Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాధలో భర్తకు తోడుగా నీడగా… ఈ అమెరికన్ తులసిని మెచ్చుకోవాలి…

May 24, 2026 by M S R

.

Jagannadh Goud …. పాశ్చాత్య దేశాల్లో కుటుంబ విలువలు ఉండవు, మన దేశంలో మాత్రమే కుటుంబం,  ఆ విలువలు ఉంటై అనేది పచ్చి అబద్ధం… అమెరికాలో డైరక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెల్లిజెన్స్ అంటే చాలా అత్యున్నతమైన పవర్ ఫుల్ స్థానం. ఆ స్థానంలో ఉన్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాల క్రితం పెండ్లి చేసుకున్న తన భర్తకి ఈ మధ్య క్యాన్సర్ సోకింది.

అది కూడా బోన్ క్యాన్సర్ అంటే బతకటం చాలా కష్టం. అయినా తన భర్తకి తోడుగా, నీడగా ఉండటం కోసం, పక్కన ఉండి ధైర్యం చెప్పటం కోసం అత్యున్నతమైన, పవర్ ఫుల్ పదవికి రాజీనామా చేసింది తులసి…

Ads

అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటేరియేట్ ఆఫ్ స్టేట్/ డిఫెన్స్ తర్వాత ఆమెదే అత్యున్నత స్థానం. అమెరికాలో టాప్ 10 అధికార స్థానాల్లో ఒకటి. CIA, FBI, మిలటరీ ఇంటెల్లిజెన్స్, నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ అన్నీ ఆమె ఆధీనంలోనే ఉంటై. కానీ కష్టకాలంలో తన భర్తకి తోడుగా ఉండాలి అని తులసి తన పదవికి రాజీనామా చేశారు.

న్యూజిల్యాండ్ ప్రధాని అంటే ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఇంతక ముందు న్యూజిల్యాండ్ ప్రధాని కూడా కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం కోసం ప్రదాని పదవికి రాజీనామా చేశారు జెసిండా. ఇలా చెప్పుకుపోతే వేల, లక్షల ఉదాహరణలు కనిపిస్తాయి.

పాశ్చాత్య దేశాలు అనగానే కుటుంబం ఉండదు, కుటుంబ విలువలు ఉండవు అనేది పూర్తిగా తప్పు. నిజానికి అక్కడే చాలా ఎక్కువ మంది కుటుంబం కోసం చాలా ఎక్కువ సమయం కేటాయిస్తారు. పిల్లల ఈవెంట్స్ కోసం ప్రత్యేక సమయం గడుపుతారు, పిల్లల మెంటల్ హెల్థ్ కోసం, కుటుంబం కోసం క్వాలిటీ సమయం గడుపుతారు.

అలా అని మన దేశం లో లేదు అని కాదు. మన దగ్గర కూడా బలమైన బంధాలు ఉన్నై కానీ కుటుంబ విలువలు అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి జీవితాన్ని ఇంకొకరు గౌరవించడం కూడా కుటుంబ విలువలే.

చివరికి మంచి కుటుంబం అంటే…: భయభక్తులు ఉన్న ఇల్లు కాదు; మనసుకు ప్రశాంతత ఇచ్చే స్థలం. పాశ్చాత్య దేశాల్లో కుటుంబ విలువలు అంటే “నువ్వు మా మాట వినాలి” కాదు. “నీ జీవితం నువ్వు సంతోషంగా జీవించాలి, మేము నీకు సపోర్ట్ గా ఉంటాం” అనే భావన.

మనం చాలాసార్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉంటేనే కుటుంబం, కుటుంబ విలువలుగా చూస్తాం. కానీ పాశ్చాత్య దేశాల్లో కుటుంబ విలువలు అంటే కుటుంబ సభ్యుల వ్యక్తిత్వానికి, సమయానికి, మెంటల్ హెల్థ్ కి, వ్యక్తిగత ప్రాధాన్యతలకి ఇచ్చే గౌరవం. కుటుంబ విలువలు అంటే కేవలం కలిసి ఉండటం కాదు. ఒకరి సంతోషం, మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ స్వేచ్ఛని గౌరవించటం. అది పాశ్చాత్య దేశాల్లో మెండుగా ఉంది.

మన దేశంలో అయినా, పాశ్చాత్య దేశాల్లో అయినా వ్యవస్థలు వాటి అమలు విధానం వేరు కానీ మనిషి సాధారణ స్వభావం ఒక్కటే అంటారు… తులసమ్మా, నువ్వూ నీ భర్త బాగుండాలి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!
  • బాధలో భర్తకు తోడుగా నీడగా… ఈ అమెరికన్ తులసిని మెచ్చుకోవాలి…
  • రైల్వే స్టేషన్ మధ్యలోనే కబ్జాలు… చివరకు బుల్‌డోజర్లే సొల్యూషన్…
  • మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?
  • ఏపీ పెట్టుబడుల కథల్లో… లెక్కలకంటే ‘సంపాదన’ ప్రశ్నలే ఎక్కువ..!
  • ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…
  • ఐపీఎల్ చివరి దశలోనూ బుడ్డోడే మళ్లీ కీలకం… అదెలాగంటే…
  • కుర్చీ మడతపెట్టిన తాతకు ఎందరు ఫాలోయర్లు ఉన్నారో తెలుసా..?!
  • మిస్టర్ కూల్…! నిశ్శబ్దంగా ముగిసిన ఒక శకం… నిరాసక్తంగా…!!
  • భానుమతికి ఇలాంటి పాత్రలు పడాలి… ‘పెద్దరికం’తో రెచ్చిపోదా మరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions