Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా మోడీకి..?

February 15, 2026 by M S R

.

దెబ్బ తగిలితే గానీ, తత్వం బోధపడదు అంటారు ఎంతోకాలంగా పెద్దలు… మోడీకి ఇప్పుడు అర్థమైంది… అనైతికుడు, ఈమాట అనడానికి ఏమాత్రం సందేహించడం లేదు, అసలు నరవాణే అనేవాడు ఈ అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ఆర్మీ చీఫ్‌గా పనిచేయడమే ఈ వ్యవస్థ దౌర్భాగ్యం…

నరవాణే… ఈ దేశ వ్యవస్థల్ని కించపరుస్తూ… అవమానిస్తూ… ఏదో తిక్క పుస్తకం రాశాడు… ఇలాంటి పుస్తకాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసే మరో దేడ్ దిమాక్ పెంగ్విన్ సంస్థ ప్లస్ యాంటీ నేషనల్ ఫోర్సెస్… ఈ పుస్తకం ప్రచురణకు నీకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందారా అనడగలేదు… పబ్లిష్ చేసి పారేసింది…

Ads

వాడు… అవును, వాడు అనడానికి సందేహించడం లేదు… దేశం, జాతి అనే ఏ సోయి లేని కేరక్టర్… ఏమన్నాడో ఏమో… ఏం పర్లేదు అన్నాడో ఏమో…  ఆ పెంగ్విన్ వాడు అచ్చేశాడు… ఇతర దేశాల్లో అమ్మకాలకు పెట్టేశాడు… ప్రిరిలీజ్ అనీ, రివ్యూ కాపీస్ అనీ దిక్కుమాలిన పేర్లతో దేశంలో అమెజాన్‌లో కూడా చెలామణీలోకి తీసుకొచ్చేశాడు…

దాన్ని పట్టుకుని, రాహుల్ గాంధీ అనబడే ఓ ఎయిత్, నైన్త్ క్లాస్ స్టూడెంట్ రచ్చ చేయబోయాడు… దేశాన్ని దేశదేశాలు తిరిగి కించపరచడమే కదా తన పని… అంతకుమించి ఇంకేమీ చేతకాదు కదా… గల్వాన్ మాత్రమే కాదు, శతృదేశాలతో ఘర్షణ సమయంలో దేశ ఉన్నత వ్యవస్థల నడుమ ఏ సంభాషణ జరిగినా అది కాన్ఫిడెన్షియల్ మాత్రమే… అవి అధికారిక రహస్యాలు… (చైనాలో ఈ పని గనుక చేస్తే రెండుమూడు రోజుల్లో శాల్తీ గల్లంతు అయి ఉండేది)...

నరవాణే

ఆ సోయి ఆ ‘వానరవాణే’కు లేదు, రాహుల్‌కూ ఎలాగూ ఉండదు… చివరకు ఈ శుష్క వివాదాన్ని ఏకంగా స్పీకర్ మీద అవిశ్వాసం దాకా తీసుకుపోయారు… అదేమంటే లోకసభలో ఆ పిచ్చోడిని మాట్లాడనివ్వడం లేదట… బయట చెప్పిందే లోపల చెబుతాడు, అదెవడికీ అర్థం కాదు కూడా, చూశాం కదా…

బడ్జెట్ మీద మాట్లాడరా మగడా అంటే… జియో పాలిటిక్స్ అంటాడు, వెండి- బంగారం ధరలు అంటాడు… ట్రంపుకు దాసోహం అంటాడు… బడ్జెట్‌కూ దానికీ లింకేమిటో తనకు తెలిసి చస్తే కదా… పక్కా డొల్ల బుర్ర…

యాంటీ నేషన్ సెక్షన్ బలంగా ఉంటుంది కదా మన దేశంలో… బహుశా ప్రపంచంలో ఇలాంటి దేశం ఇదొక్కటేనేమో..! పైగా ప్రధానిగా మోడీ కదా, యోగీ లేడు కదా… రచ్చ చేస్తారు, చేశారు, చేస్తున్నారు, చేస్తారు… ఇక ఇప్పుడేమైంది..?

తమ దాకా వస్తే కానీ చురుక్కుమని అనిపించదు కదా… మోడీ అనే కేరక్టర్‌కు ఎట్టకేలకు జ్ఞానోదయం అయ్యినట్టుంది… రిటైర్ అయ్యాక ఇరవై ఏళ్ళ దాకా మిలిటరీ ఆఫీసర్లు ఆటోబయోగ్రఫీలను వ్రాయకుండా సర్వీస్ రూల్స్ మార్చాలని కేంద్రం ఆలోచిస్తుందట … శుభం …

నరవాణే

  • అంతే కాదురా అయ్యలూ…! జడ్జీలు, IAS, IPS , IFS , IRS ఆఫీసర్లు , వైస్ చాన్సలర్లు , పెద్ద పెద్ద పదవులను వెలగబెట్టే వాళ్ళు ఎవరూ అనుమతి లేకుండా ఏదీ రాయొద్దని… కూలింగ్ పీరియడ్ పెట్టండి… తదుపరి రాజ్యసభ సభ్యులుగా , గవర్నర్లుగా , మరి ఏ ఇతర ప్రభుత్వ నియామకాలకు అర్హత లేకుండా బ్యాన్ పీరియడ్ పెట్టండి… దేశం బాగుపడుతుంది … ఆలోచించండి … ఈ దేశం దరిద్రం కాస్తయినా తగ్గుతుంది …

నరవాణే

కటువుగా ఉంది కదా... మన దేశానికి అదే పరిష్కారం... యాంటీ నేషన్ పార్టీలు, యాంటీ నేేషన్ సెక్షన్ల మీద విరుచుకుపడటం ఎలాగూ చేతకాదు... కనీసం విరుగుడు చట్టాలైనా చేయండిరా బాబూ..!!

కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు, కొన్ని సెక్షన్లకు యాంటీ బీజేపీకి, యాంటీ నేషన్‌కూ తేడా తెలియకపోవడంతోనే అసలు సమస్య... వీరిలో ప్రథముడు ది గ్రేట్ రాహుల్ గాంధీ... దేశానికి ఓ దరిద్రం తను..!! ఫస్టాఫ్ ఆల్ పెంగ్విన్ మీద నిషేధం పెట్టగలడా ది గ్రేట్ మోడీ... దేశం కోసం, ధర్మం కోసం..!!

చివరగా… రాజనీతి వేరు, యుద్ధనీతి వేరు… తేడా తెలియని నరవాణే వంటి వాళ్లు ఈ దేశానికి ఏకంగా ఆర్మీ చీఫ్‌లుగా పనిచేయాల్సి రావడం ఈ దేశం చేసుకున్న ఖర్మ..!! రాహుల్‌ను ఈ దేశం తన ఫాయిదా కోసం ఏమీ చేయలేదు గానీ… కనీసం నరవాణే మీద యాక్షన్ తీసుకోగలదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా మోడీకి..?
  • థర్మోబారిక్..! ఈ ఆయుధ ప్రయోగంతో మనుషులు ఆవిరైపోతారా..?!
  • వరల్డ్ కప్‌లో మరో వింత బౌలింగ్… నమీబియా ఎరాస్మస్ నయా వ్యూహం…
  • పిచ్చోళ్లు… 21 శతాబ్ధం ఇంకా బేవార్సుగా ఉంటుందని ఊహించలేదు…
  • జైలు – సానుభూతి… రేవంత్, లోకేష్‌ ‘సేమ్ టు సేమ్’ స్కెచ్…!
  • ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…
  • నిర్దోషిత్వం బయటపడేలోపు… నింద మాన్పలేని మచ్చల్ని మిగిలిస్తుంది…
  • వింత విజ్ఞత..! 90 శాతం గెలవని గెలుపు అసలు గెలుపే కాదట..!!
  • పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?
  • జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions