Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!

August 12, 2026 by M S R

.

ఫోక్ క్వీన్, యూట్యూబ్ ఫిమేల్ సూపర్ స్టార్, కొత్త సినిమా హీరోయిన్ నాగదుర్గ హఠాత్తుగా కొమరవెల్లి మల్లన్న గుడిలో దర్శనమిచ్చింది… ఎవరితో..? రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్‌తో కలిసి..! ఆమెకు మల్లన్న మీద గురి ఉన్నట్టుంది… మరెందుకు తనతో కలిసి అక్కడికి వచ్చి, దండలేసుకుని, ఫోటోలు కూడా దిగింది…  నో దాపరికం…

అబ్బో, ఏదో ఉంది వాళ్లిద్దరి నడుమ… ఈ ఊహాగానాలు ఒక్కసారిగా యూట్యూబ్ చానెళ్లలో, సైట్లలో, చివరకు మెయిన్ స్ట్రీమ్ బాపతు సైట్లలోనూ సాగాయి… అబ్బే, లేదు, లేదు, ఏదో కొత్త సినిమాకు ఇద్దరూ కలిసి సంతకం చేశారు, అలా మల్లన్న దగ్గరకు వచ్చి, అంతా మంచి జరగాలని కోరుకున్నారు, అంతే, ఈమాత్రానికి జత కలిపేస్తారా అని కొందరు కొక్కిరించారు… అనగా ఉల్టా ట్రోలింగ్ అన్నమాట…

Ads

మరి నిజం ఏమిటి..? రెండూ నిజమేనట… 1) ఇద్దరి నడుమ చాన్నాళ్లుగా పరిచయం ఉంది, కాస్త ఎక్కువై ప్రణయం దాకా వచ్చిందట… గుడ్, మంచి జోడీ, ఆల్ ది బెస్ట్…

నాగదుర్గ

2) ఒక  సినిమా వీళ్లిద్దరు జోడీగా రాబోతోంది… దీనికన్నా ముందే ఆమె ఇడుపు కాయితం సినిమాకు సంతకాలు చేసింది, ప్రియదర్శి హీరో, ఆ టైటల్ మీద ఆంధ్రా, తెలంగాణ లొల్లి కూడా జరిగిందిగా కొన్నాళ్లు… తాజా సినిమాకు కూడా మాంచి పవర్ ఫుల్ తెలంగాణ టైటిలే పక్కా…

దీన్ని సంపత్ నంది ప్రజెంట్ చేస్తున్నాడు… తన దగ్గర రైటర్ గా చేసిన గణేష్ డైరెక్టర్… సురేష్ బొబ్బిలి మ్యూజిక్… 14న రామానాయుడు స్టూడియోస్‌లో పూజ కూడా చేయబోతున్నారు… రీల్ కమ్ రియల్ జంట… గుడ్… ఎటొచ్చీ ఆమె తమిళ హీరోతో చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఆమె దురదృష్టం… లేకపోతే ఇంకాస్త హైలట్ అయ్యేదేమో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!
  • చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…
  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
  • చచ్చీ చెడీ… చావు దప్పి… ఓ అవమానకరమైన విజయం…
  • ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!
  • లిక్కర్ స్కాంలో జగన్‌ను లోపలేస్తారా..? ఏపీ పాలిటిక్స్‌లో చర్చ !!
  • ‘‘ దిగితే మావాడు సీఎం – మావాడు తలుచుకుంటే దేశానికే పీఎం… ’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions