Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశం మరిచిన ‘అసలైన’ ధురంధరుడు… సరిహద్దులు దాటిన ఆ మౌన గాథ..!

February 10, 2026 by M S R

.

దేశం మరిచిన ‘అసలైన’ ధురంధరుడు: సరిహద్దులు దాటిన ఆ మౌన గాథ! 

ధురంధర్ సినిమా రీసెంట్ డేస్‌లో ఓ సెన్సేషన్… వందల కోట్ల వసూళ్లు… నిర్మాత- దర్శకులు దీన్ని కల్పిత కథ అని చెబుతున్నా సరే… పలు రియల్ స్టోరీలతో ఇన్‌స్పయిరై రాసుకున్న స్టోరీ అది… లీగల్ ఇబ్బందులతో కల్పిత కథ అని ప్రకటిస్తున్నారు… తప్పదు…

Ads

ముందుగా ఓ చేదు నిజం చెప్పుకోవాలి… దేశం తరఫున గూఢచారులుగా పనిచేసే వాళ్ల జీవితాలు జేమ్స్ బాండ్ కథల్లా ఉండవు… పైగా పట్టుబడితే దేశం మా మనిషి అని చెప్పుకోదు… గూఢచారి అని అంగీకరించదు… అదొక విషాదం… సరే, ధురంధర్ సినిమాలో చూపించిన ఓ గూఢచారి కథ జల్లా రోషన్ లాల్‌ కథే అని ప్రచారం సాగుతోంది… ఆయన కథే చెప్పుకుందాం ఓసారి…



స్పై

సినిమా తెర మీద గూఢచారి అంటే కోట్లు కురిపించే ‘ధురంధరుడు’… సూటు బూటు వేసుకుని, విదేశీ కార్లలో తిరుగుతూ దేశాన్ని రక్షించే సూపర్ హీరో… కానీ, నిజ జీవితంలో గూఢచారి అంటే..? చీకటి గదుల్లో చిత్రహింసలు, కన్నవారికి దూరంగా దశాబ్దాల నిరీక్షణ, చివరకు మాతృభూమికి చేరుకున్నాక మిగిలే అజ్ఞాత వాసం… కష్టాలు…

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ధురంధర్’ సినిమా ట్రెండ్ అవుతున్న వేళ… మన కళ్లముందు కదలాడుతున్న ఒక విషాద దేశభక్తి కావ్యం రోషన్ లాల్ జల్లా…

గుర్తు తెలియని ప్రయాణం.. గుర్తించలేని సమాచారం! అది 1960ల చివర… దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాలం… జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రోషన్ లాల్ జల్లా తన కంటి నిండా దేశభక్తిని, గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని సరిహద్దులు దాటాడు… పాకిస్థాన్ సైనిక కదలికలను కనిపెట్టడం కోసం తన ఉనికినే మార్చుకున్నాడు… 1969 నుండి 1971 వరకు ఆయన పంపిన ఒక్కో సమాచారం మన సైన్యానికి ఒక ఆయుధమైంది… 1971 యుద్ధ విజయంలో తెర వెనుక ఇలాంటి ఎందరో అజ్ఞాత వీరుల నిశ్శబ్ద పోరాటం ఉంది…

15 ఏళ్ల నరకయాతన … దౌర్భాగ్యం 1972లో పట్టుబడ్డ రూపంలో వచ్చింది… పాక్ సరిహద్దులో దొరికిపోయిన రోషన్ లాల్‌ను అక్కడి జైళ్లలో పెట్టి నరకం చూపించారు… గూఢచారి అని తెలిశాక శత్రువు ఎంత కఠినంగా ఉంటాడో మనకు తెలుసు… 15 ఏళ్ల పాటు ఇనుప ఊచల వెనుక, చిత్రహింసల మధ్య ఆయన ప్రాణం కొట్టుమిట్టాడింది… కానీ, నోరు విప్పలేదు.. దేశ రహస్యాన్ని వదలలేదు…

తల్లి ఒడికి చేరినా.. దక్కని ఆదరణ! 1987లో ఖైదీల మార్పిడి ద్వారా ఆయన భారత్‌కు తిరిగి వచ్చాడు… తన దేశం తనను అక్కున చేర్చుకుంటుందని, తన త్యాగానికి కనీసం ‘గుర్తింపు’ దక్కుతుందని ఆశించాడు… కానీ, వ్యవస్థల తీరు వేరుగా ఉంది… నిఘా నిబంధనల సాకుతోనో, లేదా ఫైళ్లలో చిక్కుకున్న రాతల వల్లనో… ఆయనకు రావాల్సిన పెన్షన్ అందలేదు, సరైన వైద్య సాయం అందలేదు…

దేశం కోసం యవ్వనాన్ని పాక్ జైళ్లలో త్యాగం చేసిన ఆ వీరుడు, వృద్ధాప్యంలో తన బతుకుదెరువు కోసం, అనారోగ్యంతో పోరాడాల్సి వచ్చింది… 2021లో ఏ ఆర్తనాదమూ లేకుండా, ఎవరికీ తెలియని ఒక అనామకుడిలా ఆయన కన్నుమూశాడు…

మన బాధ్యత ఏమిటి? సినిమాలో ధురంధరులు మనకు వినోదాన్నిస్తారు… కానీ రోషన్ లాల్ జల్లా వంటి నిజమైన ధురంధరులు మనకు ‘స్వేచ్ఛ’ను ఇచ్చారు… సినిమా కథ ఈయనది కాకపోవచ్చు, కానీ ఈయన లాంటి వారి త్యాగాల పునాదుల మీదనే నేడు మన నిఘా వ్యవస్థలు, భద్రత వర్ధిల్లుతున్నాయి… దేశం కోసం సర్వం ధారపోసిన ఈ అజ్ఞాత వీరుడికి మనం ఇచ్చే కనీస గౌరవం… ఆయన కథను ఒకసారి స్మరించుకోవడం… శాల్యూట్ టు రోషన్ లాల్ జల్లా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… కేసీయార్‌ను కూడా ఇలా చూస్తామేమో… డెస్టినీ వదలదు…!!
  • BBB..! BJP- BRS Bhai Bhai..!! ఏమైనా డౌటా..? పదండి వివరాల్లోకి వెళ్దాం…!!
  • కవిత బాటలోనే కనిమొళి..? ఉదయనిధి వారసత్వంపై అసహనం..!!
  • మైండ్‌లెస్ ట్రోలింగ్..! సౌత్ టాప్ స్టార్ల ‘వేషాలు’ మరిచిపోయారా..?!
  • అప్పుడు ముత్తాత… 92 ఏళ్ల తరువాత ఇప్పుడు మునిమనమడు…
  • మళ్లీ అదే 1956 కథ..? అప్పట్లో బ్రిటన్… ఇప్పుడు అమెరికా..! సీన్ రివర్స్..!!
  • సౌందర్య గణితం..! జయప్రద మొహం కొలతలపై ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్..!!
  • కలికాలం..! మనం కన్నవాళ్లను, మనల్ని కన్నవాళ్లనూ నమ్మలేం..!!
  • తెలంగాణ జాతిపిత ఎవరో క్లారిటీ వచ్చేసింది… ఇక రచ్చ ఆపేయండి…
  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions