.
Pardha Saradhi Potluri …. ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ యుద్ధం! డ్యూరాండ్ లైన్ కోసం పాక్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య యుద్ధం – అమెరికా ప్లాన్!
26, ఫిబ్రవరి, 2026 గురువారం అర్ధరాత్రి హఠాత్తుగా పాకిస్తాన్ యుద్ధవిమానాలు ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్, కాందహర్, జలాలాబాద్ మీద బాంబింగ్ చేశాయి! ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ సైనిక పోస్టులు, ఆయుధ డిపోలని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి పాకిస్తాన్ F-16, JF -17 విమానాలు.
Ads
ఇంత హఠాత్తుగా పాకిస్తాన్ దాడులు ఎందుకు చేసింది?
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ అసిఫ్ X ( ట్విట్టర్ ) వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు దాని సారాంశం…..
“ మేము ఆఫ్ఘనిస్తాన్ తో విసిగి పోయాము. 2021 లో నాటో దళాలు వెళ్లిపోయాక ఆఫ్ఘనిస్తాన్ లో ప్రశాంతత నెలకొంటుంది అని ఆశించాము. కానీ అలా జరగలేదు. తాలిబాన్లు తరుచూ పాకిస్తాన్ లోకి చొరబడి మా సైనిక అవుట్ పోస్టులని ధ్వంసం చేసి మా సైనికులని చంపి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ లోకి పారిపోతున్నారు. ఇది మేము ఊహించలేదు..’’
మరో పోస్టులో ఖాజా అసిఫ్ ఇలా అన్నాడు…. ‘‘ఆఫ్ఘనిస్తాన్ భారత దేశ కాలనీగా మారిపోయింది! మేము వివిధ దేశాలతో చర్చలు జరిపి తాలిబాన్లు మా మీద దాడులు చేయకుండా మధ్యవర్తిత్వం చేయమని అడిగాము కానీ అవేవి పనిచేయకపోగా ఆఫ్ఘనిస్తాన్ ఇండియన్ ప్రాక్సీగా మారిపోయి దాడులు తీవ్రతరం చేస్తూ రావడం వలన చివరికి విసిగిపోయి వైమానిక దాడులు చేయాల్సి వచ్చింది’’ అని వాపోయాడు!
పాకిస్తాన్ వెర్రి పుష్పం అని మరోసారి రుజువయ్యింది! ఎలా అంటే…. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కాబూల్, కాందహార్, జాలాలాబాద్ మీద దాడి చేయగానే విలేఖరులు ట్రంప్ ని ప్రశ్నించారు పాకిస్థాన్ చర్య సరైనదేనా అంటూ… దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే తన సరిహద్దులు కాపాడుకొనే హక్కు పాకిస్తాన్ కి ఉంది అని…
Well…! ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ప్రతీకారం తీర్చుకోమని ట్రంప్ సలహాదారు ఒకరు ఆసిమ్ మునీర్ కి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఆసిమ్ మునీర్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకి ఆదేశాలు ఇచ్చాడు.
పాకిస్తాన్ కి ఉగ్రవాదం మీద పోరు అనే నెపంతో సహాయం కింద ఉచితంగా ఇచ్చిన F-16 ఫైటర్ జెట్స్ ని ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి అనే కండిషన్ పెట్టి ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ F-16 లని పాకిస్తాన్ బోర్డర్ దాటి ఉపయోగించకూడదు!
ట్రంప్ దగ్గర నుండి అనుమతి వచ్చింది కాబట్టి వెనకా ముందు ఆలోచించకుండా ఆఫ్ఘనిస్తాన్ మీద F-16లతో దాడి చేసి చేతులు కాల్చుకున్నాడు ఆసిమ్ మునీర్.

పెంటగాన్ ఆలోచన వేరు.
ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడి చేస్తే చైనా ప్రొద్బలంతో పాకిస్తాన్ ఎక్కడ JF -17, J-10C లతో ఇరాన్ కి సహాయంగా వస్తుందో అని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి ఉసిగొల్పి బిజీగా ఉండేట్లుగా చేసింది అమెరికా!
తమ మీద దాడిచేస్తే తాలిబాన్లు ఊరుకుంటారా? కనీసం మూడురోజులపాటు పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగిస్తారు! వాస్తవంగా అదే జరిగింది! ఈలోపల ఇజ్రాయేల్, అమెరికా కలిసి ఖోమేనిని చంపేసాయి!
- ప్రస్తుతం 26 మంది పాకిస్తాన్ సైనికులు తాలిబాన్లకి బందీలుగా చిక్కారు.
ప్రతీకార దాడిలో భాగంగా తాలిబాన్లు డ్రోన్లతో దాడిచేసి కరాచీ, ఇస్లామాబాద్ లలో విధ్వంసం సృష్టించారు!
పాకిస్తాన్ ప్రజలకి భయం అంటే ఏమిటో రుచి చూపించారు తాలిబాన్లు!
ఆఫ్ఘనిస్తాన్ కి ఎయిర్ ఫోర్స్ లేదు. లాండ్ లాక్డ్ కాబట్టి సముద్రం లేదు, నావీ లేదు. ఉన్నది ఒకటే ఆర్మీ!
కానీ ఈ డ్రోన్లు ఎక్కడనుండి వచ్చాయి? ఎవరు డ్రోన్లు తాలిబాన్లకి ఇచ్చారు?
తాలిబాన్లు 2021 లో అధికారంలోకి రాకముందునుండి అప్పట్లో నాటో దళాల మీద మెరుపు దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని పారిపోయేవారు. నాటో దళాల నుండి లాక్కొన్న ఆయుధాలలో రికానిసెన్స్ ( గస్తీ లేదా సమాచార సేకరణ కోసం వాడుతారు ) డ్రోన్లు, ఆటాక్ డ్రోన్లు ఉన్నాయి.
2020 లో స్పెషలైస్డ్ డ్రోన్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇంగ్లిష్ రాదు కాబట్టి విదేశాలలో స్థిరపడ్డ పష్తూన్ లతో ట్రాన్సలేట్ చేయించుకొని నేర్చుకున్నారు.
త్వరలోనే డ్రోన్ టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించారు.
తాలిబాన్లు వాడేవి మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్ కావు!
డోమెస్టిక్ క్వాడ్ కాప్టర్స్ అంటే కమర్షియల్ డ్రోన్స్. నాలుగు వైపులా లిఫ్ట్ బ్లేడ్స్ ఉంటాయి.
ఉదా : DJI MATRICE 210 మోడల్ చైనా తయారీ. ఇవి ఆన్లైన్ ద్వారా అలీబాబా నుండి బల్క్ లో కొంటారు. తరువాత వాటికి మార్పులు చేసి బాంబులని అటాచ్ చేసి ప్రయోగిస్తారు.
విచిత్రం ఏమిటంటే తాలిబాన్లు క్వాడ్ కాప్టర్స్ ని పాకిస్తాన్ నుండే స్మగుల్ చేస్తున్నట్లు ISI కి తెలియదు.
పాకిస్తాన్ లో తాలిబాన్లు మారు పేర్లతో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నారు. చైనా నుండి క్వాడ్ కాప్టర్స్ ని పాకిస్తాన్ లోకి దిగుమతి చేసుకొని అక్కడనుండి సరిహద్దులు దాటించి ఆఫ్ఘనిస్తాన్ లోకి తీసుకెళ్తున్నారు. కొన్ని డ్రోన్లని కరాచీ లోని బ్లాక్ మార్కెట్లో కొని ఆఫ్ఘనిస్తాన్ లోకి తరలిస్తున్నారు.

మోడీఫికేషన్ టెక్నీక్స్ : క్వాడ్ కాఫ్టర్స్ ని మోడీఫై చేసి IED (Improvised Explosive Devices ) ని అటాచ్ చేసి దాడులు చేస్తున్నారు.
చీప్ & బెస్ట్!
ప్లాస్టిక్ బాటిల్స్ లో పేలుడు పదార్ధాలని నింపి పైనించి జారివిడిచి పేలుడుని సృష్టిస్తున్నారు.
క్వాడ్ కాప్టర్స్ కి మోర్టార్లని ఫిక్స్ చేసి పైనుండి జారవిడిచి విధ్వంసం సృష్టిస్తున్నారు.
మోర్టార్ పైనుండి విడిచిపెట్టినప్పుడు అది దారి తప్పకుండా ఉండడానికి వాటికీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి చిన్న చిన్న రెక్కలు అమరుస్తున్నారు. బరువు తక్కువ ఉన్నవాటికి బాడ్మింటన్ షటిల్ కాక్ కి ఉండే ఈకలని అమర్చి జారవిడుస్తున్నారు! మనకి తెలిసిందే కదా షటిల్ కాక్ వంకర్లు తిరగకుండా తిన్నగా కిందకి పడడం అనేది దానికి ఉండే ఈకల వల్లే అని!
తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఒకే ప్రదేశం మీద పదులకొద్దీ క్వాడ్ కాప్టర్స్ తో దాడి చేస్తున్నారు తాలిబాన్లు!
మాడిఫై చేయడం వల్ల క్వాడ్ కాప్టర్స్ 200 km దూరం వెళ్లి కరాచి, ఇస్లామాబాద్ వరకూ ప్రయాణించి విధ్వంసం సృష్టిస్తున్నాయి.
కతార్ దొంగ దెబ్బ!
పాకిస్థాన్లో తాలిబాన్ల తో పాటు TTP ( తెహ్రిక్ – ఇ -తాలిబాన్ పాకిస్థాన్ ) కి ఆర్ధికంగా, ఆయుధపరంగా సహాయం చేస్తున్నది కతార్ అని ISI పసిగట్టింది!
ఫిబ్రవరి 24 న షెబాజ్ షరీఫ్ దోహా పర్యటనకి వెళ్ళాడు. పైకి చెప్పడం ద్వైపాక్షిక చర్చలు అని కానీ TTP కి ఖతార్ చేస్తున్న సాయం ఆపమని అడగడానికే! ఖతార్ ఏమీర్ షేక్ తమీమ్ నుండి ఎలాంటి హామిని తీసుకోలేక పోయాడు షేబాజ్ షరీఫ్!
మధ్యప్రాచ్యంలో అమెరికాకి అతిపెద్ద ఎయిర్ బేస్ ఉన్నది కతార్ లోనే!
2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో సైన్యం సురక్షితంగా బయటికి వెళ్ళడానికి తాలిబన్లతో చర్చలు జరిపింది దోహాలోనే.
మిడిల్ ఈస్ట్ లో అమెరికాకి నమ్మిన బంటు కతార్ మాత్రమే!
అమెరికా ప్రోద్బలంతోనే కతార్ TTP కి సహాయం చేస్తున్నది! అలాంటిది పాకిస్తాన్ అడగగానే TTP కి సహాయం చేయడం ఆపేస్తుందా?
బాలూచిస్తాన్ తిరుగుబాటు ఉద్యమానికి కూడా CIA ద్వారా కతార్ సహాయం చేస్తున్నది!
R&AW కేవలం ఇంటెలిజెన్స్ పరంగా సహాయం చేస్తుంది తప్పితే తాలిబాన్లకి నేరుగా ఎలాంటి సహాయం చేయదు.
SO…! అమెరికా దక్షిణాసియాలో మరో థియేటర్ ఓపెన్ చేసింది దానిపేరు డ్యూరాండ్ లైన్!
తాలిబాన్లు పాకిస్తాన్ F-16 ని కూల్చినట్లు ఫోటోలు వీడియోలు రిలీజ్ చేశారు కానీ అది F-16 శిధిలాలుగా
లేవు. ఫైటర్ జెట్ ని కూల్చాలి అంటే కనీసం MANPAD లు కావాలి. అవి అమెరికన్ తయారీ స్టింగర్ మీసైల్ లేదా రష్యాన్ ఇగ్లా -S లు కావాలి.
అమెరికన్ సైన్యం 2021 లో కొన్ని స్టింగర్ మిసైల్స్, లాంచర్స్ బాగ్రామ్ ఎయిర్ బేస్ లో వదిలి వెళ్ళింది కానీ వాటిలో ఉపయోగించే బాటరీలు ఎక్సపైర్ అయిపోయాయి, కొత్తవి బయట దొరకవు.
పాకిస్తాన్ సైన్యం ఇరాన్ కి సహాయంగా రాకుండా ఆపడానికి డ్యూరాండ్ లైన్ పేరుతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలుపెట్టించింది!
పాకిస్తాన్ తో మీ దేశ సార్వభౌమత్వం కాపాడుకునే హక్కు మీకు ఉంది కాబట్టి F-16 లని యదేచ్చగా వాడుకోవచ్చని అమెరికా ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టింది!
మరోవైపు 150 ఏళ్ళ నుండీ మీ భూభాగం అయిన ఖైబర్ ఫక్తున్క్వా పాకిస్తాన్ అధీనంలో ఉంది కాబట్టి మీరు మీ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు మీకు ఉంది, కాబట్టి మీరు పోరాడండి మేము సహాయం చేస్తాము అని కతార్ చేత చెప్పిస్తున్నది అమెరికా!
ఆఫ్ఘనిస్తాన్ దాడుల వెనుక కతార్, అమెరికా ఉన్నాయి కాబట్టి దాని పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ కి తెలుసు కాబట్టి అమెరికా చెప్పినట్లు వినాల్సి వస్తున్నది!
నిన్న ఇరాన్ ఒక ప్రకటన చేస్తూ అమెరికా, ఇజ్రాయేల్ దేశాల ఫైటర్ జెట్స్ ఇరాన్ మీద దాడిచేయడానికి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లని వాడుకుంటున్నాయి అని ఆరోపించింది. పాకిస్తాన్ గగనతలంలో ఎగురుతున్న అమెరికా, ఇజ్రాయేల్ లకి చెందిన ఫైటర్ జెట్స్, B2 బాంబర్ ల ఫోటోలని విడుదల చేసింది.
IRGC అయితే పాకిస్థాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది!
ఇరాన్ కి సహకరిస్తే TTP దాడులు ముమ్మరం చేస్తుంది!
ఇరాన్ కి వ్యతిరేకంగా అమెరికాకి, ఇజ్రాయేల్ కి సహకరిస్తే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది!
అమెరికాని నమ్ముకుంటే ఇలానే అవుతుంది కానీ పాకిస్తాన్ కి వేరే దారి లేదు!
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధం దీర్ఘాకాలం కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.
గెలుపు ఎవరి వైపు ఉంటుంది?
గాంధార దేశం అంటే… Graveyard of Empires!
ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరూ సుస్థిరంగా పరిపాలన చేయలేరు అలా అని వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఆ దేశమే నాశనం అవుతుంది!
శకుని మామ తాను సుఖంగా బ్రతకలేడు ఇంకొకరిని సుఖంగా బ్రతకనీయడు!
ఇరాన్ అమెరికా అధీనంలోకి వెళితే?
ఇరాన్ లో ఉన్న బలూచ్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమణ లో ఉన్న బాలూచిస్తాన్ ప్రావిన్స్ లో కలిపేసి బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేస్తుంది! ఇది 2029 లో జరగబోతున్నది! వికీలీక్స్ పత్రాలలో ఈ విషయం ఉన్నట్లు 10 ఏళ్ళ క్రితమే జూలియస్ అసాంజే ఓపెన్గా చెప్పాడు!
Share this Article