Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’

May 14, 2026 by M S R

.

“దాదాపు పాతికేళ్ల క్రితం నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది… అప్పటికే నేను పెద్ద స్టార్‌ని… నాకోసం జనం ఎగబడతారని, ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కడతారని ఒక రకమైన ‘అహం’ ఉండేది… సరిగ్గా అదే సమయంలో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి వచ్చారు…

నేను వారి మధ్యలోనే ఉన్నాను. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు! కనీసం నా వైపు చూడలేదు కూడా… అప్పుడు నాకు అర్థమైంది… ఇక్కడ నేను స్టార్‌ని కాదు, కేవలం ఒక సాధకుడిని మాత్రమే అని… ఆ క్షణం నా స్టార్‌డమ్ ఎంత చిన్నదో నాకు బోధపడింది…”

నాకు ఇష్టమైనవి హిమాలయాలు… తరువాత ఈ ఆశ్రమమే… గురువు గారితో నాది సుదీర్ఘమైన ప్రయాణం… ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ వేళ ఇక్కడ ఉండటం నా అదృష్టం… ఆయన ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ చిరునవ్వు, ప్రశాంతత కొన్ని కోట్ల మందికి ధైర్యాన్ని ఇస్తున్నాయి… ఆయన కేవలం బోధనలు చేసే వ్యక్తి మాత్రమే కాదు, ప్రేమను పంచే ఒక గొప్ప శక్తి…”

Ads

“సినిమా ప్రపంచంలో గ్లామర్ ఉంటుంది, పేరు ఉంటుంది, డబ్బు ఉంటుంది… కానీ ప్రశాంతత (Peace of Mind) మాత్రం ఉండదు… అది కేవలం ఆధ్యాత్మికత వల్ల మాత్రమే సాధ్యం. బయట ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నా, ఇలాంటి ఆశ్రమానికి వచ్చినప్పుడు మన అహంకారాన్ని గేటు బయటే వదిలేయాలి… అప్పుడే మనం కొత్త విషయాలను నేర్చుకోగలం…”

“చాలామంది నన్ను అడుగుతుంటారు… ఇంత పేరు వచ్చినా మీరు ఎలా ఇంత సాధారణంగా ఉండగలుగుతున్నారు అని… దానికి కారణం నా గురువులు, నేను నడిచిన ఈ ఆధ్యాత్మిక బాట… ఈ ప్రయాణమే నన్ను ఒక మంచి మనిషిగా మార్చింది…”


 “మే 12, 2026న బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగిన గురువు రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల” సందర్భంగా రజినీకాంత్ చేసిన ప్రసంగంలోకి ఓ భాగం ఇది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?
  • భారీ మలుపు తిరిగిన ‘అదృశ్య సరస్వతి’… త్రివేణీ సంగమం…!!
  • What is Real Success..? నిజమైన సక్సెస్ స్టోరీ అంటే ఏమిటి..?
  • పాకిస్థాన్‌కు సింధుగండం… ఇండియా జలాల మళ్లింపు షురూ…
  • ఆలీకి ఆది నుంచీ అలవాటే… పిచ్చి కూతలు, ఇప్పుడు తిక్క యాడ్స్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions