Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…

June 4, 2026 by M S R

.

మామూలుగా పవన్ కల్యాణ్ భాషే అది… అర్థం లేని ఆవేశం, మాటలో దురుసుతనం, ఆలోచనరాహిత్యం వంటివి చాలా కనిపిస్తాయి… దీనికితోడు అహంతో ‘ఎవడబ్బ జాగీర్’ వంటి జాగీర్దార్ భాష సరేసరి… తెలంగాణ మీద పదే పదే విషాన్ని, ద్వేషాన్ని కురిపించే తను మళ్లీ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గోకబోయాడు… తెలంగాణ సమాజం స్పందన అర్థమైంది…

జాలిమ్ కౌన్‌రే ఉస్‌కా జులుమ్ క్యారే… అని ఏళ్లుగా పోరాడుతూనే ఉన్న నేల ఇది… బరాబర్ ఇది మా జాగీరే, నువ్వు అయ్యోడివా, అవ్వోడివా అని ప్రతి పరాయోడినీ అడుగుతుంది… నిన్న అమరావతికి వెళ్లేసరికి కిక్కు దిగింది, తత్వం అర్థమైంది… అక్కడ అంటున్నాడు ఇలా…

Ads

‘‘రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయినా తగ్గలేదు తెలంగాణ సెంటిమెంట్… తెలంగాణ, తమిళనాడుల్లో ప్రాంతీయ అస్థిత్వం బలంగా ఉంది… కులాల మధ్య పంచాయితీలే తప్ప ఏపీలో ఆంధ్రా అనే భావనే లేదు… తెలంగాణలో పోటీచేసే ఉద్దేశమేదీ వ్యక్తిగతంగా లేదు… పార్టీ నాయకులు పిలిస్తే మీటింగుకు సరేనన్నాను… చిన్న ఘటన గాలివానైంది… సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది…’’ ఇలా చెబుతూ పోయాడు…

పన్నెండేళ్లయింది ద్వేషం తగ్గింది అనుకున్నాననే మాటా చెప్పాడు… నిజానికి ద్వేషం తెలంగాణకు లేదు, ఏపీ సమైక్య నాయకులదే ద్వేషం… పదే పదే పవన్ కల్యాణ్‌లాగే బయటపడిపోతుంటారు… కానీ తను చెప్పింది నిజం… ఆత్మమథనం… ఏపీలో కులాల కొట్లాట తప్ప పాలన లేదు, సరైన రాజకీయం లేదు… తను అన్నట్టు సభకు అనుమతిస్తే వివాదం ఉండకపోయేది అనేదీ తప్పు… మరిన్ని కూతలు వచ్చేవి కదా ఆ నోటి వెంట…

  • ఒకవైపు తెలంగాణ ఆవిర్బావదినం జరుపుకుంటుంటే, ఈ ద్వేష, విష వ్యాఖ్యలు వినాలా తెలంగాణా… అందుకే రేవంత్ రెడ్డి సమావేశానికి అనుమతి నిరాకరించి, ఓ కాలుష్య ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు… తను మరో మంచి పనిచేశాడు… పవన్ కూతలపై ఒక్క ముక్క కూడా స్పందించలేదు, పవన్ కల్యాణ్‌ను ఓ నాయకుడిగా, తను స్పందించాల్సిన రేంజ్ ఉన్న నాయకుడిగా గుర్తించకపోవడం అది… పవన్ కల్యాణ్ వంటి విద్వేషులకు అది సరైన జవాబు…

నిజానికి పవన్ కల్యాణ్‌ ఏదేదో మాట్లాడేస్తాడు, ఒక వాక్యానికీ, తరువాత వాక్యానికీ పొంతన ఉండదు, కంట్రాస్టు కూడా… ప్రాంతీయ వాదం ఉగ్రవాదంకన్నా ప్రమాదం అంటాడు… ప్రాంతీయ ఆకాంక్షలు- పోరాటాల బాధ తెలిస్తే కదా… మరి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర కోసం చేసిన పోరాటం ప్రాంతీయ వాదం కాదా..?

మళ్లీ తనే అంటాడు పొట్టి శ్రీరాములుకూ కులాన్ని అంటగట్టారని..! ఆయన్ని ఓన్ చేసుకున్న కులం మీలాంటి ఆధిపత్య కులాల్లాగా రాజకీయాలు చేయలేదు… భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీరాములు త్యాగమే కారణం అంటాడు… మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడింది 1953లో… భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది 1956లో… (ఆరోజే తెలంగాణ మెడకు ఉరి బిగించారు)… అసలు ఏపీకి ఓ అవతరణ దినమే లేదనే సోయి పవన్ కల్యాణ్‌కు ఉందా…

జూన్ 2 ను గుర్తించరు… ఆంధ్ర మద్రాస్ నుంచి వేరుపడిన అక్టోబరు ఒకటిని గుర్తించరు… ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1 కూడా గుర్తించరు… అఫ్‌కోర్స్, నవంబరు ఒకటి అనేది ఆప్ట్ కాదు, అప్పుడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు… సరే, ఇదంతా పక్కన పెడితే… చంద్రబాబు సన్నాయినొక్కులు కూడా ఓసారి ప్రస్తావించాలి…

‘విడిపోయి పన్నెండేళ్లయింది, మళ్లీ ద్వేషం పెంచే ధోరణి సరికాదు, సమావేశానికి అనుమతించాలి’ అంటున్నాడు… ద్వేషం పెంచే ధోరణి నీ భాగస్వామి పవన్ కల్యాణ్‌ది, చెప్పాల్సింది తనకు… ఎవడబ్బ జాగీర్ అనే భాషను మాట్లాడతాను, అదీ తెలంగాణ అవతరణదినం రోజే మీటింగు పెడతాను అంటే ఎందుకు అంగీకరిస్తుంది తెలంగాణ… నువ్వూ మారవు, నీ పవన్ కల్యాణూ మారడు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…
  • నీరు- నెత్తురు… పాకిస్థాన్‌కు బుద్దిచెప్పే దిశలో హైడల్ ప్రాజెక్టులు…
  • మారని KTR దగ్గూదమ్మూ భావజాలం… 8 నుంచి బత్తిన చేపమందు…
  • శిష్యుడిని మింగిన గురువు అరుదైన కథ… ప్రతి పాటా ఓ స్వాతికిరణమే…
  • ‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…
  • పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…
  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions