Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేమిటో… ఆ వయస్సులో వైవిజయతో స్టెప్పులు- రమ్యకృష్ణతో రొమాన్స్…

February 20, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు . పాతాళభైరవిలో . ఓ యువతి బుర్రలో ప్రేమను రాజేసేందుకు చక్కగా , అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న ఓ ప్రౌఢ జంట తామే కష్టాల పాలు కావటం 1990 నవంబరులో వచ్చిన ఈ దాగుడుమూతల దాంపత్యం .

ఫక్తు సంసార పక్ష , ఎమోషనల్ డ్రామా . దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ఓ మంచి సినిమా .  ఏయన్నార్ , శారద అన్యోన్య ప్రౌఢ జంట . వారికి సన్నిహితులు గుమ్మడి . ఆయన కూతురు వాణీ విశ్వనాధ్ రిటైర్డ్ మేజర్ అయిన బాబాయి వద్ద ఉండి చదువుకుంటూ ఉంటుంది .

Ads

ప్రేమ ద్వేషి . ఆమెలో ప్రేమను రాజేసేందుకు ఏయన్నార్ , శారదలు ఓ ప్లాన్ వేసుకుని మేజర్ గారింటికి శారద , పక్కింట్లో ఏయన్నార్ చేరుతారు .

మూగమనసులు సినిమాలో పడవ నడిపే గోపిలాగా వాణీ విశ్వనాధుని తన రిక్షాలో కాలేజీకి తీసుకుని వెళుతూ ఉంటాడు రాజేంద్రప్రసాద్ . అయితే ఈ రిక్షావాడు అమ్మాయి గోరిని ప్రేమిస్తుంటాడు .

ఇంతలో సినిమాలో ఓ కుదుపు చోటు చేసుకుంటుంది . రమ్యకృష్ణ ఏయన్నారుకు భార్యనంటూ దిగిపోతుంది ఓ శుభ ముహూర్తాన . రమ్యకృష్ణని చూసి శారదకు అనుమానం కలుగుతుంది . వాళ్ళిద్దరి కాపురం కొల్లేరవుతుంది . వాళ్ళ టైం బాగుండి రమ్యకృష్ణకు పోయిన మతి వచ్చి , తాను భార్యను కానని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు .

అక్కినేని

పెద్ద ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన రమ్యకృష్ణ భర్త అచ్చం ఏయన్నార్ లాగా ఉంటాడు . ఆమె రిక్షా రాజేంద్రప్రసాద్ చెల్లెలు . దానితో చనిపోయిన తన బావ పోలికతో ఉన్న ఏయన్నారుకు అంటగడతానికి ప్లాన్ చేస్తాడు . అందరికి అన్నీ తెలవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమా సంసారపక్షంగా సాగుతుంది . ఏయన్నార్ సోగ్గా ఉంటాడు . చొక్కాలు బాగుంటాయి . శారదతో , రమ్యకృష్ణతో , వయ్యారాల వై విజయతో సహా డాన్సులు వేస్తాడు . తార నృత్యాలను బాగానే కంపోజ్ చేసింది . పాటల చిత్రీకరణ బాగుంటుంది .

పాటలనన్నీ వేటూరి వ్రాయగా కీరవాణి సంగీత దర్శకత్వాన్ని వహించారు . బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో , రమణ శ్రావ్యంగా పాడారు . రాజేంద్రప్రసాద్ , వాణీ విశ్వనాధుల డ్యూయెట్ డాన్సులు బాగుంటాయి . Enjoyable

ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , సత్యనారాయణ , వై విజయ , నిర్మలమ్మ , సుత్తి వేలు తదితరులు నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . శాకాహార సినిమాల ప్రేమికులకు బాగుంటుంది . ట్రై చేయండి .

నేను పరిచయం చేస్తున్న 1242 వ సినిమా ……. #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ బాటలో మోడీ..! సోషల్ మీడియా విషానికి విరుగుడు మంత్రం..!!
  • షారూక్ పాత వీడియోలు… నెట్‌లో దుమ్ముదుమారం… కూలుతున్న ఖాన్ కోటలు…
  • అప్పట్లో చిరంజీవి అంటే అంతే… ఒకేరోజు నాలుగుచోట్ల శతదినోత్సవాలు…
  • చందమామ రమ్మంది..! నలుగురు ఇప్పుడే బయల్దేరారు..!
  • MaViGun..! అర్థం కాలేదా..? ఏపీ రాజధాని అట… జగన్ కొత్త ప్లాన్..!!
  • పాపం, ఇటలీ గుండె పగిలింది… ఎందుకో తెలుసా..?
  • ట్రంపు పుణ్యాన పులిరాజాకు మళ్లీ ఎయిడ్స్ ముప్పు..?!
  • హైదరాబాదీ రాజసం..! ఎవరు ఈ రియా పిళ్లై..? ఎందుకు మళ్లీ వార్తల్లోకి..!?
  • పొదుపు వేరు- పిసినారితనం వేరు… శృతిమించితే పెళ్లామే వదిలేస్తుంది…
  • జమీల్ జమాలి అలియాస్ నబీల్ డబోల్… ఇంతకీ ఎవరితను..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions