Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!

June 11, 2026 by M S R

.

వర్తమాన రాజకీయాల్లో తనను తాను గోక్కొని, రక్కుకునే కేరక్టర్ బహుశా పవన్ కల్యాణ్ మాత్రమే అనుకుంటా… మొన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినాన తనూ ఓ మీటింగు పెట్టబోయి, భంగపడి, ప్రెస్‌మీట్ పెట్టి, ఎవడబ్బ జాగీరు అని ఏదో కూసి, తెలంగాణ సమాజం ఒక్కటై థూత్కరించినా సరే, ఇంకా సోయిలోకి రాలేదు… రాడు, వస్తే పవన్ కల్యాణ్ ఎందువుతాడు..?

మళ్లీ అదే కూత… హైదరాబాద్ ఎవడబ్బ జాగీరు అన్నాడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘‘నాకు తెలంగాణలో బలమైన కేడర్ ఉంది, 2007 నుంచీ, అంతకు ముందు నుంచీ తెలంగాణ యువత నాతోనే ఉంది, నాకు తెలంగాణలో పోటీచేయాలని లేదు, కానీ మా నాయకులు, మా కేడర్ ద్వారా తెలంగాణలో పోటీలో ఉంటాం, బీఆర్ఎస్ గాకుండా ఓ జాతీయ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఓ వింత, హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమంటూ అల్లరి మూకల్ని పంపిస్తున్నారు, నన్ను రావద్దనే హక్కు ఎవరికీ లేదు, ఒకవేళ కాంగ్రెస్ ఆ పిలుపునిస్తే రాహుల్ గాంధీకి ఓ మాట చెప్పాల్సి ఉంటుంది…’’ అని చెప్పుకొచ్చాడు…

Ads

సమాజంలోని అసమానతలు చూసి, చిన్నప్పుడే నక్సలైట్ కావాలనుకున్నాననీ అన్నాడు… ఫాఫం మావోయిస్ట్ ఉద్యమం..! అసలు విషయానికి వస్తే, మళ్లీ మళ్లీ అదే ఎవడబ్బ జాగీరు అంటున్నాడు… ఎస్, ఖచ్చితంగా నీలాంటోళ్ల జాగీరు అస్సలే కాదు… దేశం నలుమూలల నుంచీ వచ్చి ఇక్కడ మమేకం అయిన జాతులు బోలెడు… కానీ నీలాంటి భాష ఎవరూ మాట్లాడరు… తప్పుకుండా హైదరాబాద్ ఇక్కడి భూమిపుత్రులదే…

ఇదుగో ఇలా మాట్లాడి, ప్రాంతీయ విద్వేషాల్ని, తెలంగాణపై విషాన్ని కక్కే ప్రతి ఒక్కడూ పరాయోడే..! 2007 ముందు నుంచే తనకు బలమైన కేడర్ ఉందట తెలంగాణలో… ఇదొక్కటి చాలు పవన్ కల్యాణ్ శుష్క వ్యాఖ్యల డొల్లతనం చెప్పడానికి..! బీఆర్ఎస్ వోకేనట, కాంగ్రెస్ వచ్చాకే ఇలాంటి ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు మొదలయ్యాయట… గతంలో కేసీయార్ ‘ఎవడు వాడు, తునకలు తునకలు అయిపోతాడు’ అని చేసిన వ్యాఖ్య గుర్తుకులేనట్టుంది…

బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి వేషాలేవీ వేయకుండా అణిగిమణిగి ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెచ్చిపోయి, ప్రాంతీయ విద్వేషాగ్నిని రగిలిస్తున్నదెవరు..? మీ చంద్రబాబు ఆలోచన ఏమిటి, నిన్ను ఎంకరేజ్ చేసి, ముందుకు ఉసిగొల్పడంలో..?! జాతీయ పార్టీ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదు ఇది, ఆ పని చేస్తున్నది నువ్వే… బీఆర్ఎస్‌కు ప్రాంతీయ స్పృహ ఉండొచ్చు గానీ, జాతీయ పార్టీకి ఉండకూడదట…

ఇలాగే మాట్లాడతాను, ఎవడబ్బ జాగీరు అంటూ… హైదరాబాద్ లా అండ్ ఆర్డర్‌కు చికాకుగా మారితే… గతంలో కొందరిని కేసీయార్ రాష్ట్ర బహిష్కరణ చేశాడు, గుర్తుందో లేదో… ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఊరుకోదు… అలా చేస్తే రాహుల్ గాంధీకి ఓ మాట చెబుతాడట… (మొన్న విలేకరులు ఏదో గుర్తుచేస్తే పవన్ కల్యాణ్ మీద కామెంట్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడలేదు, అదీ తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పవన్ కల్యాణ్ రేంజ్…)

అలా చెబితే వెంటనే రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులకు ఫోన్ చేసి… ‘‘జాగ్రత్త, పవన్ కల్యాణ్ మనకూ కావల్సినవాడే, ఏదో పేరుకు బీజేపీతో ఉన్నాడు, ఎప్పటికైనా మనకు పనికొచ్చేవాడే, కాస్త చూసీచూడనట్టు ఉండండి, వీలు చూసుకుని విలీనం చేసుకుందాం…’’ అని హితవు చెబుతాడా..? ఆదేశిస్తాడా..? ఇంతకీ అయిపోయిందా..? గీకడం ఇంకా కొనసాగుతుందా..?!

PK

చదివారు కదా… ఇక పవన్ కల్యాణ్ గురించి చదువరులే పక్కాగా అంచనా వేసుకోవచ్చు… ‘‘ప్రజలు ఎడ్డోళ్లు, ఏం చెప్పినా నమ్ముతారు’’ అనే భ్రమా..? లేక మొత్తానికే ఏదో తేడా కొడుతోందా..?! నెత్తిన మోస్తున్న బీజేపీని చూసి జాలిపడాలి…

కొసమెరుపు :: దేశసామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్నాడట..!!! తెలంగాణ తన మాతృభూమి అట... మరి పుట్టిన గడ్డ మీద ఈ ద్వేషం ఏమిటట..!!

https://www.facebook.com/reel/1516718046503019

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీ తరువాత ఎవరు..? ఓ కొత్త బ్లూ ప్రింట్ సిద్ధమైపోతోందా..?!
  • ఈ ‘జాగీర్దారు’ ఇంకా గోకుతూనే ఉన్నాడు తెలంగాణ సమాజాన్ని..!!
  • ఈయన్ని ఇంకాస్త డిఫరెంటుగా, లోతుగా అర్థం చేసుకుందాం ఇలా…!
  • భేష్ సింగరేణి… తవ్వి వదిలేయలేదు… పచ్చగా ప్రకృతికి తిరిగి అప్పగింత…
  • టైమ్ ట్రావెల్… ఇండియన్ సినిమాలో ఈ కథతో ఇదే తొలిసారి…
  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!
  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
  • అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
  • మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions