Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడొకడు, వీడొకడు… ఏం మోపైనార్రా భయ్… అసలెవర్రా మీరంతా…

June 4, 2026 by M S R

.

ఏం చీప్ అయిపోయిందిర భయ్ తెలంగాణ మీకు..? ఎక్కడెక్కడి వాడో ఏదేదో మాట్లాడేస్తున్నారు… ఎవరికీ తెలంగాణ నేలతో సంబంధం లేదు… చాన్స్ దొరికితే చాలు, తెలంగాణను మరింత దోచుకుని, మరింత పెత్తనం చెలాయించాలని కాచుక్కూర్చునే బ్యాచ్…

ఫస్ట్, పవన్ కల్యాణ్… తన జన్మస్థలం ఏదో తెలియదు, కానీ పక్కాగా ఆంధ్రా… కార్యక్షేత్రం ఆంధ్రా… ప్రేమ ఆంధ్రా… బతుకంతా ఆంధ్రా… తెలంగాణ గడ్డ మీద నిలబడి, ఇది ఎవడబ్బ జాగీర్ అని అరుస్తాడు… సరే, ఇది ఎవడి జాగీరో బీజేపీ మినహా తెలంగాణలోని అన్ని పార్టీలు స్పష్టంగా మొహం మీద కొట్టినట్టు జవాబు ఇచ్చాయి.,.

Ads

తరువాత నాలుక కర్చుకుని, తెలంగాణ వాళ్లకున్న అస్థిత్వ సోయి మా ఆంధ్రులకు ఎందుకు లేకపాయె, కుల కొట్లాటలు తప్ప ఇంకేముంది ఇక్కడ అంటూ మహాబాధపడిపోయాడు, అది వేరే సంగతి… కూటమి భాగస్వామి కదా, ఖండించకపోతే బాధపడతాడు పాపం అనుకుని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు రంగప్రవేశం చేశాడు… ప్రాంతాల మధ్య ద్వేషాలు పెంచకండి అని తెలంగాణ నేతలకు హితవు చెప్పాడు, చేసేదేమో తన పొత్తుదారు పవన్ కల్యాణ్, నిందించేది తెలంగాణ నేతలను… ఏం పెద్ద మనిషివయ్యా బాబూ…

తరువాత ప్రకాష్ రాజ్… పుట్టింది కర్నాటక… వృత్తి రీత్యా చెన్నైలో ఓ ఇల్లు, బెంగుళూరులో ఓ ఇల్లు… టాలీవుడ్ కోసం, ఎక్కడో ఓ ఫామ్ హౌజ్ కట్టుకుని, దాని రక్షణ కోసం అదేదో ఊరిని దత్తత తీసుకున్నట్టు ఓ నాటకం… సరే, అదీ ఓ వేషం అనుకుందాం… పవన్ కల్యాణ్ ఏదో అన్నాడు, సరే, తనెందుకు తెర మీదకు వచ్చినట్టు..? తెలంగాణ రాజకీయాలతో నీకేం సంబంధం..?

ఇదుగో, ఇలాగే ప్రతి విషయంలోనూ వేలు పెట్టి మురుక చూసుడు అలవాటు కదా… ట్రంపును, నెతన్యాహూను కూడా ఆడిపోసుకుంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటూ… రాసేవాడు రాస్తూనే ఉంటాడు… తనేదో పెద్ద మేధావి అయినట్టు…! తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వస్తావా, రా, కానీ క్లారిటీ ఇవ్వు ముందు, పొత్తుతో వస్తావా, ఎవరితో వస్తావు అని ఏదో ట్వీటాడు… ఈజీ పని కదా…

సరే, ఏదో కూశాడు ఎప్పటిలాగే… కానీ తనకేం సంబంధం ఇందులో..? మరో చిత్రమైన కేరక్టర్ ఉంది, ఎక్కడో తంజావూరు జన్మస్థలి, ఆంధ్రామూలాలు అని చెప్పుకుంటాడు… పేరు సెవన్ ఓ క్లాక్ బండ్ల గణేష్… ‘ఒరేయ్ నువ్వెవడివిరా అడగటానికి ..? తెలుగోడివా, తమిళోడివా, కన్నడోనివా అని పేలాడు… అసలు నీకు ఏం సంబంధం గణేషా..?

బండ్ల

ఎందుకంటే..? పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని కాబట్టి..! సో, ఇలా తెలంగాణ రాజకీయ బరి మీద ఎవరెవరో ఏదో మాట్లాడేస్తున్నారు, తన్నుకుంటున్నారు… గిల్లుకుంటున్నారు, సొల్లు కక్కుతున్నారు… వీళ్లెవరికీ తెలంగాణ నేలతో సంబంధం లేదు… పైన చెప్పిన నలుగురూ హైదరాబాదులోనే ఉంటారు, ఇక్కడే ఇళ్లున్నాయి… కానీ ఎవరూ ఈ నేల మూలవాసులు కాదు…



ఇక పాపం, తెలంగాణ బీజేపీ..? కక్కలేక, మింగలేక… పవన్ కల్యాణ్‌ను మోయలేక, కింద పడేయలేక… ఏం కష్టమొచ్చిందిరా నాయనా… మీట్ ది ప్రెస్‌లో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడాడు… ‘అయ్య జాగీరా అని పవన్ అన్నట్టు వినలేదట, ఎవరో కాంగ్రెస్ మంత్రి అన్నట్టు తెలుసట… పాపం, పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదట…

  • పవన్ కల్యాణ్ వేషాలకు కాదు, ఇదుగో ఈ బీజేపీ సమర్థనలతో ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవడం, జనంలో వ్యతిరేకత పెంచుకోవడం..! తెలంగాణ సమాజానికి దేశభక్తి లేదని కూశాడు, వినలేదా..? గద్దర్‌కు కారు కొనిచ్చిన, కొండగట్టుకు పైసలిచ్చిన అనే కూతలు సరేసరి… దిష్టి వ్యాఖ్యలు మరీ ఘోరం… జనసేన కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బలిస్తాం అంటున్నారు, ఇవన్నీ సమర్థిస్తున్నట్టా తమరు..? ఇక తనను మోసుకుంటూ నగర ఎన్నికలకు రండి, జనం దిష్టి తీస్తారు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…
  • వాడొకడు, వీడొకడు… ఏం మోపైనార్రా భయ్… అసలెవర్రా మీరంతా…
  • కాంచి- బొంగు- సీటు … సైకిల్- ఈత నేర్వనోడు అప్పట్లో శుద్ధ మొద్దు…
  • AI పై భయమొద్దు… పనికి ఢోకా లేదు, పని తీరు మారుతుంది… అంతే…
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేటీయార్ కవరింగులు- సన్నాయి నొక్కులు..!!
  • డీకే బలంగా నమ్మే ఒకే ఒక పేరు..! ఇంతకీ ఈ గంగాధర అజ్జయ్య ఎవరు..?
  • అమీర్ ఖాన్ మూడో భార్య గౌరి..! ఆమె కుటుంబ నేపథ్యం ఇంట్రస్టింగ్..!!
  • డాన్-3 కంట్రవర్సీ..! అది కార్మిక సంఘమా..? పెదరాయుడు కోర్టా..?
  • పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నిజతత్వం తెలిసింది… మాట మారింది…
  • నీరు- నెత్తురు… పాకిస్థాన్‌కు బుద్దిచెప్పే దిశలో హైడల్ ప్రాజెక్టులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions