Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మార్పేమీ లేదు… భద్రతామండలి సభ్యత్వంపై ఇప్పటికీ చైనా మోకాలడ్డు..!!

February 12, 2026 by M S R

.

ముందుగా ఒక విశ్లేషణ చూద్దాం… థాంక్స్ టు ట్రంపు… తన అస్తవ్యస్త పోకడలు, భారత వ్యతిరేక ధోరణులు, చర్యలు ఇండియాకు పరోక్షంగా మేలు చేస్తున్నాయి… తాత్కాలికంగా తలనొప్పులు క్రియేటవుతున్నా సరే… భారత్‌ను భిన్న అంశాల్లో బలోపేతం చేస్తున్నాయి…

అనేక దేశాలతో సంబంధాలు బలపడుతున్నాయి, హిస్టారికల్ వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయి… కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్నాయి… చైనా వంటి శతృదేశాలతో కూడా సత్సంబంధాల వైపు అడుగులు వేయిస్తున్నాయి… బ్రిక్స్ వంటి కొత్త, బలమైన రాజకీయ, ఆర్థిక, వాణిజ్య కూటములు బలపడుతున్నాయి…

Ads

రీసెంటుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో చైనా వైఖరిలో సానుకూల వైఖరి కనిపించడం ఓ పెద్ద మార్పు… ఇదీ ఓ విశ్లేషణ… చాలావరకూ నిజాలే… చైనా మారిన వైఖరి అనే అంశం తప్ప… అమెరికానూ నమ్మలేం, చైనానూ నమ్మలేం… ఎలాగంటే..?



ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చైనా విదేశాంగ శాఖా మంత్రి భారత్ “UNSC ఆకాంక్షలను అర్థం చేసుకుంటామని, గౌరవిస్తామని” పేర్కొన్నారు… దశాబ్దాలుగా భారత్ ప్రయత్నాలను అడ్డుకుంటున్న చైనా, “గౌరవిస్తాం (Respects)” అనే పదాన్ని వాడటం ఒక సానుకూల పరిణామంగా భావిస్తున్నారు చాలామంది… చైనా మద్దతు అని రాసేస్తున్నారు మరికొంతమంది… కానీ..?

దీనిని పూర్తిస్థాయి మద్దతుగా భావించలేం… చైనా నేరుగా “మేము భారత్‌కు శాశ్వత సభ్యత్వ అభ్యర్థనకు మద్దతు ఇస్తాం” అని ఎక్కడా చెప్పలేదు… “ఐరాస, భద్రతామండలిలో మరింత కీలక పాత్ర పోషించాలన్న భారత్ కోరికను గౌరవిస్తాం” అంటూ మార్మిక దౌత్యపరమైన భాషను వాడింది…

  • గతంలో కూడా 2014లో ఇటువంటి ప్రకటన చేసినా, ఆ తర్వాత సాంకేతిక కారణాలు చెప్తూ అడ్డుకుంటూనే వచ్చింది.

 


గతం: చైనాకు సభ్యత్వం రావడంలో భారత్ పాత్ర

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నేడు మనల్ని అడ్డుకుంటున్న చైనాకు ఆనాడు భద్రతా మండలిలో సీటు రావడానికి భారత్ ఎంతో సహాయపడింది…

  • నెహ్రూ నిర్ణయం…: 1950లలో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఐరాసలో అప్పటిదాకా ఉన్న తైవాన్ ప్రతినిధులను తీసేసి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC)కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత ప్రధాని నెహ్రూ బలంగా వాదించాడు…

  • అమెరికా ఆఫర్…: ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్‌ను ఇబ్బంది పెట్టడానికి చైనా స్థానంలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తామని అనధికారికంగా ప్రతిపాదించింది… కానీ, నెహ్రూ “చైనా వంటి పెద్ద దేశాన్ని పక్కన పెట్టి భారత్ ఆ సీటు తీసుకోవడం సరికాదు” అని భావించి, ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు… అది చాలా పెద్ద పొరపాటు నిర్ణయం…

  • 1971 తీర్మానం…: చివరకు 1971లో చైనాకు శాశ్వత సభ్యత్వం లభించినప్పుడు కూడా భారత్ దానికి పూర్తి మద్దతునిచ్చింది….


విశ్లేషణ: చైనా ఎందుకు అడ్డుకుంటోంది?

చైనా భారత్‌ను అడ్డుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి…

  1. పాకిస్థాన్ కోణం…: భారత్‌కు సభ్యత్వం వస్తే పాకిస్థాన్ ప్రాముఖ్యత తగ్గుతుందని చైనా భావిస్తుంది… అందుకే పాకిస్థాన్‌తో కలిసి “కాఫీ క్లబ్” (UfC) అనే గ్రూపు ద్వారా విస్తరణను అడ్డుకుంటోంది…

  2. ఆసియాలో ఆధిపత్యం…: ఆసియా ఖండం నుండి ఏకైక శాశ్వత సభ్యదేశంగా చైనా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది… భారత్ చేరితే తన పట్టు తగ్గుతుందని భయం…

  3. జపాన్ లింక్…: భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ (G4) కలిసి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాయి… చైనాకు జపాన్ అంటే పడదు… భారత్‌కు మద్దతు ఇస్తే జపాన్‌కు కూడా ఇవ్వాల్సి వస్తుందని చైనా పీటముడి వేస్తోంది…


  • సో… చైనా ప్రస్తుత ప్రకటనను మరీ సానుకూల మార్పు అని ఆనందపడాల్సిందేమీ లేదు… అయిదు దేశాల్లో నాలుగు సానుకూలంగా ఉన్నా, చైనా మాత్రమే ప్రతిసారీ వ్యతిరేకిస్తూ వస్తోంది… 2022లో కూడా… చైనాకు వీటో పవర్ ఉన్నన్నిరోజులూ మనకు అది అడ్డంకే…


అన్నట్టు పైన కాఫీ క్లబ్ అనే ప్రస్తావన వచ్చింది కదా... దానికి వివరణ ఇదుగో...


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) భారత్ వంటి దేశాలు శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంటే, ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి కొన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి… దీని అధికారిక పేరు “Uniting for Consensus” (UfC). అయితే, అనధికారికంగా దీనిని “కాఫీ క్లబ్” (Coffee Club) అని పిలుస్తారు…

1. ఇది ఎందుకు ఏర్పడింది? 1990లలో భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలు (వీటిని G4 దేశాలు అంటారు) తమకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని గట్టిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి… ఈ దేశాలకు సభ్యత్వం వస్తే తమ ప్రాముఖ్యత తగ్గుతుందని భావించిన మరికొన్ని దేశాలు, ఈ విస్తరణను వ్యతిరేకించడానికి ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశాయి…

2. ఇందులో ఉన్న ముఖ్య దేశాలు? ఈ క్లబ్‌లో ఉన్న దేశాలకు, G4 దేశాలకు మధ్య ప్రాంతీయ శత్రుత్వం లేదా పోటీ ఉంది…

  • భారత్‌ను అడ్డుకోవడానికి పాకిస్థాన్.

  • జపాన్‌ను అడ్డుకోవడానికి దక్షిణ కొరియా.

  • జర్మనీని అడ్డుకోవడానికి ఇటలీ.

  • బ్రెజిల్‌ను అడ్డుకోవడానికి మెక్సికో, అర్జెంటీనా.

గమనిక…: చైనా ఈ క్లబ్‌లో అధికారికంగా సభ్యురాలు కాకపోయినప్పటికీ, ఈ దేశాలకు వెనుక నుండి పూర్తి మద్దతు ఇస్తుంది…

3. వీరి వాదన ఏమిటి? వీరు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడానికి వ్యతిరేకం… ఎందుకంటే శాశ్వత సభ్యుల సంఖ్య పెరిగితే నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని వీరి వాదన…

  • వీరు కేవలం “తాత్కాలిక సభ్యుల” (Non-permanent members) సంఖ్యను మాత్రమే పెంచాలని, వారికి కూడా ఓటు హక్కు ఉండాలని కోరుతుంటారు…

4. దీనికి “కాఫీ క్లబ్” అని పేరు ఎలా వచ్చింది?

ఈ దేశాల ప్రతినిధులు మొదట్లో ఐక్యరాజ్యసమితి సమావేశాల మధ్యలో కాఫీ తాగుతూ, అనధికారికంగా చర్చలు జరుపుకుంటూ ఈ వ్యూహాలను రచించేవారు… అందుకే దీనికి సరదాగా “కాఫీ క్లబ్” అనే పేరు స్థిరపడిపోయింది… సంక్షిప్తంగా చెప్పాలంటే, భారత్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుపడే ఒక “నెగిటివ్ గ్రూప్” ఇది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మార్పేమీ లేదు… భద్రతామండలి సభ్యత్వంపై ఇప్పటికీ చైనా మోకాలడ్డు..!!
  • అవిశ్వాసం, ఆ పుస్తకం… ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు తప్పు ఎవరిది..?
  • జంట నగరాలు కావు… ఈ విశ్వనగరం ఇప్పుడు చతుర్నగరి… క్వాడ్ సిటీ…
  • పూర్తి వందేమాతర గీతం తప్పనిసరి… ఇదుగో తెలుగు అనువాదం…
  • పాపం, మనం అర్థం చేసుకోలేం గానీ… కోటీశ్వరులకూ కోటి కష్టాలు…
  • నాటి బేబీ షామిలి… తెరపై ‘అంజలి’… నిజజీవితంలో ‘చిత్రలేఖిని’…
  • అంజలి..! ఇలాంటి మణిరత్నం క్లాసిక్స్ మళ్లీ ఎప్పుడు చూస్తామో..!
  • హిందూ మహా సముద్రంలో ఇండియాకు రెండు ‘సెక్యూరిటీ గార్డులు’…
  • ఆ జర్నలిజాన్ని మార్కెట్ తిరస్కరించింది… వాషింగ్టన్ పోస్ట్ వైఫల్యం అదే…
  • కాళ్లు తోక… చేతులే మొప్పలు… ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions