Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

*నేపియర్…! ఇదీ పెంచాల్సిన సాగు… పెరగాల్సిన ఇంధనం..!!

June 13, 2026 by M S R

.

Nàgaràju Munnuru …. సాగునీటి అవసరం ఎక్కువగా ఉండే చెఱకు సాగును ప్రోత్సహిస్తూ, అనారోగ్యానికి కారణమయ్యే చక్కెర ఉత్పత్తి అధికం చేస్తూ, చెఱకు నుండి ఇథనాల్ ఉత్పత్తి చేస్తూ, ఈ ఇథనాల్ ను పెట్రోల్ లో కలుపుతూ ప్రజలు లోన్లు తీసుకుని కొన్న కార్లు, బైకుల ఇంజన్లు పాడుచేసే బదులుగా.. నేపియర్ గడ్డి సాగును ప్రోత్సహించి మండలానికి ఒకటి చొప్పున కాంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG), తద్వారా CNG ఉత్పత్తి చేసి చౌక ధరకు ప్రజలకు CNG అందించే అవకాశం ఉంది.

ఇథనాల్ వినియోగం కంటే బయో గ్యాస్ CBG .కి వెళ్లడం ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ…
1. పంట సాగుకు అతి తక్కువ నీటి అవసరం
2. ఒక్కసారి సాగు చేస్తే దాదాపు పది సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. ప్రతి 40- 50 రోజులకు ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు.
3. గ్రామాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లాంటి జీవాలకు సంవత్సరం పొడవునా పచ్చిమేత లభ్యం అవుతుంది.

Ads

4. నేపియర్ ద్వారా CBG/ CNG ఉత్పత్తి చేసుకున్న తర్వాత మిగిలే వ్యర్థాలు సేంద్రీయ ఎరువుగా పొలాల్లో వేసుకోవచ్చు.
5. ప్రభుత్వం కోరుకున్నట్టు చమురు దిగుమతులను తగ్గించుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిలించవచ్చు.
కళ్ళ ముందు చౌకైన ప్రత్యామ్నాయాలు కనబడుతూ ఉంటే చెఱకు సాగును ప్రోత్సహించడం, పెట్రోల్ లో ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయడం, ఇథనాల్ ఇంధన వినియోగానికి అనుగుణంగా తయారుకాని వాహనాల్లో వాడటానికి ఇథనాల్ రహిత పెట్రోల్ అందుబాటులో లేకుండా చేసి కంబషన్ ఇంజన్ల సామర్థ్యాన్ని దెబ్బతీయడం, రిపేర్ల ఖర్చు పెరిగేలా చేయడం ప్రజల జేబుకు చిల్లు పడేలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.

ఇంధన వినియోగం విషయంలో సరైన పాలసీ రూపొందించేవారే లేరా? ప్రతిపక్షాలు కూడా పనికిమాలిన విషయాల మీద రచ్చ చేసే బదులుగా నిజమైన సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. ప్రభుత్వం కోరితే సరైన ఇంధన పాలసీ ప్రణాళిక తయారుచేసి ఇవ్వడానికి  నేను సిద్ధమే.
ఒకవేళ ప్రతిపక్షాలు కోరితే నిజమైన ప్రజల సమస్యలను తెలియజేయడానికి కూడా సిద్ధమే.
అంతిమంగా ప్రజలు బాగుండాలి, దేశం బాగుపడాలి.
– నాగరాజు మున్నూరు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లో ‘స్వాతి’ – తరువాత ‘మా నాన్నకు పెళ్లి’ – ఇప్పుడు ‘వంద దేవుళ్లు’
  • Iran War – కాగితాలపైనే శాంతి ఒప్పందాలు – తొలగని యుద్ధ మేఘాలు
  • యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…
  • Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!
  • సింగిల్ మాల్ట్ Vs బ్లెండెడ్… స్కాచ్ రకాలపై అపోహలు- నిజాలు
  • సాక్షాత్తూ ప్రభుత్వం పేరుతోనే — బరితెగించిన స్కామ్ యాడ్స్
  • పెద్ది… నిర్మాత చేతులు కాలాయా..? ఏది నిజం..? ఏది అబద్ధం..?
  • మద్దతు ధర మోదీ బాధ్యత..! బీఆర్ఎస్‌కు నోరు పెగలదు..! భయం..!!
  • మహా సంక్లిష్టుడు – ఈ కోటికోట్ల కుబేరుడు విలాసాల్లోనూ స్పేస్‌ఎక్స్ రేంజ్
  • ధర్మస్థల కుట్రలో ప్రకాష్‌రాజ్ – తనే బయటపడిపోయాడు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions