Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నీ దుకాణం మూసుకుంటావా’… నమస్తే తెలంగాణకు బిగ్‌ టీవీ సవాల్…

March 11, 2026 by M S R

.

తెలుగునాట తమ తమ రాజకీయ ధోరణులను బట్టి వివిధ మీడియా సంస్థలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, తిట్లతో తన్నుకోవడం చాలాసార్లు గమనించాం కదా… మరో ఆసక్తికరమైన సంవాదం ఇప్పుడు నమస్తే తెలంగాణ వర్సెస్ బిగ్‌టీవీ మధ్య మొదలైంది…

విషయం ఏమిటంటే..? ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్) ఇవ్వడానికి కుదిరే ఒప్పందాలు ఇవి… లైవ్ మాటున కాసుల వేట అంటూ నమస్తే తెలంగాణ ఓ స్టోరీ రాసింది… అది ముఖ్యనేత బినామీ కంపెనీ, అడ్డగోలుగా రేట్లతో కంట్రాక్టు ఇచ్చారు అని రాస్తూ, కేరళ ఎన్నికల ఖర్చు కోసం అంటూ ఇష్టారాజ్యంగా… తన సహజమైన అడ్డదిడ్డపు శైలిలో ఏదో రాస్తూ పోయింది…

Ads

(ఈమధ్య ఆ టీవీ కేరళలో ప్రసారాలు ప్రారంభించినట్టు గుర్తు)… నమస్తే తన కథనాల్లో పేరు రాయలేదు గానీ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసింది… ప్రతి అక్షరంలోనూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటుంది కదా… ఎవరిపైనైనా బురద జల్లగలదు కదా…

సావీ స్మార్ట్ సొల్యూషన్స్ (లైవ్ ప్రసారాల సంస్థ) కు ఏకంగా రెండున్నరేళ్లలోనే 150 కోట్ల మేరకు దోచిపెట్టే ప్రయత్నం, గ్రీన్ చానెల్‌లో చెల్లింపులు అన్నట్టుగా ఏదో రాస్తూ పోయింది… (ఈ సంస్థలో బిగ్‌ టీవీ మాత్రమే కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సన్నిహిత బంధువు కూడా మరో ముఖ్యమైన పార్టనర్…) సో, నమస్తే తెలంగాణకు బిగ్ టీవీ (స్వేచ్ఛ డిజిటల్ మీడియా) ఓ సవాల్ విసిరింది… రాసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా మేం మొత్తం మూసేసుకుంటాం, నీకు ఆ దమ్ముందా అనేది ఆ సవాల్ సారాంశం…

నమస్తే

వైఎస్ ఉన్నప్పుడు ధాత్రి సంస్థ లైవ్ ఇచ్చేది… ప్రోగ్రామ్‌కు 5 లక్షల దాకా తీసుకునేదని గుర్తు… (అప్పట్లో DSNG ప్రొఫెషన్ కొత్త)… (ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చానెల్స్, యూట్యూబర్లు కూడా liveU పద్ధతికి వెళ్లిపోయారు… సరే, ఇది, Bongding Technology వంటి కొత్త టెక్నాలజీ ఏమిటనేది వేరే కథ…)  తరువాత ఏపీలో జగన్ పీరియడ్‌ వచ్చాక దాన్ని 3.5 లక్షలకు తగ్గించినట్టు కూడా గుర్తు…

తెలంగాణ ఏర్పడ్డాక ఏస్ మీడియా రంగప్రవేశం చేసింది… (హరీష్ రావు దగ్గర బంధువు సంస్థ అంటారు మరి)… దానికి లైవ్ కంట్రాక్టులు ఇచ్చారు… మొదట్లో 4.95 లక్షల రేటు ఉంటే దాన్ని క్రమేపీ పెంచి 2019 నాటికి ఏకంగా 8.5 లక్షలకు ఒప్పందం చేసుకుని, తరువాత 6.5 లక్షలకు సవరించారని స్వేచ్ఛ మీడియా కథనం…

కానీ మేం మాత్రం మొదట 5 లక్షలే తీసుకున్నాం, ఇప్పుడు 6 లక్షలకు పెరిగింది, ఆ చెల్లింపులూ ఏడాదిగా లేవు… మరి ఏస్ మీడియా దోచుకుందా..? మేం దోచుకుంటున్నామా..? అనేది బిగ్ టీవీ సవాల్… నమస్తే తెలంగాణ, టీన్యూస్‌లకు 2023-24 సంవత్సరంలో 13.74 కోట్ల చెల్లింపుల కథేమిటని అడిగింది… 2 రోజుల్లో ఆరోపణలు నిరూపించు, 12 నెలలుగా కనీసం ఒక్క బిల్లయినా చెల్లింపు జరిగిందా చూపించు, లేకపోతే నీ దుకాణం బంద్ పెట్టుకుంటావా అనేది ఆ సవాల్ సారాంశం… (బిల్లుల చెల్లింపు సరిగ్గా లేక ప్రస్తుతం బిగ్‌టీవీ కూడా ఈ లైవ్ ప్రసారాలు ఆపేసినట్టుంది…)

(కేసీయార్ పాలనలో తప్పుడు సర్క్యులేషన్, ఎక్కువ టీఆర్పీలు చూపించి, నమస్తే తెలంగాణకు, టీన్యూస్‌కు అడ్డగోలు రేట్లకు తెలంగాణ జనం సొమ్మును దోచిపెట్టారనే విమర్శలున్నవే… వాటి జోలికి బిగ్ టీవీ ఇంకా వెళ్లినట్టు లేదు…)

ఏపీలో ఆంధ్రజ్యోతికి ఈ లైవ్ కంట్రాక్టులు ఇచ్చినట్టున్నారు… ఆ రేట్లు తెలియవు… అనుకూల ప్రభుత్వం అస్మదీయులకు ఈ లైవ్ కంట్రాక్టులు అనేది కొత్తేమీ కాదు, అందులో వందల కోట్ల దందా ఏమీ లేదు… ఎటొచ్చీ కేరళ ఎన్నికల ఖర్చు అని ముడిపెట్టిన నమస్తే రాతలతో ఇది కాస్తా పొలిటికల్ రచ్చ అయిపోయి, ఇదుగో ఈ సంవాదం, ఈ వివాదం, ఈ సవాళ్ల పర్వం..!! అవునూ, పింక్ క్యాంప్ ఆరోపణలపై సమాచార మంత్రిత్వ శాఖ ఏమైనా స్పందించిందా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘నీ దుకాణం మూసుకుంటావా’… నమస్తే తెలంగాణకు బిగ్‌ టీవీ సవాల్…
  • సిందూర్ దెబ్బ… రిపేర్లూ కష్టమై ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’ కూల్చివేత…
  • కక్కు- కిక్కు…! సర్కారు సారా Vs చీప్ లిక్కర్…! ఏ భూతం తక్కువ డేంజర్…?!
  • మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…
  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….
  • అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? పాకిస్థాన్ పుండు మీద కారం..!!
  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!
  • “పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions