Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!

February 17, 2026 by M S R

.

తెలంగాణ రాజకీయాల్లో ‘పొట్టోడు’ అనే పదం తరుచూ వినిపిస్తుంది… కాదు, కేటీయార్ ఎట్సెట్రా నేతలు రేవంత్ రెడ్డిని పదే పొట్టోడు పొట్టోడు అని తిట్టడంకన్నా ముందు నుంచే వినిపించేది… అదెలా అంటే… ‘‘పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ కొడతది…’’

అంటే ఏమిటి… బలహీనుడిని ఓ బలవంతుడు తొక్కేస్తే, ఆ బలవంతుడిని ఆల్‌మైటీ, దేవుడు, విధి… మేం తోపులం, మేం తురుములం అనుకుని ఎవరైనా మబ్బుల్లో తిరుగుతూ ఉంటే, వాళ్లను నేల మీద పడేయడం, అంటే తొక్కేయడం పక్కా అని… వర్తమాన తెలంగాణ రాజకీయాలు అలాగే ఉన్నాయని అనిపిస్తుంది కదా… ఎస్, డెస్టినీ…

Ads

రేవంత్ రెడ్డిని కేసీయార్ అరెస్టు చేసినప్పుడు రేవంత్ రెడ్డి పొట్టోడు, అంటే బలహీనుడు… కేసీయార్ దృష్టిలో..! తరువాత కొడంగల్‌లో ఓడిపోయాడు రేవంత్ రెడ్డి…. కానీ వెంటనే మల్కాజిగిరిలో ఎంపీ అయ్యాడు… తరువాత 2023లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యాడు… ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు… జస్ట్, ఇదంతా ఏడెనిమిదేళ్లలోనే… కేసీయార్ అధికారంలో ఉన్నన్నిరోజులూ బోలెడు కేసులు పెట్టారు రేవంత్ రెడ్డి మీద…

revanth

పొట్టోడు గట్టోడు అయిపోయాడు… పొడుగోడు అజ్ఞాతంలోకి జారిపోయాడు… ప్రజాజీవనంలోనే పత్తా లేడు… ఇదే పొట్టోడు పెట్టే గట్టి కేసులు బీఆర్ఎస్‌లో ‘పొడుగోళ్ల బ్యాచ్’ విచారణలకు తిరగాల్సి వస్తోంది… పొట్టోడు కుర్చీ ఎక్కాక ఏ ఎన్నికల్లోనూ ఈ పొడుగు బ్యాచ్ తమ పొడుగుతనాన్ని నిలుపుకున్నది లేదు…

రేవంత్

కంటోన్మెంట్, జుబ్లీహిల్స్, పంచాయతీ, మున్సిపల్… ఎన్నికలన్నింట్లోనూ గులాబీ పొడుగుతనం మరీ పొట్టిదైపోయింది… పొట్టోడు పొట్టోడు అని ఆ బ్యాచ్ వెక్కిరించిన పొట్టోడు మాత్రం ‘నేనే రాజు- నేనే మంత్రి’ అంటున్నాడు… ఇంత ఉపోద్ఘాతానికి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యం కూడా ఓసారి చూద్దాం…

revanth

రాజకీయం చేయడంలో నైపుణ్యం మా సొత్తే ఎవరైనా విర్రవీగితే అది ఓ భ్రమ… కేటీయార్ పదే పదే రేవంత్ రెడ్డిని వెక్కిరిస్తున్నాడు కదా… 90 సీట్లు కూడా రాని మీ గెలుపూ ఓ గెలుపేనా అని… సరే, కేటీయార్ అంత గట్టిగా కోరుకుంటున్నాడు కదా, అదీ చేసి చూపించేద్దాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి… పోచమ్మ కూడా తథాస్తు అనేసింది… నిన్న రాత్రితో 87 మున్సిపల్ పీఠాలు కైవసం అయిపోయాయి… 7 కార్పొరేషన్లలో ఆరు చేజిక్కాయి… 90 దాటింది లెక్క… వోకేనా కేటీయార్ సార్..?

ktr

మరో 11 వాయిదా పడ్డాయి కదా… సో, ఇంకా పెరుగుతుంది టోటల్ కాంగ్రెస్ మున్సిపల్ పీఠాల సంఖ్య… కేటీయార్ కోరికను అలా పోచమ్మ నెరవేర్చిందన్నమాట… శుభం… తను మాత్రం 17 దగ్గరే చతికిలపడిపోయాడు… తనే అన్నాడు మీడియా చిట్‌చాట్‌లో ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయని అనుకున్నాం, కానీ రాలేదు అని… ఎస్, పోచమ్మ పొట్టోడివైపే ఉంది… ఇక్కడ పోచమ్మ అంటే వోటరు దేవుడు..!!

brs

వర్తమాన రాజకీయాల్లో తుచ్ఛం, ఉచ్ఛం అని విడివిడిగా ఏమీ ఉండవు… ఎవడికి ఎంత రాజకీయం చేతనవును అనేదే ప్రధానం… అంతే… సిద్ధాంతాల్లేవు,  రాద్దాంతాల్లేవు, పార్టీ నిబద్ధతల్లేవు… నాకెంత, నాకేమిటి… ఇవే లెక్కలు…

కాంగ్రెస్- బీఆర్ఎస్ దోస్తీ కొన్నిచోట్ల… కాంగ్రెస్- బీజేపీ ఇంకొన్నిచోట్ల… ఎక్కడో ఎంఐఎం- బీజేపీ కూడానట… రాజకీయాల్లో ప్రత్యర్థిత్వం ఓ సన్ననిగీత… అధికారం కోసం సాగే రాజకీయాల్లో ఆ గీత ఎక్కడికక్కడ చిరిగిపోతుంది.,. ఇప్పుడూ అదే జరిగింది…

మున్సిపల్

పైగా బయటికి తిట్టుకుంటుంటారు… కాంగ్రెస్- బీజేపీ దోస్తులు అంటూ బీఆర్ఎస్… బీఆర్ఎస్- బీజేపీ దోస్తులు అంటూ కాంగ్రెస్… నిన్నెక్కడో హరీష్ రావు అంటున్నాడు… కాంగ్రెస్- బీజేపీల అపవిత్ర కలయిక, వాటాలు వేసుకుని పదవులు పంచుకుంటున్నారూ, అనైతికం అని… అసలు ఈ పరోక్ష ఎన్నికల విధానాలు, ప్రలోభాలకు తెరతీసింది నిజంగా ఎవరు..? 2019- తెలంగాణ మున్సిపల్ చట్టం… అది తీసుకొచ్చింది ఇదే కేసీయార్, ఇదే కేటీయార్, ఇదే హరీష్ రావు..!!

కామారెడ్డి

అవునూ… జస్ట్, ఒక ఉదాహరణ… కామారెడ్డిలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కలయిక మాటేమిటి సార్..? అది అత్యంత పవిత్రమా..? దేవరకద్ర, వేములవాడ, ఇస్నాపూర్, అమరచింత.., మరి వీటి మాటేమిటి మరి..? కాంగ్రెస్‌తో చేతులు కలిపిన ఆ పుణ్యాత్ములు, ఆ పవిత్ర పార్టీ ఏది సార్..? జెండాల్లేవ్, వేరే ఎజెండాల్లేవ్… ఓన్లీ పవర్…!!

కాంగ్రెస్- బీజేపీ సహకరించుకుంటే అవి తెలంగాణ వ్యతిరేకమా..? అపవిత్రమా..? మరి బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయం చేస్తే..।? ఇంతకీ రాజకీయాల్లో పవిత్రత అంటే ఏమిటి సార్..? కరీంనగర్‌లో తమరు ఎవరికి పరోక్ష పవిత్రంతో సపోర్ట్ చేశారు సార్..?

t politics

అన్నట్టు, మనం చెప్పుకుంటున్నది పొట్టోడు- పొడుగోడు సబ్జెక్టు కదా… ఈ మున్సిపల్ ఎన్నికలూ అంతే… పొట్టోడు పోటీ నుంచి వైదొలగుతాడు… పొడుగోడు అనగా, రాజకీయంగా, ఆర్థికంగా బలవంతుడు రాజకీయం చేసి, పొట్టోళ్లను పోటీ నుంచి పక్కకు నెట్టేసి… తను కుర్చీ ఎక్కుతాడు… జస్ట్, మూడేళ్లు ఆగండి… అవిశ్వాసాలు, మళ్లీ కొత్త పొత్తులు… మళ్లీ పట్టణాల్లో ‘పొట్టోడు- పొడుగోడు’ రాజకీయం షురూ అవుతుంది..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!
  • చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…
  • ఈ చంద్రబాబు దోస్త్‌కు మన తెలంగాణ ఆడపిల్లలు జస్ట్ గినియా పిగ్స్..!!
  • ఓ బందిపోటు కథ కాదు… దేహమంతా లైంగిక దాడి గాయాల బాధితురాలి కథ …
  • ఇప్పుడంటే ఎర్రతనం క్షీణదశ కానీ… అప్పట్లో ఎర్రెర్ర సినిమాలు ఎక్కువే…
  • అత్తరు కాదు అది… ఆడదాని నెత్తురు, కొవ్వు… ఓ సైకో ఫాంటసీ…
  • ఇండియా ఎలా గెలిచింది..? పాకిస్థాన్ ఎందుకు మట్టికరిచింది..?
  • ఆపరేషన్ సిందూర్ కంటిన్యూస్… ఇషాన్ కిషన్ బాంబింగ్‌తో పాకిస్థాన్ బెంబేలు…
  • నిజంగానే ఆ నరవాణేపై చర్య తీసుకునే దమ్ముందా ప్రభుత్వానికి..?
  • థర్మోబారిక్..! ఈ ఆయుధ ప్రయోగంతో మనుషులు ఆవిరైపోతారా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions