Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీహార్ రాజకీయాల్లో మార్పు..? ఎవరు ఈ సామ్రాట్ చౌదరి..?!

April 14, 2026 by M S R

.

ప్రస్తుతం వినవస్తున్న వార్తల ప్రకారం… తదుపరి బీహార్ ముఖ్యమంత్రి బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి… చాన్నాళ్లుగా అనుకుంటున్నదే… బీహార్‌ రాజకీయాల్లో ఓ కొత్త దశ ప్రారంభం కాబోతోంది… నితిశ్ రాజ్యసభకు ఎంపికై, ముఖ్యమంత్రి పదవి నుంచి, కాసేపటి క్రితమే రాజీనామా చేసి తప్పుకున్నాడు కదా, తన స్థానంలో బీజేపీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పేరును ఖరారు చేసింది బీజేపీ ఇప్పుడే…

మొన్నటి ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం… ఈ ముఖ్యమంత్రి మార్పు..! నితిశ్ నిజానికి వారసత్వ రాజకీయాల్ని దగ్గరకు రానివ్వలేదు, ఇప్పుడు నితిశ్ కొడుకు (ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్… పేరు నిశాంత్ కుమార్…)  కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు…

Ads

మరి నితిశ్ స్థానంలో ఎవరు బీజేపీ సీఎం అవుతారు..? ఇదీకొన్నాళ్లుగా వినిపిస్తున్న ప్రశ్న… అనేక ఊహాగానాలకు బీజేపీ నేడు తెరదించింది… బీజేపీ శాసనసభ పక్ష నేతగా సామ్రాట్ చౌదరిని అధికారికంగా ఎన్నుకున్నారు… తను ప్రస్తుతం బీహార్ హోం మంత్రిగా ఉన్నాడు… రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు… ఇంతకీ ఎవరు ఆయన..? తన రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే… ఓ విశేషం ఉంది…

తను సంఘ్ నుంచి ఎమర్జయిన లీడర్ కాదు… ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ కూడా లేదు… 56 ఏళ్ల సామ్రాట్ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు… అదీ విశేషం కాగా, బీజేపీ ప్రబల ప్రత్యర్థిగా భావించే ఆర్జేడీ నుంచి తన పొలిటికల్ జర్నీ ప్రారంభించడం మరో విశేషం…

  • ప్రారంభం…: 1990లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు…
  • మంత్రిగా తొలి అవకాశం…: 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో అతి చిన్న వయస్సులోనే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు…

 

  • ఎమ్మెల్యేగా…: 2000, 2010లో పర్బత్తా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు…
  • పార్టీ మార్పులు…: 2014లో జేడీయూ (JDU)లో చేరి జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు… 2017లో బీజేపీలో చేరాడు… అంటే కాషాయ శిబిరంలో చేరి తొమ్మిదేళ్లు… అంతే…

 

  • బీజేపీలో ఎదుగుదల…: బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా (2023- 2024), శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు….
  • ప్రస్తుత హోదా…: 2024 జనవరి నుండి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, నవంబర్ 2025 నుండి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు… రేపు ముఖ్యమంత్రి…

కుటుంబ నేపథ్యం…: ఈయన రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు… ఆయన తండ్రి శకుని చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా పనిచేశాడు… తల్లి పార్వతి దేవి కూడా గతంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించింది…

బీహార్‌లో వెనుకబడిన తరగతుల (OBC) కులమైన ‘కోయిరి’ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది…!! నితిశ్ కొడుకును మంత్రివర్గంలోకి తీసుకుంటారా..? వేచి చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీహార్ రాజకీయాల్లో మార్పు..? ఎవరు ఈ సామ్రాట్ చౌదరి..?!
  • తెలంగాణకు కేసీయార్ తీరని చారిత్రక ద్రోహం… ఇవిగో ఆనవాళ్లు…
  • ధో రో కో … ముక్కుతూ మూలుగుతూ… మ్యాచులకు దూరమవుతూ…
  • సినిమా ప్రసార హక్కులు … టీవీ చానల్స్ మధ్య పోటీ …
  • జంధ్యాల హీరోయిన్… సినిమాల్ని పక్కకు తోసేసి, అమెరికా వెళ్లి…
  • ఈ స్వరాల రాణి… రుచుల మహారాణి కూడా…!
  • ప్రభాస్ ఫుడ్ కల్చర్..! పిల్లికి బిచ్చం పెట్టని ఇండస్ట్రీలో రియల్ హీరో..!!
  • బుమ్రాలు కూడా ‘లైన్’ తప్పిన వేళ… కుర్ర బౌలర్లు కుమ్మేస్తున్నారు…
  • రేవంత్ హైబ్రీడ్ మోడల్ కేంద్రం పాటించదగిందే… అదెలాగంటే..?
  • ఆర్ఎస్ఎస్ లింకులు… జడ్జిపై కేజ్రీవాల్ డిఫరెంట్ అటాక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions