.
ముదిరాజ్ కులాన్ని బీసీ ఏ గ్రూపులో చేర్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాడు… నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఏం స్పందించాలో, ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది… కక్కలేక, మింగలేక… ఈ మాట అనడానికి కారణం ఏమిటంటే..?
తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను ఏలిన పార్టీ ముదిరాజ్‌లకు ఇచ్చిన ఆ హామీపై చిత్తశుద్ధి కనబరిచింది లేదు… బీసీ కులాల్లో ముదిరాజ్ కులజనాభా అందరికన్నా ఎక్కువ… దాదాపు 7.4 శాతం… అంటే, రాజకీయంగా ఏమాత్రం ఇగ్నోర్ చేయలేని సామాజికవర్గం… (మాదిగ 10.3 శాతం, షేక్ (మైనారిటీ) 7.9 శాతం)… అంటే రాష్ట్రంలో ముదిరాజ్‌లే జనాభాపరంగా మూడో స్థానం అని సర్వేలు చెబుతున్నాయి… (తెలంగాణ సమగ్ర కుల గణన (SEEEPC) సర్వే)…
Ads
కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రయారిటీ తెలుసు, అందుకెే కామారెడ్డి డిక్లరేషన్‌లోనే ముదిరాజ్ కులాన్ని బీసీ ఏ గ్రూపులో చేరుస్తామని హామీ ఇచ్చింది… అంటే మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్… తద్వారా విద్య, ఉపాధి రంగాల్లో ముదిరాజ్‌లకు మంచి ప్రయోజనం లభిస్తుంది… బీసీ ఏ గ్రూపులో చేర్చే విషయంలో ఓ కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం, అది అధ్యయనం చేస్తుందని నిన్న పండగ సాయన్న జయంతి వేడుకల్లో ప్రకటించాడు… అంతేకాదు…
పండుగ సాయన్న జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తాం… దొడ్డి కొమురయ్యతోపాటు సాయన్న విగ్రహాన్ని కూడా నెలకొల్పుతాం… అధికార పదవుల్లో మరింత వాటా కల్పిస్తాం… నాడు జమీందార్లు, జాగీర్దార్లు, రజాకార్లతో పోరాడిన సాయన్నకు ప్రభుత్వపరంగా సముచిత గౌరవాన్ని ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రకటన ఆ కులంలో పాజిటివ్ వైబ్స్ కలిగించింది… (సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుతో గీతకార్మికుల మనోభావాలు సంతృప్తి చెందినట్టుగా…)
అయితే ముదిరాజ్‌లను రాత్రికిరాత్రే బీసీ ఏ గ్రూపులో చేర్చడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డికీ తెలుసు… అందుకే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం… అంతేకాదు, సరైన శాస్త్రీయ అధ్యయనం తరువాత గానీ ఈ గ్రూపు మార్పిడి సాధ్యం కాదు… అందుకే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, సిఫారసు, ప్రభుత్వ నిర్ణయం అనే కార్యాచరణను పరోక్షంగా వెల్లడించాడు…

ఐతే ఇంకొన్ని చిక్కులూ ఉన్నయ్… ప్రధానంగా గంగపుత్రుల నుంచి..! అందుకే ఆ కులసంఘాలతోనూ మాట్లాడి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని ఇద్దరు మంత్రులకు సూచించాడు… తద్వారా కుల అంతర్గత చిక్కులు, లీగల్ చిక్కులను అధిగమించే ప్రయత్నం అన్నమాట… ఇవేకాదు, తాము నిర్వహించిన బీసీ గణనపై ఎవరికైనా సందేహాలుంటే, తగిన వివరాలు ఇవ్వాలని, అవీ కేబినెట్‌లో చర్చిస్తామనీ అన్నాడు…
రాజకీయంగా, సామాజికంగా సున్నితమైన, కీలకమైన ముదిరాజ్ బీసీ ఏ అంశంలో బీఆర్ఎస్ తన రెండు టరమ్స్‌లోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది… ఆ అసంతృప్తి ఆ కులంలో తీవ్రంగానే ఉంది… ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు, హామీలతో ఇక బీఆర్ఎస్ నేతలు తామేం మాట్లాడలేక, మాట్లాడటానికి ఏమీ లేక, ఏమీ చెప్పలేక, స్పందించలేక సైలెంట్ అయిపోయింది..!!
Share this Article