Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీ అయ్య – నా మామ..! ఒక్క పాటకు సిప్లిగంజ్ కోటి రూపాయల ఖర్చు..!!

June 14, 2026 by M S R

.

అనుకోకుండా ఆహా ఓటీటీలో తేజస్వి మదివాడ కాకమ్మ కథలు షో చూడబడ్డాను… తనదైన పద్దతిలో అతిగా నవ్వుతూ, అతిగా మాట్లాడుతూ… కాస్త మసాలా భాషలో నడిపిస్తుంది… అగ్లీగా ఏమీ ఉండదు, బట్ అదో స్టయిల్… రీసెంట్ ఎపిసోడ్‌లో సింగర్స్ శ్రావణ భార్గవి, రాహుల్ సిప్లిగంజ్ కనిపించారు… అసలే రాహుల్ హుషారు పిట్ట, శ్రావణ భార్గవి స్పాంటేనియస్ పంచెస్ వేస్తుంటుంది… మదివాడ సరేసరి…

మనీ మేనేజ్‌మెంట్ అనే ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు… ఎక్కువ ఖర్చుల గురించి రాహుల్ ఓపెన్‌గా చెప్పుకున్నాడు… శ్రావణ భార్గవి అందుకుని ‘నీ అయ్య నా మామ’ వీడియో కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు గుర్తుచేసింది… ఒక్క వీడియోకు కోటి రూపాయలా..? ఆశ్చర్యం కలిగింది, మదివాడకే కాదు, చూస్తున్న నాకు కూడా…

Ads

తనే చెబుతున్నాడు… మరి ఏమనుకున్నారు, దుబయ్‌లో షూటింగ్, రియల్ పులి, ఇసుక దిబ్బలు… మస్తు ఖర్చయింది అని..! ప్రస్తుతం ప్రైవేటు ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలుసు కదా,, నిజానికి దీనికి ఆద్యుడు రాహుల్ సిప్లిగంజే… మొదట్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ మార్క్ ఫోక్ ఆల్బమ్స్ రిలీజ్ చేసేవాడు, మిలియన్ల కొద్దీ వ్యూస్ తనకు కొత్త కాదు, అసలు వాటితోనే పాపులర్,, ఆస్కార్ వేదిక దాకా… కాదు, ఎక్కడికో వెళ్లిపోయాడు నాటునాటు పాటతో…

(ఇప్పుడు చాలామంది ప్రైవేటు సాంగ్స్ కోసం బాగా ఖర్చు పెడుతున్నారు, నాణ్యత కోసం, ఏ సినిమా పాట షూటింగుకన్నా తక్కువ కాదు… రానూ, బొంబయ్‌కి రానూ క్రియేట్ చేసిన రికార్డులు తెలుసు కదా…)

డబ్బులొస్తున్నాయి… షోలు, బిగ్‌బాస్, సినిమా పాటలు, వీడియోలు ఎట్సెట్రా… కాకపోతే ఓపెన్‌గా, ఏ భేషజాలు లేకుండా ఖుల్లంఖుల్లా… తమది ఒరిజినల్‌గా ఓల్డ్ సిటీలోనే బార్బర్ సెలూన్… తను కాస్త డబ్బులొచ్చేకొద్దీ ఫ్రీబర్డ్… బిందాస్ లైఫ్ అనిపిస్తాడు, ఆమధ్య పెళ్లి చేసుకున్నాడు కదా… శ్రావణ భార్గవి చెప్పినట్టు ‘కంట్రోల్’లోకి వచ్చాడేమో… ఐనా సరే, రెండేళ్ల క్రితం ఒక పాటకు కోటి ఖర్చంటే… అసలు అందులో ఏముందో చూద్దామని ఓపెన్ చేశాను…



అంతా ఓల్డ్ సిటీ మార్క్ పాట… ఓ ఎర్ర పోరీ, కర్రెగా ఉన్నానని విడిచిపెట్టిపోకే, బుర్జ్ ఖలీఫాలో రూమ్ బుక్ చేస్తా, ఎంజాయ్ చేద్దాం అంటూ… నీ అయ్య నా మామ, నా సాలా మీ అన్న… టైపు ఓ బిందాస్ పాట… నిజమే, తను చెప్పినట్టు దుబయ్‌లో షూటింగ్, ఎడారి దిబ్బల్లో హైకెపాసిటీ కార్లు, రియల్ పులి, ప్రైవేట్ పార్టీల బోటు… ఫుల్ హంగామా…

ఏమాటకామాట ఎడారి దిబ్బలపైన ఓ బాత్ టబ్, అందులో ఓ వయ్యారి, టబ్ అంచు మీద ఓ ఈగిల్… భలే క్రియేటివిటీ… ఆమె జెన్నిఫర్ ఇమాన్యుయెల్… బికినీలు, పొట్టి దుస్తులతో రష్యన్ లేడీస్… పాట రాసిందేమో ఫోక్ ప్రసిద్దుడు కాసర్ల శ్యామ్… మస్తు ఖర్చు కనిపిస్తూనే ఉంది… కానీ వచ్చిందెంత..? అది అడగొద్దు… తన గురించే పాట రాయించుకున్నట్టు ఉంటుంది… తన ప్యాషన్ అది…

ఆర్ఎస్, అంటే రాహుల్ సిప్లిగంజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్స్ బ్యానర్ కింద యూట్యూబులో 3.2 మిలియన్ల వ్యూస్ కనిపిస్తున్నాయి… రాజకీయాల్లోకి గనుక వస్తే, ఉన్న డబ్బంతా అందరికీ పంచిపెట్టేస్తాను కాబట్టి అస్సలు అటువైపు రాను అంటున్న రాహుల్ నెక్స్ట్ ఓ పేద్ద రెస్టారెంట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు… దాని పేరు ఇటాలియన్ వంకాయ… అచ్చం ఆ ‘అయ్య-మామ’ పాటలాగే ఉంది కదా ఈ పేరు కూడా..! ఇటాలియన్ కల్చర్ ఆంబియెన్స్‌లో పక్కా ఓల్డ్ సిటీ రెసిపీలను రుచిచూపిస్తాను అంటున్నాడు… ఆల్ ది బెస్ట్ రాహుల్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త TRS vs కొత్త TRS -! పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఇలాగే మరి!!
  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!
  • ఒక చిరంజీవి – ఒక ప్రభాస్ – ఒక పవన్ కల్యాణ్ … ఒక మాధవీలత!!
  • ‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions