Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..!!

June 1, 2026 by M S R

.

ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టున్నాడు పవన్ కల్యాణ్… లేకపోతే నరనరాన తెలంగాణ మీద ద్వేషం నిండిన తను ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం’ నిర్వహించడం ఏమిటి..? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అట… జనసేన సాధక్ సమ్మేళనం అట… (ఆ భాషేమిటో)… అదీ ఓ ఫంక్షన్ హాలులో పెడతాడట… వస్తారు…

తెలంగాణతనం వీసమెత్తు లేని పిడికెడు మంది అభిమానులు వస్తారు… ఈయన గారు తెలంగాణను ఉద్దరిస్తానని సంకల్పం తీసుకుంటారు… మళ్లీ తెలంగాణతనం చిన్నబోతుంది… అంటే, తెలంగాణలో పార్టీని విస్తరించుకునే హక్కు లేదంటారా అనేది ఓ ప్రశ్న…

Ads

ఉంది… అందరికీ ఉంది… కానీ పవన్ కల్యాణ్‌కు లేదు… ఈ రాష్ట్ర ఏర్పాటు మీద అడగడుగునా విషం గక్కిన చరిత్ర తనది… తెలంగాణ ఏర్పడినప్పుడు పదకొండు రోజులు నిద్రాహారాలు మాని ఏడ్చిన ఓర్వలేనితనం తనది… చివరకు కోస్తాలో కొబ్బరిచెట్లకు ఏదో కూటమి తెగులు తగిలి, ఎండిపోతే, దానికీ తెలంగాణ ఏడుపు అని ముద్రవేసిన ఏడుపుగొట్టుతనం తనది…

అందరికీ తెలంగాణలో రాజకీయాలు చేసే హక్కుంది… పవన్ కల్యాణ్‌కు తప్ప..! ఐనా పక్కా ఆంధ్రుడినని ప్రకటించుకునే కదా ఆంధ్రను తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుంది… మరి తెలంగాణ దేనికి..? అక్కడేం ఉద్దరించానని ఇక్కడికి విస్తరణ..? ఒక్కటి, కనీసం ఒక్కటి, ఈ రెండేళ్లలో మేం ఉద్దరించిన పని ఇదీ అని చెప్పగలడా..?

pk

ఐనా, తెలంగాణకే పదే పదే ఎందుకు ఈ గ్రహచారం… ఈ దుష్టగ్రహసంచారం… బలవంతంగా ఆంధ్రలో కలిపిన దగ్గర నుంచి ఇప్పటి దాకా… తెలంగాణ మీద పడి బతకడం, మళ్లీ తెలంగాణ మీదే ఏడ్వడం… ఏదో సోనియా దయ వల్ల విడిపోయాం, ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారు… మళ్లీ ఇదేం గోకుడు..? ఇదుగో, ఇలాంటి వేషాలే, తెలంగాణ అస్థిత్వానికి పునఃప్రమాద సంకేతాలు…

జగన్ తెలంగాణ దుకాణం మూసేసుకున్నాడు, ఆంధ్రాకే పరిమితం… నేనూ తెలంగాణను ఉద్దరిస్తానహో అని వేషాలు వేసిన షర్మిల కూడా పారిపోయింది, కాంగ్రెస్‌లో నిమజ్జనం అయిపోయింది… చంద్రబాబుకు విస్తరిద్దామని ఉంది, కానీ తనూ తెలంగాణ ద్వేషియే కదా, తెలంగాణ సమాజం ఇక జన్మలో చంద్రబాబుకు జై అనదు… ఎవరో ఒకరిద్దరు మూర్ఖశిఖామణులు ‘తెలంగాణ అనే పదం డిక్షనరీ’లోనే లేదు అని చేసే పేలాపనలు తప్ప…

ఇక ఈ చంద్రబాబు, ఈ పవన్ కల్యాణ్‌లను నెత్తిన మోస్తూ తెలంగాణ బీజేపీ నేతలు… ఒక్క చాన్స్ ప్లీజ్ అని తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కడతారట..! అసలు తెలంగాణ బీజేపీ నేతలకు వాళ్లలో వాళ్లు తన్నుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు, పైగా ఇదో మాయదారి సంతను తీసుకొచ్చి తెలంగాణపైన మళ్లీ రుద్దే ప్రయత్నాలు…

ఐనా, జగన్‌ పాలన సరిగ్గా ఏడిస్తే… ఈ పవన్ కల్యాణ్‌కు రాజకీయ అస్థిత్వం ఎక్కడిది..? అంతకుముందు ఎన్నికల్లో తన ఘోరపరాజయాలు, పరాభవాలు తెలియనివా..? ఇక ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున మీటింగ్ పెట్టి… ఏం చేస్తాడిప్పుడు..? తెలంగాణ నవనిర్మాణానికి సంకల్పం ప్రకటిస్తాడా..? అర్జెంటుగా తెలంగాణ సమాజం చప్పట్లు కొట్టి, అక్కున చేర్చి, వచ్చే వోట్ల పండుగలో నెత్తిన పెట్టుకోవాలా..?

ఏపీకి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి నాగబాబు… ఇదేనా కంకణం కట్టుకోబోయే సంకల్పం..? మరి అన్న గారు..? రాష్ట్రపతి..? ముందు రాజధానిని కట్టుకొండి, మళ్లీ తెలంగాణను మోసగించి బనకచర్ల కట్టకుండా, ఆ పోలవరం పూర్తి చేసుకొండి… హైదరాబాదులోనే బతుకుతూ, ఏడిచే బదులు, ఆంధ్రాలో నివాసం ఉండండి, మీ ప్రజలకు అందుబాటులో… అవును, ముందు మీ గోచీ సరిచూసుకొండి… తెలంగాణను తరువాత ఉద్దరించొచ్చు… తెలంగాణను ఏలడానికి బోలెడుమంది స్థానిక నేతలు ఉన్నారు… పరాయివాడు అవసరం లేదు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవును, ఇవిగో ఇవే… తెలంగాణ అస్థిత్వ పునఃప్రమాద సంకేతాలు..!!
  • Sayaji Shinde … వెండి తెరపై విలన్ కావచ్చు… రియల్ లైఫ్‌లో ‘సూపర్ హీరో’…
  • “నో ఫిక్సింగ్, నో దందా, నో గుజరాత్..! మళ్లీ ఆర్సీబీ… జయహో కోహ్లీ..!
  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions