.
బీజేపీలో వారసత్వ రాజకీయం (‘పరివార్‌వాద్’) లేదని, ‘ఒకే కుటుంబం, ఒకే టికెట్’ అంటుంటారు కదా… కానీ తప్పదు… వర్తమాన రాజకీయాల తీరును బట్టి పార్టీలు కూడా మారుతాయి… బీజేపీ కూడా అంతే… నాన్- సంఘ్ నేతల్నీ అక్కున చేర్చుకుని, అవకాశాలు ఇస్తున్నట్టుగా… తప్పనిసరై నాయకుల వారసులకూ ప్రాధాన్యం ఇవ్వకతప్పని పరిస్థితి…
మొన్న బీహార్‌లో బీజేపీ- జేడీయూ మంత్రివర్గ విస్తరణ జరిగింది… ముగ్గురు నేతలు మంత్రులయ్యారు… 1) నితిశ్ కొడుకు నిశాంత్… తను రాజకీయాలకు దూరంగా ఉండేవాడు, ఆధ్యాత్మిక ధోరణిలో కాలం గడిపేవాడు… 2) ఉపేంద్ర కుష్వా కొడుకు దీపక్ ప్రకాష్… ఉపేంద్ర ఏవేవో పార్టీలు పెడుతుంటాడు, విలీనాలు చేస్తుంటాడు… 3) మాజీ సీఎం జితన్ రామ్ మాంఝి కొడుకు సంతోష్ కుమార్ సుమన్ … ముగ్గురూ మంత్రులు ఇప్పుడు… ఏ ఎన్నికల్లోనూ వోట్లు పొందలేదు…
Ads
ఇవేకాదు, అనేక ఉదాహరణలు… (ఎవరో క్రోడీకరించిన పోస్టు)… కర్నాటక సీఎం బొమ్మె తండ్రి మాజీ సీఎం, యడ్యూరప్ప కొడుకు ఎంపీ, మరో కొడుక్కి ఎమ్మెల్యే టికెట్… ఎంపీ బసవరాజ్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్, రవి సుబ్రహ్మణ్యంకు ఎమ్మెల్యే టికెట్, మేనల్లుడు తేజస్వి సూర్య ఎంపీ… ఇద్దరు జార్కి హోళి సోదరులకు ఎమ్మెల్యే టికెట్లు, కత్తి కుటుంబంలో ఇద్దరి ఎమ్మెల్యే టికెట్లు… ఇద్దరు రెడ్డి బ్రదర్స్… హర్షవర్ధన్‌కు ఎమ్మెల్యే టికెట్, మామ శ్రీనివాస్ ప్రసాద్ ఎంపీ…
ఎంపీ అన్నాసాహెబ్ భార్య శశికళ జోల్లేకు ఎమ్మెల్యే టికెట్… మాజీ మంత్రి కుమారుడు ప్రీతమ్ నాగప్పకు ఎమ్మెల్యే టికెట్… ఎంపీ ఉమేష్ జాదవ్ కుమారుడు అవినాష్ జాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్… మాజీ సీఎం కుమారుడు కుమార్ బంగారప్పకు మళ్లీ ఎమ్మెల్యే టికెట్… మాజీ మంత్రి కుమారుడు దత్తాత్రేయ పాటిల్‌కు మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్… సురేష్ బాబు, శ్రీరాములు, మేనల్లుడు, మామకు ఎమ్మెల్యే టిక్కెట్లు… మాజీ ఎమ్మెల్యే తనయుడు అరవింద్ బెల్లాడ్‌కి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్… MLC కొడుకు చంద్రకాంత్ పాటిల్‌కి MLA టిక్కెట్…
మాజీ మంత్రి తనయుడు సప్తగిరిగౌడ్‌కు ఎమ్మెల్యే టికెట్… మాజీ ఎమ్మెల్యే కుమారుడు అమృత్ దేశాయ్‌కి మళ్లీ టిక్కెట్… మాజీ మంత్రి ఆనంద్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్‌కు ఎమ్మెల్యే టికెట్… మాజీ మంత్రి కూతురు పూర్ణిమ శ్రీనివాస్‌కి మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్… ఇవన్నీ కర్నాటక రాజకీయాలు…
జాతీయ స్థాయిలోనూ… అమిత్ షా కొడుకు జైషా ఐసీసీ చైర్మన్…, హిమాచల్ మాజీ సీఎం ప్రేమ కుమార్ ధుమాల్ కొడుకు అనురాగ్ ఠాకూర్ కేంద్రమంత్రి… మాజీ కేంద్ర మంత్రి వేదప్రకాష్ గోయల్ కొడుకు పియూష్ గోయల్ కేంద్ర మంత్రి… యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కొడుకు రాజవీర్ సింగ్ లోకసభ ఎంపీ… విజయరాజే సింధియా మనమడు, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి…
అరుణాచల్ తొలి ప్రొటెం స్పీకర్ రిన్‌చిన్ ఖరూ కొడుకు కిరణ్ రిజుజు… ఎంపీ శిశిర్ అధికారి కొడుకు సువేందు అధికారి బెంగాల్ సీఎం… సువేందు కుటుంబంలో అందరికీ పదవులు… మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ పంత్ కొడుకు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం.,. మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ ఎంపీ… రాజనాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్ ఎమ్మెల్యే… మాజీ సీఎం వసుంధర రాజే కొడుకు దుష్యంత్ సింగ్ ఎంపీ… ఎంపీ ధర్మేంద్ర కొడుకు సన్నీడియోల్ ఎంపీ… మాజీ ఎంపీ మహారాణి గాయత్రిదేవి మనవరాలు దియా కుమారి ఎంపీ…
మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొడుకు జయంత్ సిన్హా ఎంపీ… డిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేశ్ వర్మ ఎంపీ…
మాజీ మంత్రి ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్ ఎంపీ… యూపీ మాజీ సీఎం హేమవతి నందన్ బహుగుణ వారసురాలు రీటా బహుగుణ జోషి ఎంపీ… మాజీ ఒడిశా మంత్రి కనకవర్దన్ సింగ్ డియో సతీమణి సంగీత్ సింగ్ ఎంపీ… మాజీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే ఎంపీ… అరుణాచల్ మాజీ సీఎం దూర్జే ఖండూ కొడుకు పెమా ఖండు అరుణాచల్ సీఎం… మాజీ కేంద్ర మంత్రి సీపీ ఠాకూర్ కొడుకు వివేక్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీ…
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ రాజ్యసభ ఎంపీ… ఎమ్మెల్యే విజయకుమార్ గవిట్ కుమార్తె హీనా గవిట్ ఎంపీ… మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్ కొడుకు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి… మాజీ గవర్నర్ లాల్జీ టాండన్ కొడుకు అశుతోష్ ఎమ్మెల్యే… మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్ లాల్ పట్వా మేనల్లుడు సురేంద్ర పట్వా ఎమ్మెల్యే…
మిత్రపక్షాలైన టీడీపీ, అకాలీదళ్, జేడీఎస్, ఎల్జేపీ, జనసేన, ఎన్సీపీ, షిండే… కుటుంబ పార్టీలు… ఏపీ బీజేపీ ఫస్ట్ అధ్యక్షుడు చలపతిరావు కొడుకు మాధవ్ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు… బోలెడు… కుమార్తెలు, కొడుకులు, భార్యలు, కోడళ్లు, మేనల్లుళ్లు… మిగతా పార్టీలు కూడా అంతే… అంతెందుకు, సుదీర్ఘంగా దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబం పర్‌ఫెక్ట్ ఉదాహరణ కదా… మన దేశ రాజకీయ వ్యవస్థ తీరే ఇది… సో, నో పరివార్‌వాద్ అనే మాటకు అర్థం లేదు… అది ప్రజెంట్ ఇండియన్ పొలిటికల్ కేరక్టర్…!!
Share this Article