.
పాడి కౌశిక్ రెడ్డి…! బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాడా..? పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అనివార్యంగా కేటీయార్, హరీష్ రావు వెనకేసుకొస్తున్నారు గానీ… తన ఓవరాక్షన్‌కు వాళ్లే ఎప్పుడో చెక్ పెడతారా..? అటు కాంగ్రెస్, అటు బీజేపీ కారాలు మిరియాలు నూరుతున్నవేళ… కౌశిక్ రెడ్డికి ఇకపై కూడా తిప్పలు తప్పవా..? ఇదీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఓ చర్చ…
నిజానికి బీఆర్ఎస్‌లో ఏం మాట్లాడినా కేటీయార్ లేదా హరీష్ రావు… అంతే… ఈమధ్య హరీష్ రావును కట్ చేస్తున్నట్టున్నారు కాబట్టి కేటీయారే సుప్రీం… (కేసీయార్ బయటికి రాడు, మాట్లాడడు కదా)… జగదీష్ రెడ్డి వంటి నాయకులే అనేక విషయాల్లో నోళ్లు మూసుకుని సైలెంటుగా ఉంటున్నారు, కానీ కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నాడు…
Ads
తద్వారా కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలకూ టార్గెట్ అవుతున్నాడు… అసలు బండి సంజయ్‌ను తనేమన్నాడో చూద్దాం… ‘‘బండి సంజయ్ డ్రగ్స్‌ను తంబాకులో కలుపుకుని తింటడు, అందుకే సైడ్ ఎఫెక్ట్‌గా వెంట్రుకలు ఊడిపోయి, గుండు అయిపోయింది… కమాన్, డేట్ ఫిక్స్ చేయి, రేవంత్, నువ్వు డ్రగ్ టెస్టుకు వస్తారా..? కేటీయార్ కూడా వస్తాడు’’ ఇలా సాగింది తన మాటల తీరు… (రేవంత్ రెడ్డిపై కేటీయార్ వాడే అడ్డగోలు భాషను స్పూర్తిగా తీసుకున్నాడా, తన ఒరిజనల్ స్టయిలే అదా…)
ఇక్కడ రెండు అంశాలు… కేటీయార్, బండి సంజయ్ ఒకరినొకరు రాజకీయంగా ఏవో సవాళ్లు చేసుకుంటారు, వోకే… మధ్యలో కౌశిక్ రెడ్డి ఎంటరై ఈ కామెంట్లు ఎందుకు చేసినట్టు..? కేటీయార్ తరఫున తనే డ్రగ్ టెస్టుకు రెడీ అని ప్రకటించడం దేనికి..? మధ్యలో రేవంత్ రెడ్డి ఎందుకు రావాలి డ్రగ్ టెస్టుకు..? దాంతె బండి సంజయ్ కేడర్‌కు మండింది… ఫలితం… కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడి చేశారు…
పైకి అందరూ ఇది మంచిది కాదనే ఖండిస్తారు… కానీ లోలోపల ఫీలింగ్ వేరు… ప్రభుత్వ విప్ విజయరమణారావు, విప్ యెన్నం, ఎమ్మెల్సీ సారయ్య ఏమంటున్నారు… ‘‘కౌశిక్‌ను ఎప్పుడో తంతారని అనుకుంటూనే ఉన్నాం, కరీంనగర్‌లో నిజమైంది’’… చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అయితే ‘స్వాగతిస్తున్నాం’ అని పోస్టు పెట్టాడు… (తరువత డిలిట్ చేశాడు)… భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయన్నాడు…
బండి సంజయ్ ఫైటర్, గల్లీ నుంచి చాలా సవాళ్లను ఎదుర్కుని ఎదిగినవాడే… కౌశిక్‌రెడ్డికి కాస్త టేస్ట్ చూపించాలని అనుకున్నాడు… మా కార్యకర్తలను తక్కువ అంచనా వేస్తున్నావా..? మావాాళ్ల దమ్మేందో తెలిసిందా..? అన్నాడు… (అఫ్‌కోర్స్, ఖండించాలి కాబట్టి ఖండించాడు)… సహనం పిరికితనం కాదు అని చెప్పడం ద్వారా ‘బీకేర్ ఫుల్’ అనే మెసేజ్ పంపించాడు…
ప్రజల తరఫున ప్రశ్నిస్తే దాడి చేస్తారా..? ఇదీ బీఆర్ఎస్ ప్రశ్న… ఏవైనా ప్రజాసమస్యల్ని ప్రస్తావించాడా కౌశిక్… బూతులు… ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశించి చేసిన చిల్లర వ్యాఖ్యలు… వాటిని సమర్థిస్తున్నాడు కేటీయార్… ఇలాంటివి ప్లస్ కౌశిక్ రెడ్డి తనకు, తన పార్టీకి కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయనీ, జనంలో పలుచన అయిపోతున్నామని గుర్తించడం లేదు…
నిజానికి కౌశిక్ రెడ్డి మొదటి నుంచీ అంతే… వివాదాస్పదుడు… ఏం మాట్లాడతాడో తనకే తెలియదు… బేసిక్‌గా తను తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకి, జగన్ కోసం మానుకోటలో రాళ్ల యుద్ధంలో జగన్ సైనికుడు… (తుమ్ రెడ్డీ. మై రెడ్డీ అనుకున్నాడు గానీ, ఏపీ- తెలంగాణ సోయి లేదు అప్పటికి…)…సరే, ఫక్తు తెలంగాణ వ్యతిరేకులే తన పార్టీ ప్రాణాధారం అయిపోయిన కేసీయార్ పార్టీలోకి చేరాడు… పెళ్లాంబిడ్డల్ని ముందుబెట్టి వోట్లు వేయకపోతే చస్తాం అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు వోటర్లను… ప్రతిదీ ఇష్యూయే…
ఆమధ్య కరీంనగర్ సీపీని మతం పేరిట దూషించాడు, సీఐడీ నోటీసులు, విచారణ షురూ… నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కడియంను చూస్తూ బెదిరింపు సైగల దాకా… అందుకే బీఆర్ఎస్‌కు పాడి కౌశిక్ రెడ్డి తలనొప్పిగా మారుతున్నాడా..? కేటీయార్ తేల్చుకోవాలి..! కౌశిక్ రెడ్డి కూడా ఒక నిజాన్ని గుర్తించాలి… అది దొరల కుటుంబం, ఏదో ఓ దశలో వాళ్లూ వాళ్లూ ఒకటే... అవసరమైతే కౌశికులాంటివాళ్లను వాళ్లు ఇట్టే బలిపెట్టగలరు..!!
Share this Article