.
ఒకవైపు టాప్-8 దశలోనే భంగపడి… పరువు పోగొట్టుకుని… ఎప్పుడూ తమ గురించి గొప్పగా కోతలు కోసే పాకిస్థాన్ చివరకు తమ సొంత జట్టు ప్లేయర్ల జీతభత్యాల్లో ‘‘కోతలకు దిగుతున్న’’ వైనం… మరోవైపు ఇండియాపై అదే విషం, అదే విద్వేషపు కూతలు… కుళ్లుకోవడం అంటారు దీన్ని తెలుగులో…
మొన్న ఓ కీలకమైన మ్యాచులో… కష్టపడి వెస్టిండీస్‌పై గెలిచింది ఇండియా… ఒక దశలో ఆశలు వదిలేసుకునే తరుణంలో సంజూ శాంసన్ బలంగా క్రీజులో నిలబడి, ధాటిగా ఆడి గట్టెక్కించాడు… తను చివరి షాట్ కొట్టేవరకు కూడా ఇండియన్ ఫ్యాన్స్‌లో ఆందోళన ఉంది… అంత కష్టంగా సాగింది ఆ మ్యాచ్…
Ads
కానీ పాకిస్థానీ మాజీ ప్లేయర్లు మాత్రం ‘‘ జై షా ఫోన్ చేసి బెదిరించాడు… అందుకే వెస్టిండీస్ ప్లేయర్లు భయపడి, ఓడిపోయారు…’’ అనే ప్రచారానికి దిగారు… జై షా నిజంగా అలా బెదిరిస్తేనో, డబ్బు ఇచ్చి కొనేస్తేనో… లేక మ్యాచ్ ఫిక్స్ చేస్తేనో… వెస్టిండీస్ ప్లేయర్లు దాదాపు గెలిచే స్థితి దాకా ఎలా ఆడినట్టు మరి..? పదే పదే ఇవే పిచ్చి కూతలు పాకిస్థాన్ నుంచి..!
అణువణువునా యాంటీ ఇండియా ద్వేషం రగిలే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు… తన్వీర్ కూడా జింబాబ్వే- ఇండియా మ్యాచ్ గెలుపు మీద కూడా సేమ్ ఆరోపణలు… ఇండియా వర్సెస్ వెస్టిండీస్, ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌ల ఫిక్సింగ్ ( Match Fixing) జరిగిందని వాళ్ల విమర్శ…
‘‘టీమిండియా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత వెంటనే ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగంలోకి దిగాడు… వెస్టిండీస్ ప్లేయర్లను బెదిరించాడు… దీంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వెళ్లిపోయింది… లేకపోతే 195 రన్స్ చేజ్ చేసే సామర్థ్యం ఇండియాకు ఎక్కడుంది… వెస్టిండీస్ ప్లేయర్లు భయపడి, ఓడిపోయారు… బీసీసీఐ చెప్పినట్టు ఐసీసీ నడుచుకుంటోంది, ఇక క్రికెట్ ఆడటం కష్టమే…’’ ఇదీ హక్ కూత…
‘‘డ్రింక్స్ సమయంలో జై షా రంగంలోకి దిగాడు, జింబాబ్వే ఆటగాళ్లను కొనేశాడు, దాంతో ఆ మ్యాచులో జింబాబ్వే ఇండియా ముందు ఓడిపోయింది’’ ఇదేమో తన్వీర్ కూత… అంతకుముందు, అంటే టీ20 వరల్డ్ కప్ ఆటలు స్టార్ట్ గాకముందు… అభిషేక్ శర్మ మీద కూడా, బుమ్రా మీద కూడా బోలెడు పిచ్చి కూతలు కూశారు…
బంగ్లాదేశ్‌కు మద్దతు పేరిట నానా వేషాలూ వేశారు, ఈ టోర్నీని బహిష్కరిస్తామనీ బెదిరించారు… జైషా ఎక్కడికక్కడ నట్లు బిగించేసరికి, విధిలేక ఆడారు… చేతులెత్తేశారు… పరువు పోగొట్టుకున్నారు… సొంత దేశం ఫ్యాన్సే బూతులు తిడుతున్నారు ప్లేయర్లను… ఇదీ పాకిస్థాన్ క్రికెట్ దురవస్థ…
షాహిద్ ఆఫ్రిది కూడా ఇండియా ద్వేషే… కానీ ఓ డిఫరెంట్ విశ్లేషణ చేశాడు… ప్రతి మ్యాచులో ఇండియా జట్టులో ఎవరో ఒక ప్లేయర్ క్లిక్కయి, బాగా రన్స్ చేయడంతో ఇండియా గెలుస్తోందని, అంతేతప్ప ఒక జట్టుగా సమిష్టి ప్రతిభను చూపలేకపోతోందని తన విశ్లేషణ… అమెరికాతో జరిగిన మ్యాచు నుంచీ ఉదాహరణలు చెబుతున్నాడు… పర్‌ఫెక్ట్ విజయాలతో సాగుతున్న దక్షాణిఫ్రికాకు ఈ టోర్నీ గెలిచే సత్తా ఉంది అనేది తన అంచనా…
శాంసన్ అంటే గౌతమ్ గంభీర్‌కు పడదని క్రికెట్ సర్కిళ్లలో ఉన్న ప్రచారమే… ఎప్పుడైతే వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచులో శాంసన్ చేసిన 97 పరుగులతో గెలిచాం కదా… దీనిపై గంభీర్ చేసిన వ్యాఖ్యలు కూడా సరైన రీతిలో లేవు… శాంసన్ పరుగులకన్నా దూబె కొట్టిన రెండు ఫోర్లు ముఖ్యం అన్నట్టుగా ఎక్స్‌ప్రెస్ చేశాడు, తప్పు… ప్రతి ప్లేయర్ చేసే ప్రతి పరుగు విలువైందే అని చెప్పాలనుకున్నాడో ఏమో గానీ, శాంసన్ భుజం తట్టి అభినందించాల్సిన సందర్భంలో… అది మరిచిపోయి, తన ఇన్నింగ్స్‌ను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేయడం తప్పే..!!
Share this Article