయగలను… డోనాల్డ్ ట్రంప్!
సుప్రీం కోర్టు తీర్పు తరువాత ట్రంప్ అసహనంతో అన్న మాటలవి!
అంత అసహనంతో ఉన్నాడు అంటే భరించలేనంత అప్పులో అమెరికా ఉందనే కదా అర్ధం?
ఇంతకీ టారిఫ్స్ వల్ల నష్టపోయిన వాళ్లకి డబ్బు తిరిగి ఇచ్చేస్తాడా?
ఇవ్వనని తేల్చి చెప్పేశాడు! నష్ట పరిహారం ఇవ్వాల్సివస్తే దానిని ( షుమారుగా 300 నుండి 500 బిలియన్ దాకా ఉండవచ్చు ) గాజా బోర్డ్ అఫ్ పీస్ (Gaza Board of Peace ) కి ఇచ్చేస్తానని ప్రకటించాడు ట్రంప్!

  • గాజాని నాశనం చేసింది అమెరికా, ఇజ్రాయేల్ అయితే అక్కడ శాంతి నెలకొల్పి గాజా పునర్ నిర్మాణానికి ప్రపంచ దేశాలు సహకరించాలని అడుగుతున్నాడు ట్రంప్!
    మీరు మీరు నిర్ణయించుకొని దాడులు చేసి ఆ నష్టాన్ని ప్రపంచ దేశాలు భరించాలా? పైగా గాజా పీస్ బోర్డులో ఒక మిలియన్ డాలర్లు ఫీజు కట్టి అందులో చేరి శాంతి పరిరక్షణ కోసం పాటుపడాలిట ప్రపంచ దేశాలు.

గాజా పీస్ బోర్డ్ ని చాలా ప్లాన్డ్ గా ముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రిసాల్యూషన్ no 2803 ద్వారా పొందుపరిచి అధికారిక హోదా కల్పించి వివాదానికి తావు లేకుండా చేసాడు ట్రంప్.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళం అని ఒకటి ఏడ్చింది కదా? దానిని ఎందుకు వాడుకోవట్లేదు? ఎందుకంటే గాజాలో శాంతి పేరుతో అమెరికా ఇజ్రాయేల్ కలిసి కాంట్రాక్ట్ లు తీసుకోవచ్చు! సభ్యత్యం తీసుకున్న దేశాలకి కూడా కాంట్రాక్టులు ఇస్తారు కుక్కకి బిస్కెట్ వేసినట్లుగా!
భారత్ కేవలం అబ్సర్వ్ దేశంగా నిన్నటి సమావేశానికి వెళ్ళింది! గాజా పీస్ బోర్డ్ అనేది పెద్ద స్కామ్!

***********
ఇంతకీ అమెరికా సుప్రీం కోర్ట్ తీర్పు వల్ల భారత్ కి ఏమన్నా లాభం ఉంటుందా?
లాభం ఏమీ ఉండదు!
ట్రంప్ టారిఫ్స్ విధించకముందు వస్తువులని బట్టి 2 నుండి 10% దాకా టారిఫ్ ఉండేది! దానిని 25% గరిష్టంగా చేసి ఆపై రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు అదనంగా మరో 25% వేసి మొత్తం 50% గా చేశాడు.
మధ్యంతర వాణిజ్య ఒప్పందం వల్ల గరిష్ట టారిఫ్ 18% కి తగ్గింది. రష్యా నుండి ఆయిల్ కొనే దేశాల మీద ఇష్టం వచ్చినట్లు టారిఫ్స్ విధించడానికి ఇక ముందు వీలు లేదు. అమెరికన్ చట్ట సభలలో బిల్లు పెట్టి దానికి ఆమోదం లభించాక టారిఫ్స్ విధించాలి.

ఈ వారంలో భారత అధికారులు అమెరికా వెళ్లి మధ్యంతర వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరపాల్సి ఉండగా భారత అధికారులు తమ పర్యటనని రద్దు చేసుకున్నారు!
So! ట్రంప్ అమెరికన్ చట్టసభలని కొత్త చట్టం కోసం సిద్ధం కావాల్సిందిగా కోరుతూ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు అది..
అన్ని దేశాల మీద 15% టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించాడు!

నిజానికి అమెరికన్ చట్ట సభలు ఆమోదిస్తేనే ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ విధించగలడు ట్రంప్!
ఈ 15% కొత్త టారిఫ్స్ మీద కోర్టులో కేసులు వేస్తారు కాబట్టి మరో ఆరు నెలల వరకూ 15% టారిఫ్ ని వసూలు చేస్తాడు షరా మామూలుగా!
అమెరికన్ చట్ట సభలు రెసిప్రోకల్ టారిఫ్స్ ని ఇతర దేశాల మీద వేయడానికి ట్రంప్ కి అధికారం ఇవ్వవు.

ట్విస్ట్ ఏమిటంటే యూరోపియన్ యూనియన్ అమెరికా దిగుమతుల మీద విధించిన టారిఫ్స్ అలానే కొనసాగుతాయి కానీ EU మాత్రం అమెరికా కి టారిఫ్స్ కట్టవు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం!
అమెరికా, ఇజ్రాయేల్ స్నేహబంధం తాలూకు ఎఫెక్ట్ అమెరికా మునిగిపోవడానికి కారణం అవుతున్నది.
అమెరికన్ సంస్థలకి ఇవ్వాల్సిన రిఫండ్ వాళ్లకి ఇవ్వకుండా గాజా పీస్ బోర్డ్ కి ఇస్తే వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళతారు మా సొమ్ము ఇంకొకరికి దానం ఇవ్వడం ఏమిటంటూ!

ఇప్పటిదాకా ప్రపంచ దేశాల నుండి టారిఫ్స్ ద్వారా తీసుకున్న 350 బిలియన్ డాలర్లు తిరిగి ఇవ్వకుండా ఉండడానికి 15% టారిఫ్స్ అని కొత్త నాటకానికి తెర తీసాడు!
ఇరాన్ మీద యుద్దానికి కాలు దువ్వుతున్న అమెరికా కనుక సఫలం కాలేకపోతే మాత్రం ట్రంప్ రాజకీయ జీవితం క్లోజ్!
పుతిన్, జిన్‌పింగ్ ఇరాన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఈసారి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!
  • ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…
  • పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!
  • విజయ్ దేవరకొండ అరటి బోదెలను అడ్డంగా నరకాల్సి ఉంటుంది..!!
  • ముందే చెబుతున్నా… మొత్తం చదివాక అస్సలు నవ్వొద్దు సుమీ…
  • విధి రాత… డెస్టినీ… టైమ్… ఈ ఎయిర్ లిఫ్ట్ ప్రమాదమే పే-ద్ద ఉదాహరణ…
  • … ఈసారి ఆపరేషన్ సిందూర్ మామూలుగా ఉండదు..!!
  • రాజ్ షమాని… ఇండోర్ ‘సబ్బుల’ నుంచి ‘గ్లోబల్’ పాడ్‌కాస్టర్ వరకు…!
  • ఈ చివరి ఘడియల్లో… తెలంగాణ నుంచి మిగిలింది ఇక ఆ ఒక్కడేనా..?!
  • ఇప్పుడూ చూడొచ్చు..! ఇలాంటి భిన్నకథలు ఎప్పుడో గానీ రావు తెలుగులో..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions