Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!

February 13, 2026 by M S R

.

మున్సిపల్ ఫలితాలు ఏం చెప్పాయి..? ఇదీ ప్రశ్న… ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా… ఏ పార్టీ ఎలా బాష్యం చెప్పుకున్నా సరే… ఇదుగో ఈ నిజాల్ని చాటి చెప్పాయి…

1) కేసీయార్ పార్టీని ఈరోజుకూ తెలంగాణ జనం తిరస్కరిస్తూనే ఉన్నారు… ప్రజాజీవితాన్ని వదిలేసి, ప్రజల మీద అలిగి, ఫామ్ హౌజులో పడుకుని, ప్రతిపక్ష నేతగా బాధ్యతల్ని విస్మరిస్తున్న తన ‘నాయకత్వాన్ని’ (?)  జనం అత్యంత స్పష్టంగా రిజెక్ట్ చేస్తున్నారు…

Ads

  • ఈ మాట ఎందుకు అనాలంటే..? కేటీయార్ ఏమన్నాడు..? కారు గుర్తు చూడగానే ఈ ఎన్నికల్లో కేసీయార్ మొహం చూసి వోటు గుద్దేయండి అని… మరేమైంది..? అనుకున్నదానికన్నా చాలా దారుణంగా వోటర్లు తిరస్కరించారు… ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో అంచనాలకన్నా మరీ దిగువన… అంటే ఇది కేసీయార్ పట్ల స్పష్టమైన భారీ తిరస్కరణ… పంచాయతీ ఎన్నికల సరళిని మించిన స్పష్టమైన భారీ ఆధిక్యత కాంగ్రెస్ పార్టీది… 
  • 2020లో జస్ట్, కేవలం ఏడు మున్సిపాలిటీలకు పరిమితమైన కాంగ్రెస్ ఈరోజు అత్యంత భారీ డామినేషన్ ప్రదర్శించడం…అదీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..!! 90 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న నాటి బీఆర్ఎస్ ఇప్పటి దుర్గతిని ఓసారి పోల్చిచూడండి… కసీయార్ మొత్తం పొలిటికల్ కెరీర్‌లో అత్యంత దారుణమైన మరో పరాభావం…

మున్సిపల్

చివరకు ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి కాంగ్రెస్ ఈ రేంజ్ ఆధిక్యత కనబరచడం… ఒక్క  ముక్కలో చెప్పాలంటే… రేవంత్ రెడ్డి నాయకత్వం అంచనాలను మించి జనం ఆమోదాన్ని పొందడం…!!

ఈ కథనం రాసే సమయానికి 64 కాంగ్రెస్, కేవలం 14 దగ్గర బీఆర్ఎస్… కార్పొరేషన్లలోనైతే మరీ బీఆర్ఎస్‌ వాళ్లు బీజేపీకన్నా తక్కువ కార్పొరేటర్ స్థానాలు గెలిచారు… కానీ మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కటంటే ఒక్కటీ బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది…

నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మంచి ప్రభావం తప్ప… బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తప్ప సీరియస్‌గా వర్క్ చేసిన బీజేపీ ముఖ్య నాయకులు ఎవరున్నారు..? ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందన్న అంచనాలు అనూహ్యంగా కల్లలైపోయాయి, పార్టీ చతికిలపడింది…

మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్, ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల వాళ్లూ గెలుస్తారు కాబట్టి, హంగ్ రిజల్ట్ వస్తుంది పలుచోట్ల… ఇక్కడ లోకల్ సర్దుబాట్లు, ప్రజాప్రతినిధులు, ఇండిపెండెంట్ల వోట్లు కీలకం అవుతాయి, క్యాంపులు నడుస్తాయి, ప్రలోభాలూ ఉంటాయి… చివరకు కాంగ్రెస్ 90 దాటవచ్చుననీ, బీఆర్ఎస్ 20 వరకూ చేరవచ్చుననీ ప్రస్తుత రఫ్ అంచనా… అంటే కాంగ్రెస్‌తో పోలిస్తే పావు వంతు..!!

కొత్తగూడెంలో బీఆర్ఎస్ లెఫ్ట్‌కు మద్దతుపై ఓపెన్ ఆఫర్ ఇచ్చింది… కొన్నిచోట్ల బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అధికారం చేజిక్కించుకోవచ్చు… సరే, స్థూలంగా చూస్తే… కాంగ్రెస్ చాలా స్పష్టంగా డామినేట్ చేసింది… ఊహించిన స్థానాలకు మించి… మరి బీఆర్ఎస్ పరాజయాన్ని ఎలా చూడాలి..? ఈరోజుకూ ఎందుకు పెరగలేకపోతోంది..?

రోజుకొకటిగా పుట్టలు పగిలినట్టుగా బయటికొస్తున్న కేసీయార్ పాలన బాపతు అక్రమాలు, అరాచకాలు రోజురోజుకూ ఆ పార్టీ పట్ల జనాదరణను మరింత క్షీణింపజేస్తున్నాయి… మీడియా, సోషల్ మీడియా ద్వారా వందల కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ చేపట్టిన ‘నెగెటివ్ క్యాంపెయిన్’ పక్కాగా కౌంటర్ ప్రొడక్ట్ అవుతోంది… నిజాలు అలా చేదుగా ఉంటే ‘జాతిపిత’ అనే ముద్ర కోసం ప్రచార యజ్ఞాలు… మాటిమాటికీ బీజేపీలో విలీనం అనే ప్రచారాలు కూడా నెగెటివ్ అయిపోతున్నాయి…

brs

  • మరీ ప్రత్యేకించి సొంత బిడ్డ కవితను కుటుంబం నుంచీ, పార్టీ నుంచి తరిమేయడం, ఆమె వరుసగా పాత బాగోతాలన్నీ ఏకరువు పెడుతుండటం కూడా బీఆర్ఎస్ పార్టీకి పే- ద్ద మైనస్…
  • కేటీయార్, హరీష్ రావు టన్నుల కొద్దీ బురదను గాలి నుంచి అలా అలా అలవోకగా క్రియేట్ చేసి, ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై గుమ్మరిస్తున్న తీరునూ జనం మెచ్చలేదు… మెచ్చడం లేదు, మెచ్చబోవడం లేదు… ఎందుకంటే..? మూడు హైదరాబాద్ పురపాలికల ఎన్నికలున్నాయి, పరిషత్ ఎన్నికలున్నాయి…

revanth

కేసీయార్ జనంలోకి రాకపోతేనేం, కేటీయార్- హరీష్ ఆ లోటు తీరుస్తారనేది ఓ భ్రమ అని జనం తేల్చేశారు… కేసీయార్ ప్రత్యామ్నాయ నాయకలుగా కేటీయార్- హరీష్ రావులను తెలంగాణ జనం నిర్ద్వంద్వంగా రిజెక్ట్ చేశారు, నో యాక్సెప్టెన్నీ..! పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ వోట్లేయాలని జనాన్ని అడగలేదు… పదవులు ఉంటేనే ప్రజలు, లేకపోతే లేదు అనే కేసీయార్ ధోరణికి ప్రజల తిరస్కరణ ఇది…

ktr

అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు… లోకసభ ఎన్నికల్లో దారుణ పరాజయం… పంచాయతీ పరాభవం… తాజాగా మున్సిపల్ భారీ పరువునష్టం… ఎక్కడా, ఏ దశలోనూ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తేరుకోలేదు… పంచాయతీ ఎన్నికల్లో మస్తు మంచి ఫలితాలు వచ్చాయని చెప్పుకుంది పార్టీ… అవి పార్టీ రహితాలు కాబట్టి, ఏ లెక్క చెప్పుకున్నా నడిచింది… కానీ మున్సిపల్ ఎన్నికలు పార్టీ పేరుతో, పార్టీ గుర్తుతో జరిగేవి… అంకెలు అధికారికం… కప్పిపుచ్చలేరు, కథలు అల్లలేరు…

మొత్తం మున్సిపల్ వార్డుల్లో సగానికి పైగా కాంగ్రెస్ గెలిస్తే, ఇందులో సగం బీఆర్ఎస్… అంటే కాంగ్రెస్ క్లియర్ కట్ డామినేషన్… లాగూలో తొండలు భాషలో రేవంత్ రెడ్డి కావాలని వేసిన ట్రాపులో పడిపోయిన కేటీయార్, హరీష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వ్యక్తిగత దూషణల వైపు డైవర్ట్ అయిపోయారు… పైగా ఏ అంశం మీద ప్రభుత్వం మీద ఆరోపణ చేసినా దాన్ని కొనసాగించలేకపోవడం, పూర్తిగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయడం మరో మైనస్…

brs

  • పంచాయతీ ఎన్నికలు గ్రామ వోటరు నాడిని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పట్టణ వోటరు నాడిని స్పష్టం చేశాయి… కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యర్థి కాదనీ, తమ లోపాలు దిద్దుకోగలిగితే, ఎస్, తన సంస్థాగత లోపాలు సరిదద్దుకోగలిగితేనే… బీజేపీ మాత్రమే కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా ఎదిగే చాన్సుందని చెప్పుకునేలా కొంత హడావుడి, హైప్ కనిపించింది, తీరా చూస్తే రెండు కార్పొరేషన్లలో హవా పక్కన బెడితే, మున్సిపాలిటీల్లో చాలా నిరాశ మిగిలింది బీజేపీకి…

revanth

రేవంత్ రెడ్డిని లాటరీ సీఎం అని వెక్కిరిస్తుంది కదా బీఆర్ఎస్ ఎప్పుడూ… కాదు, నేను రాజు- నేనే మంత్రి బాపతు నాయకత్వ లక్షణాలున్న, సరుకున్న ముఖ్యమంత్రి అని వరుస ఎన్నికల విజయాలతో తను ప్రూవ్ చేసుకున్నాడు… ఇప్పుడో అప్పుడో కాంగ్రెస్ సీనియర్లు ఈ రేవంత్ కొంప ముంచుతారనీ, ప్రభుత్వం కూలిపోతుందనీ, రాహుల్ గాంధీ పక్కన పెట్టేశాడనీ నానా ప్రచారాలు చేశారు కదా… కానీ తను పార్టీలో, పాలనలో పాతుకుపోయినట్టే ఇక… ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి మరోసారి తెలంగాణ సమాజం స్పష్టంగా వోటేసినట్టే… విశ్వాస ప్రకటన…

revanth

ఇక బీజేపీ..? అర్బన్ ఓటింగు ఎంతోకొంత బీజేపీకి, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో సానుకూలం అనే అంచనాలను కూడా బద్దలు కొడుతూ… బీజేపీ తీవ్రంగా నిరాశపరిచింది… ఫాఫం, 17లో 8 లోకసభ సీట్లు గెలిచిన బీజేపీయేనా ఈ రేంజ్ దారుణ స్థితికి చేరుకుంది..? చైర్‌పర్సన్లు, మేయర్ల ఎంపికలు పూర్తయ్యాక సంఖ్యల్లో స్పష్టత వస్తుంది, కానీ ప్రస్తుతానికి మున్సిపల్ ట్రెండ్ విశ్లేషణ, స్థూల ముఖచిత్రం ఇదే…

బోధన్, భైంసా సీట్లలో ముస్లిం వోట్లను కన్సాలిడేట్ చేసుకున్న మజ్లిస్… పాత బస్తీ నుంచి ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!
  • శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…
  • స్టయిలిష్ సనాతనం… భజన్ క్లబ్బింగ్… న్యూ స్పిరిట్యుయల్ వైబ్స్…
  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!
  • ఫన్‌కీ..! సారీ, అనుదీప్… అంత పెద్దగా నవ్వించలేకపోయావ్..!!
  • అతడు… టీవీ ప్రసారాల్లో తిరుగులేని రికార్డు… థియేటర్లకు మళ్లీ వస్తాడట…
  • అబ్బో… ఈ ప్రముఖ గ్రంథ ‘సాంగు’డి కథలో ఈ కోణాలూ ఉన్నాయా..?
  • D-Dad …! చిన్నారులకు డిజిటల్ చెర నుంచి విముక్తి… గుడ్ ప్రోగ్రామ్..!!
  • లైఫ్ పీర్..! మన శనిగరం ఉదయ్ నాగరాజు కొత్త హోదా కథేమిటి..?!
  • గాంధీ సరోవర్ ప్రాజెక్టు- గేట్ వే ఆఫ్ హైదరాబాద్… ఏమిటివి..? ఎక్కడ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions