Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యోనివా, నువ్వు అవ్వోనివా… తెలంగాణోనికి తోటి పాలోనివా..?

June 3, 2026 by M S R

.

ముందుగా సీనియర్ జర్నలిస్టు Murali Buddha పోస్టు చదవండి, తరువాత ముచ్చటించుకుందాం… ‘‘గద్దర్ మీద కాల్పులు జరిగింది 1997 లో … జనసేన పుట్టింది 2014లో… అంటే 18 ఏళ్ల తరువాత… గద్దర్ ఇల్లు భూదేవి నగర్, మా ఇల్లు కూడా భూదేవి నగర్‌లోనే… గద్దర్ తొలిసారిగా ఓటు వేసినప్పుడు వారి వెనుకే క్యూలో ఉన్నాను .

2005- 06 నుంచి నేను భూదేవి నగర్‌లో ఉంటున్నాను . గద్దర్ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి . 2006 నుంచి రోజుకు ఒక్కసారైనా గద్దర్ ఇన్నోవా కారు చూసేవాడిని …. ఆ కారు బాగా గుర్తు, నంబర్ కాదు .. కారు నంబర్ ప్లేట్ వద్ద VIP అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది …. అది చూసి గుర్తుండి పోయింది .

Ads

ఆనాటి నుంచి ఇన్నోవా కారున్న గద్దర్… పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి, ఒరేయ్, ఆటోలో తిరగలేకపోతున్నాను, బండి కొనివ్వరా అనడిగితే మూడు రోజుల్లో కారు కొనిచ్చాడట… వెన్నులో తూటా వల్ల కూర్చోలేక పోతున్నాను అని జనసేన ఆఫీస్ కు వచ్చి మరీ గద్దర్ అడిగాడని పవన్ చెబుతున్నాడు…

గద్దర్ కారును 2006 నుంచి చూస్తున్నా . వారు కారు లేకుండా ఎప్పుడూ లేరు … అలా అని పవన్ చెప్పింది అబద్దం అనీ చెప్పడం లేదు . ఏం జరిగిందో ఇద్దరికే తెలియాలి’’




పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు ఆ విషయాలు చెబుతున్నాడు..? మీ గద్దర్‌కు బండి కొనిచ్చాను అని చెప్పడం వెనుక మర్మం ఏమిటి..? సరే, కొనిచ్చావు, గద్దర్‌కు బండి కొనిచ్చావు కాబట్టి బారా ఖూన్ మాఫీ అనుకోవాలా ఇక.,. నీ తెలంగాణ వ్యతిరేకతను మొత్తం మరిచిపోయి, ఇక నిన్ను నెత్తిన మోయాలా..,?

నువ్వే కదా అడిగావు ఓ అహంతో…, మీ అయ్య జాగీరా అని…! ఎస్, ఇది తెలంగాణ మూలవాసుల జాగీరే… నువ్వు ఎప్పుడూ ఓ ఔట్ సైడర్‌వే… తరతరాలు తెలంగాణను దోపిడీ చేసిన వలస నేతలకు ప్రతినిధివి నువ్వు… అదే అహం, వెటకారం మూర్తీభవించిన రూపానివి…

అందుకే నువ్వు తెల్లారిలేస్తే తెలంగాణ మీద విషం కక్కుతావు, ఇక్కడే బతుకుతూ, ఈ వనరులనే ఇంకా ఇంకా అనుభవిస్తూ, ఈ నేలనే అవమానిస్తావు, ఈ మూలవాసుల్నే బెదిరిస్తావు, నిన్ను మోస్తున్న మోదీ ఈ పాపానికి బాధ్యుడు, నీ చంద్రబాబు బాధ్యుడు… లేకపోతే కొండగట్టుకు తిరుమల నిధులు ఇస్తే, నువ్వు ఇచ్చానని చెప్పుకుంటావా..? నీ కమిట్మెంట్‌కు అది తార్కాణమా…? నీ సొంత జేబులో నుంచి ఇచ్చినట్టు పేలాపనలు కావా అవి..?

అలవాటైన అహం… తెలంగాణలో పోటీచేస్తా, తిరుగుతా అన్నావు కదా, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశావుగా, ఓచోట నీ అభ్యర్థికి వచ్చిన వోట్లు రెండు, ఫ్యామిలీలో నాలుగు ఉంటే ఇద్దరు కూడా నీకు వేయలేదు, ఆ అభ్యర్థిని సపోర్ట్ చేసిన వ్యక్తుల వోట్లు కూడా పడలేదు, అదీ నిన్ను తెలంగాణ థూత్కరించిన తీరు… 2023లో కూడా చేశావుగా, ఏమైంది..? ఐనా పార్లమెంటు తలుపులు మూసి మరీ బిల్లు పాస్ చేయాల్సిన అగత్యాన్ని క్రియేట్ చేసిందెవడో ముందు చెప్పు..?!

అవును, తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే… అందరికీ హక్కుంది, కానీ నీకు లేదు… విద్వేషం తప్ప నరనరాన మరేమీ లేని నీకు ఆ హక్కు లేదు… వెళ్లు, తమిళనాడో, కర్నాటకో వెళ్లు… బెంగుళూరు, మద్రాసుల్లో కూడా వేలాది మంది తెలుగువాళ్లు ఉన్నారు, ఇలాగే మాట్లాడు ఓసారి, తెలుస్తుంది…

పైగా ఏపీలోనే సీఎం కాలేదు, తెలంగాణలో అవుతానా అంటున్నావు కదా, మరెవరి కోసం ఈ వేషాలు..? వెనుక ఉండి ఆడిస్తున్న తలకాయలు ఎవరివి..?

చివరగా… నాగేశ్వర్ బాపతు జర్నలిజంలో ఎన్ని నిర్వాకాలు ఉన్నా సరే, నీతో పెట్టుకుని తెలంగాణకు ఓ మేలు చేశాడు… నీలాంటి నేతభూతాలు ఇంకా నోళ్లు తెరుచుకుని, కోరలు చాచి తెలంగాణ మీద పగబట్టే ఉన్నాయని తేలిపోయింది… మీరు ఎన్నేళ్లయినా మారరు, మీ గుణం మారదు అని తెలిసిపోయింది…

మా కవి గూడ అంజన్న రాసినట్టు… అయ్యోనివా నువ్వు అవ్వోనివా,, తెలంగాణోనికి తోటి పాలోనివా? ఇసుంట రమ్మంటే నువ్వు ఇల్లంత నాదంటవా, తిన్నింట వాసాలు లెక్కడతవా..?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యోనివా, నువ్వు అవ్వోనివా… తెలంగాణోనికి తోటి పాలోనివా..?
  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions