Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!

February 13, 2026 by M S R

.

పాత తెలుగు సినిమాల్లో విలన్ డెన్… కింద సలసలా మరుగుతున్న ఓ పే-ద్ద యాసిడ్ పాండ్… పైన కర్రకు హీరో తల్లినో, చెల్లినో, హీరోయిన్నో కట్టేసి… పైకీ కిందకీ ఆడిస్తూ… వికటంగా నవ్వుతూ… హీరోతో ఆడుకుంటుంటాడు విలనుడు… చాలా సినిమాల్లో చూశాం కదా… చివరకు విలనుడు అందులోనే పడి చస్తాడు…

సరే, విషయానికొద్దాం… ఎపిస్టీన్ కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ భయం గొలుపుతున్నాయి కదా… ఓ ప్రత్యేక దీవి… వందలుగా అమ్మాయిలు… డ్రగ్స్… ప్రపంచ ధనికుల కోసం ప్రత్యేక విమానాలు… సుఖాలు… ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన రెడ్ లైట్ ఐలాండ్… ఆ లైంగిక అక్రమాల సామ్రాజ్యంలో జరిగిన ఘోరాలు అనంతం…

Ads

చివరకు ప్రపంచంలో ఓ మాంచి దృఢమైన మానవ జాతిని క్రియేట్ చేసే ప్రయోగాలు కూడా చేశాడట… దానికోసం ప్రత్యేకంగా అమ్మాయిల్ని ఎంచుకుని గర్భిణులను చేసి, మెరుగైన ఓ సంకరజాతి, అనగా హైబ్రీడ్ మనుషుల్ని సృ‌‌ష్టించే ప్రయత్నం…

సరే, బయటపడుతున్న చాలా కథలో ఓ విషయం ఆసక్తిని రేపింది… అదేమిటంటే..? 2018లో ఎఫ్బీఐ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన రోజే, ఎపిస్టీన్ ఏకంగా 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసినట్లు తాజాగా విడుదలైన దర్యాప్తు పత్రాలు వెల్లడిస్తున్నాయి… డ్రమ్ముల కొద్దీ యాసిడ్… ఎందుకోసం?

2018 జూన్ 12న ఎపిస్టీన్ తన సొంత ద్వీపమైన ‘లిటిల్ సెయింట్ జేమ్స్’ ఐలాండ్‌కు 55 గ్యాలన్ల చొప్పున భారీ యాసిడ్ డ్రమ్ములను తెప్పించుకున్నట్లు అతడి మెయిల్ రసీదుల ద్వారా స్పష్టమైంది… సాధారణంగా ఆ ద్వీపంలోని ఆర్వో నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ యాసిడ్ వాడతామని అతడి తరపు వాదనలు ఉన్నప్పటికీ.., నిపుణులు మాత్రం దీన్ని తీవ్రంగా తోసిపుచ్చుతున్నారు…

కేవలం నీటి ప్లాంట్ నిర్వహణకు ఇంత భారీ మొత్తంలో అత్యంత గాఢత కలిగిన సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం లేదని చెబుతున్నారు… దర్యాప్తు అధికారులకు ఆధారాలు దొరకకుండా మానవ అవశేషాలను లేదా ఇతర భౌతిక సాక్ష్యాలను పూర్తిగా కరిగించి వేసేందుకే అతడు ఈ రసాయనాన్ని తెప్పించి
ఉంటాడనే అనుమానాలు బలపడుతున్నాయి…

అంటే, మన పాత సినిమాల్లో విలన్లలాగే… అవసరమైతే మనుషుల్ని కూడా..?! మరోవైపు, ఇటీవల బయటపడిన డాక్యుమెంట్లలో ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ వంటి వారు ఎపిస్టీన్‌తో కలిసి ఒక డిన్నర్ పార్టీలో పాల్గొన్నట్లు ఉన్న ఫోటోలు ఇంటర్‌నెట్‌లో దుమారం రేపుతున్నాయి… ఈ పార్టీని ఎపిస్టీన్ తన డైరీలో
“వైల్డ్” అని అభివర్ణించడం గమనార్హం…

ఎఫ్బీఐ నిఘా మొదలైన రోజే ఇంత పెద్ద మొత్తంలో యాసిడ్ కొనుగోలు చేయడం, కీలక వ్యక్తులతో సంబంధాలు ఉండటం చూస్తుంటే… ఈ కేసులో బయటపడాల్సిన చీకటి కోణాలు మరెన్నో ఇంకా ఉన్నాయని ప్రపంచం నమ్ముతోంది… తవ్వుతూ పోతే ఇంకెన్ని చీకటి రహస్యాలో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!
  • ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!
  • అతడు… టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు… థియేటర్లకు మళ్లీ వస్తాడట…
  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?
  • D-Dad …! చిన్నారులకు డిజిటల్ చెర నుంచి విముక్తి… గుడ్ ప్రోగ్రామ్..!!
  • లైఫ్ పీర్..! మన శనిగరం ఉదయ్ నాగరాజు కొత్త హోదా కథేమిటి..?!
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు- గేట్ వే ఆఫ్ హైదరాబాద్… ఏమిటివి..? ఎక్కడ..?
  • దేవుళ్లు ఎవరి గుప్పిట్లో ఉన్నారు..? అసలు విముక్తికి ఏమిటీ మార్గం..?!
  • కౌంటర్ నెరేటివ్స్..! ఆ లడ్డూ నెయ్యికీ, ఈ పెరుగుకూ లింకేమిటి..?
  • బెడిసికొట్టిన పాము కుబుసం ప్లాన్… టీవీ సీరియళ్లు తెగ చూసేదేమో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions