Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ కేసు ఆధారాలే కాలిపోతున్నట్టు… వాళ్లకు ముందే ఎలా తెలిసిపోయింది..?

February 9, 2026 by M S R

.

నిజం గడప దాటేలోపు… అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది… నిజమే కదా… బీఆర్ఎస్ క్యాంపు నమ్ముకున్నది కూడా అచ్చంగా దీన్నే…

నిజం జనానికి తెలిసేలోపు అబద్దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించాలనేది ఆ క్యాంపు ప్రచార ప్రధాన సూత్రం… ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం గురించీ అంతే… సరిగ్గా ఈ బురద పద్ధతినే అక్షరాలా పాటించింది…

Ads

అక్కడ ఓవైపు ల్యాబ్ తగులబడుతూనే ఉంటుంది, వెంటనే అర్జెంటుగా కేటీయార్ ట్వీట్లు… దానికి అనుబంధంగా పార్టీ క్యాంపెయిన్ మొదలవుతుంది… అంటే ప్రిప్లాన్‌డా..?

ఎందుకీ సందేహం అంటే..? మంటలు కూడా ఆరకముందే… వోటుకునోటు కేసు ఫైళ్లు, ఆధారాలు, అవశేషాలు అన్నీ కాలిపోయాయి, ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని గాయిగత్తర ఎలా స్టార్ట్ చేశారు..? అంటే అగ్నిప్రమాదం కాదా..? కేటీయార్‌కు ఎలా తెలుసు..? అవే కీలకాధారాలు కాలిపోతాయని, కాలిపోయాయని… ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది కదా…

నమస్తే

ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ నిన్న వివరంగానే క్లారిటీ ఇచ్చింది… వోటుకుకేసు బాపతు మెటీరియల్ 2015లో కోర్టు ద్వారా వస్తే, పరిశీలించి, నివేదికల్ని కూడా కోర్టుకు అప్పగించేశారు… 2021లో మెటీరియల్ కూడా వాపస్ ఇచ్చేశారు… ఇప్పుడు ఆ కేసు బాపతు మెటీరియల్ ఫోరెన్సిక్ ల్యాబులో ఏమీ లేదు… ఇదీ క్లారిటీ… మరి ఆ కేసు ఫైళ్లు కావాలనే ప్రచారం వెనుక ఇంకేదైనా కుట్రను దాచిపెట్టే ప్రయత్నం ఉందా..?

అది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించేనా..? ఆ ఫోన్ ట్యాపింగు అరాచకాలు బయటపడకుండా నిందితులు హార్డ్ డిస్కులను కాల్చేసిన సంగతి తెలిసిందే కదా… ఇంకొంత మెటీరియల్ ఈ ల్యాబ్ పరిశీలనకు వచ్చింది కాబట్టి… తమ బాగోతాలు బయటపడకూడదని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా ఎవరైనా..? ఐతే ఎవరు వారు..?

ఫోరెన్సిక్

2024 నుంచి 2026 వరకు 136 ఆబ్జెక్టులు పరిశీలనకు వచ్చాయి ఈ కేసులో… ఏడు మినహా మిగతావన్నీ పరిశీలించడం, నివేదికలు ఇచ్చేయడం జరిగిపోయింది… వాటి పరిశీలన కూడా పూర్తయింది, నివేదికలు తయారు కావాలి… కొంత మెటీరియల్ కూడా దర్యాప్తు అధికారులు తీసుకోవాల్సి ఉంది… ఆ ఏడు ఆబ్జెక్టులే ఈ కేసులో కీలకమా..? (మొత్తం రిట్రీవ్ చేస్తున్నట్టు ఆమె చెప్పింది)…

మరిప్పుడు అనుమానించాల్సింది ఎవరిని..? ఇది దగ్దమా? దహనమా..? ఎస్, అందరూ డిమాాండ్ చేస్తున్నట్టు కుట్ర కోణంలోనే దర్యాప్తు జరగాలి… ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు బ్యాచ్ వేళ్లు ప్రతిచోటా బలంగా విస్తరించినవే కదా… ప్రమాదం జరగగానే వెంటనే బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తీరు మీద కూడా దర్యాప్తు జరగాలి… నిజాలు తేలాలి కదా..!!

శిఖా గోయల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ కేసు ఆధారాలే కాలిపోతున్నట్టు… వాళ్లకు ముందే ఎలా తెలిసిపోయింది..?
  • చిన జియ్యర్ కూడా ఓసారి చదువుకోవాల్సిన ‘హిందూ ధర్మ పరంపర’…
  • మాతృదేవోభవ..! రాజయితేనేం… సన్యాసి ఐతేనేం… ఈ అమ్మకు కొడుకే కదా…
  • తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…
  • అమెరికాతో ట్రేడ్ డీల్..! అమెరికాయే దిగొచ్చింది… ఇవీ నిజాలు…
  • రాజు కాని రాజు రేచర్ల రుద్రుడు… అనితర సాధ్యుడు… రామప్ప ఆద్యుడు…
  • నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…
  • తల్లిగర్బంలోనే జ్ఞానబోధ..! ప్రభుత్వ దవాఖానాల్లో ‘గర్భసంస్కార్’..!
  • అతి ‘చిన్న’ జియ్యరుడు..! హిందూ మత సంఘటనకే ఓ పే-ద్ధ ప్రమాదుడు..!!
  • ఆ మంచు గడ్డల్లో … చావుకు ఎదురీదుతూ… బరువులు మోసే కొలువు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions