Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిర్దోషిత్వం బయటపడేలోపు… నింద మాన్పలేని మచ్చల్ని మిగిలిస్తుంది…

February 14, 2026 by M S R

.

ఓ హిందీ పత్రిక అమర్ ఉజాలాలో ఒక వార్త… ఇంట్రస్టింగు… వ్యవస్థలు తొందరపడితే నిర్దోషుల జీవితాలు ఎలా కల్లోలానికి గురవుతాయో చెప్పే వార్త…

ఓ పదహారేళ్ల బాలిక… ఆమెపై అత్యాచారం… ఏదో వార్త… ఓ దళిత బాలికపై ఇద్దరు అగ్రవర్ణ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని..! హ్యాష్ ట్యాగులు, సోషల్ మీడియా రచ్చ, టీవీ డిబేట్లు… శిక్షించాలి, ఉరితీయాలి… తరువాత ఏం జరిగింది..?

Ads

ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు, ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టారు, పోక్సో కేసు నమోదైంది… కటకటాలు, పేరుకు ముందు ఓ మచ్చ… రేపిస్టు అని..! ఆ కుటుంబాలకూ సమాజంలో అవమానం… ఆ బాలిక కూడా అసలునిజం చెప్పలేదు… నిజం నిలకడ మీద తేలుతుంది అంటారు కదా, ఇక్కడా అంతే…

రకరకాల టెస్టులు… కాల్ రికార్డులు వేరే కథలు చెప్పాయి… అసలు నేరస్థుడు వేరే… సో, మళ్లీ విచారణ, మళ్లీ ప్రశ్నలు, మళ్లీ ఒత్తిడి… చివరికి బయటపడిన నిజం ఏమిటయ్యా అంటే… ఆమెకు సోదరుడి వరసయ్యే బంధువే ఆమెను మోసగించాడు…

తప్పుడు కేసు

.

ఒక నేరం జరిగినప్పుడు బాధితులకు న్యాయం జరగాలి, అందులో సందేహం లేదు… కానీ, కేవలం ఆరోపణల ఆధారంగా, విచారణ పూర్తికాకముందే, సరైన విచారణ జరగకముందే… మీడియా, సోషల్ మీడియా సంబంధం లేని వారిని ‘దోషులు’గా నిర్ణయించేసి, తీర్పులు చెప్పేయడంతోనే అసలు సమస్య…

ఈ కేసులో అసలు నిందితుడు రాహుల్… ఆమెకు వరుస సోదరుడు… గత నెల రోజులుగా బాలిక పెద్దనాన్న ఇంట్లోనే ఉంటూ ఆమెపై కన్నేశాడు… ఆగస్టు 24న ఆమెను నమ్మించి తోటలోకి తీసుకెళ్లి, బలవంతంగా బీర్ తాగించి అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడు… ఇదీ జరిగింది…

ఇప్పుడు నిజం తేలింది… పోలీసులు ఇప్పుడు ఆ ఇద్దరు యువకులపై ఉన్న అత్యాచారం, ఎస్సీ- ఎస్టీ సెక్షన్లను తొలగిస్తున్నారు… కానీ, ఆ యువకులకు పోయిన గౌరవాన్ని వ్యవస్థలు తిరిగి ఇవ్వగలవా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న… ఈ నేరానికి కుల రంగు పులిమి, ఇద్దరు అమాయక యువకులపై నేరారోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు…

నిర్దోషిత్వం రుజువైన రోజు జైలు తలుపులు తెరుచుకున్నాయి… కానీ సమాజం వేసిన మచ్చలు..? అది ఇంకా గట్టిగానే ఉంది… న్యాయం అంటే కేవలం దోషికి శిక్ష కాదు… నిర్దోషికి గౌరవం తిరిగి ఇవ్వడం కూడా… కానీ అది ఎలా..? ఇదొక చిక్కు ప్రశ్న..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘మృత్యుంజయా… ఇంతకీ ఈ సినిమా కథేమిటి మహాశయా…’
  • కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…
  • రామ‘దాసుడి నుంచి ఓ పంచముఖ మహాబలిగా పరివర్తన… ఓ పాఠం…
  • అంతటి జయప్రదకు ఆ గంభీర బాధిత పాత్ర… పైగా చంపేశారు…
  • సో వాట్..? దివ్వెల మాధురి ఐతేనేం… టీటీడీకి అంత భయమా..? జడుపా..?
  • గెలిచాం సరే… కానీ ఈ సెమీస్ గెలుపుకీ ఓ పోస్ట్ మార్టం అవసరం…
  • అవును, మేమిద్దరమూ ఒకటే… విజయ్- త్రిష బంధం ఇక బహిరంగమే…
  • ఊగిపోయిన ముంబై… తలెగరేసి మరీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో ఇండియా…
  • టీ20 వరల్డ్ కప్..! కెప్టెన్ అనాలోచిత వైఖరే ఇండియాకు పెద్ద బలహీనత..!!
  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions