Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కడియం, దానం… అసలు జవాబులు దొరకని కొన్ని భేతాళ ప్రశ్నలు…

March 11, 2026 by M S R

.

బీఆర్ఎస్ లీగల్‌గా, టెక్నికల్‌గా తన వాదనల్లో బలం లేక, నిరూపించలేక… కాంగ్రెస్ వైపు వెళ్లిన తన ఎమ్మెల్యీలపై అనర్హత వేటు వేయించలేకపోయింది… ఇది బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యం మాత్రమే కాదు… తను తన పదవీకాలంలో సంపూర్ణంగా మరిచిపోయి. బరితెగించిన ఓ అనైతికతను మరోసారి జనానికి ప్రదర్శించుకుని మరింత ఇజ్జత్ పోెగొట్టుకోవడం…

ఈమాత్రం దానికి జాతిపిత, బాపు…!! కేసీయార్ కూడా అప్పుడప్పుడూ ఆ పదాల ప్రయోగం పట్ల అసహనం ఫీలవుతాడేమో… సరే, విషయానికొద్దాం… తెలంగాణ స్పీకర్ దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు ఆరోపణల పిటిషన్లను కొట్టిపారేశాడు… అబ్బే, అంత స్పష్టమైన ఆధారాల్లేవు అన్నాాడు తన తీర్పులో… అదీ రేపు సుప్రీం గడువు కాబట్టి, దాన్ని గౌరవిస్తూ…

Ads

నిజానికి ఓసారి అనైతిక విషయానికి వద్దాం… అసలు తెలంగాణ రాజకీయాల్లో అసహ్యకరమైన పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది, ప్రలోభాలకు గురిచేసి జంపింగులను అక్కున చేర్చుకున్నది కేసీయార్… అత్యంత అనైతిక వర్తన… జాతిపిత, బాపు బిరుదుల్ని కూడా మొత్తం మింగేసే అనైతిక రాజకీయ ప్రవర్తన…

వీళ్లు ఫిరాయించరు అనుకున్నవాళ్లను కూడా తన క్యాంపులోకి చేర్చుకుని, టూథర్డ్ పద్ధతిని లెజిస్లేచర్‌కూ వర్తింపజేసిన అఘాయిత్యం… టూథర్డ్ అనేది పార్టీకి వర్తిస్తుంది, పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే కాదు… సరే, ఏదో అఘోరించాడు… తను పెద్ద నీతిమంతుడిలాగా…. ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు..!!

పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, భ్రష్టుపట్టింది అనుకుని కాంగ్రెస్ లోకి జంప్ కాగానే… బోలెడు నైతిక సూత్రాలు వర్తిస్తూ తన నెత్తుటి వారసుడు కేటీయార్, మరో బంధువారసుడు హరీష్ రావును ఉసిగొల్పాడు…

ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్తారు, ఎవరో సంబంధం లేని (అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, కార్యదర్శి గట్రా గాకుండా…) వ్యక్తులు స్పీకర్ కోర్టుకు ఫిర్యాదు చేస్తారు… పార్టీ ప్రెసిడెంటుగా నువ్వెందుకు స్పందించవు అని ఎవరూ అడగరు, అడిగినా తను చెప్పడు, జనం మీద అలిగిన ప్రపంచ మొదటి రాజకీయ నాయకుడు కదా…

ఏదో ప్రజాక్షేత్రంలో జంపింగ్ జిలానీలను బదనాం చేయాలని ప్రయత్నించడమే తప్ప అసలు బీఆర్ఎస్ పోరాటంలో ఏమైనా లీగల్, టెక్నికల్ పాయింట్లున్నాయా అసలు..? మచ్చుకు కొన్ని…

1. దానం, కడియంలను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు… దానం అడుగుతున్నదీ అదే ఇప్పుడు… అసలు కవితను, ఈటలను సస్పెండ్ చేసినప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిన క్రమశిక్షణ కమిటీ వీళ్ల విషయంలో ఎందుకు లేదు..?

2. వర్కింగ్ ప్రెసిడెంటుగా కేటీయార్ తనే స్వయంగా స్పీకర్ కోర్టులో ఈ ఫిరాయింపుల్ని చాలెంజ్ చేసి ఉండాల్సింది కదా, ఇంకెవరో ఎమ్మెల్యేలు చాలెంజ్ చేయడం ఏమిటి..? (ఫాఫం హరీష్ రావును వదిలేయండి)…

3. వాళ్లు పార్టీ ఫిరాయించారు సరే, మరి నువ్వెందుకు వాళ్ల ఖాతాల నుంచి నెలనెలా బీఆర్ఎస్ఎల్పీ అవసరాల పేరిట 5 వేలు డ్రా చేసినట్టు..? అంటే, వాళ్లు నీ పార్టీలో కొనసాగుతున్నట్టు నువ్వే అంగీకరించినట్టు కాదా..?

4. పోనీ, స్పీకర్ తక్షణం దృష్టి పెట్టి, ఆలోచించేట్టుగా…. ఎప్పుడైనా విప్ జారీ చేస్తే ఈ జంపర్లు దాన్ని ఉల్లంఘించారా..? అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారా..? మరెలా స్పీకర్‌ను కన్విన్స్ చేయాలని అనుకున్నారు..?

5. దానం కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశాడు సరే, మరి అలా పోటీచేసినప్పుడు బీఆర్ఎస్ అధికారిక స్పందన ఏమిటి..? సస్పెండ్ చేశారా..? డిసిప్లినరీ నోటీసు ఏమైనా ఇచ్చారా..? లేదు కదా, రూల్స్ తెలిసిన జనం నవ్వుకున్నారు… కడియం కథ వేరు, తన బిడ్డ పోటీచేసింది కాంగ్రెస్ టికెట్ మీద, తను ఆమెకు ప్రచారం చేశాడు… పార్టీ అనుసరించే కొన్ని పద్దతులను తను వ్యతిరేకించకూడదని ఏమీ లేదు… విప్ ఉల్లంఘన వంటివి ఉంటే తప్ప లీగల్‌గా తనను బుక్ చేయడం కష్టం…

ఇవన్నీ వదిలేస్తే… అసలు వర్తమాన రాజకీయాల్లో పార్టీలనే విలీనం చేసుకునే దశలు నడుస్తున్నాయి… పార్టీ ఫిరాయింపులను పీక్స్‌లోకి తీసుకుపోవడంలో బీజేపీ తరువాత బీఆర్ఎసే ఫేమస్… ఆ ఇద్దరూ రహస్య స్నేహితులు… మరి వాళ్లకు ఈ జంపింగుల మీద పోరాడే నైతికార్హత ఉందా..? ఇలా చెబుతూ పోతే బోలెడు భేతాళ ప్రశ్నలు…

అవునూ, తదుపరి ఏం జరగనుంది..? మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు కూడా రేవంత్ రెడ్డిని కలిశారు… జానేదేవ్, గూడెం మహిపాల్‌రెడ్డి వంటి వాళ్లను వదిలేస్తే… రాబోయే హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల ఎన్నికల సమయానికి ఇంకా చాలా మార్పులు ఉంటాయనే అనిపిస్తోంది… ఏమో, సుప్రీం చట్టసభల స్పీకర్ల విచక్షణ, తీర్పుల్లో ఎంటర్ అవుతుందానే రాజ్యాంగ కీలక ప్రశ్నల్ని వదిలేస్తే..!!

.

సరే, ఇక ఏడ్చి మొత్తుకునే పింక్ నీతుల ప్రవచనకర్తలూ... కాస్త పాత ఫిరాయింపుల్ని, రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే మీ పెద్ద దొర అనైతిక, విఫల సమర్థనలను కాసేపు వదిలేస్తే... మీరెందుకు నిజంగా బలమైన లీగల్ పాయింట్లతో పోరాడలేకపోయారు..!? అనర్హత పిటిషన్లను కొట్టేయడానికి స్పీకర్ పరిగణనలోకి తీసుకున్న పాయింట్లు తెలిస్తే బాగుండు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!
  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?
  • ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!
  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!
  • ఓ లయబులిటీ..! KCR వదిలించుకుంటే కాంగ్రెస్ నెత్తిన మోస్తోంది..!!
  • మన సుబ్రహ్మణ్యానికి మలయాళీలు చూపిన అరుదైన గౌరవం..!!
  • ఇదీ ఓ పులిట్జర్ ఫోటో కథే… మనసుతో చదవండి… అర్థమవుతుంది…
  • మీకెవరికీ తెలియని వేటూరి… పాటూరి కాదు, సహృదయ బాటూరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions