.
పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ శైలి మీద వివాదం గురించి నిన్న చెప్పుకున్నాం కదా.,. క్రికెట్ సర్కిళ్లలో, అభిమానుల్లో దీనిపై పెద్ద రచ్చే సాగుతోంది… ఓ స్టోన్ పెల్టర్ తరహాలో తన బౌలింగ్ యాక్షన్ ఉందనేది విమర్శ… బ్యాటర్లు ఇలాంటి బౌలింగును అభ్యంతరపెట్టొచ్చు అనే అభిప్రాయాలూ వినవస్తున్నాయి…
మరీ అంత సీరియస్ విమర్శ కాదు గానీ… నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అనుసరిస్తున్న ఓ బౌలింగ్ శైలి కూడా చర్చలకు తావిస్తోంది… వివరాల్లోకి వెళ్దాం…
Ads
సరే, క్రికెట్ అంటేనే వ్యూహాల ప్రతివ్యూహాల సమ్మేళనం… అయితే వర్తమాన టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన పోరులో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అనుసరించిన ఒక అసాధారణ బౌలింగ్ శైలి ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయ్యింది… క్రీజుకు సుమారు 3- 4 అడుగుల వెనుక నుంచి, దాదాపు అంపైర్ పక్క నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని వదిలిన ఎరాస్మస్, టీమిండియా దిగ్గజ బ్యాటర్లను సైతం అయోమయంలో పడేశాడు…
వివాదం ఎక్కడ మొదలైంది?
మ్యాచ్ 8వ ఓవర్‌లో ఎరాస్మస్ తన వింత యాక్షన్ ప్రారంభించాడు… ఒక బంతిని ఆయన అంపైర్ రాడ్ టక్కర్ వెనుక నుంచి వేయగా, అంపైర్ దానిని ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు… దీనిపై ఎరాస్మస్ అంపైర్‌తో వాదనకు దిగాడు… అంపైర్ వివరణ ప్రకారం.. బౌలర్ అంపైర్ దృష్టికి అడ్డంకిగా మారి, బంతి ప్రయాణాన్ని అంపైర్ సరిగ్గా చూడలేనప్పుడు దానిని డెడ్ బాల్‌గా ఇచ్చే అధికారం అంపైర్‌కు ఉంటుంది… ఆ తర్వాత అంపైర్‌తో చర్చించి తన శైలిని కొనసాగించిన ఎరాస్మస్, టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు..
4 వికెట్లతో భారత్‌కు షాక్!
ఎరాస్మస్ అనుసరించిన ఈ “డెప్త్ మానిప్యులేషన్” వ్యూహం వల్ల భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది…
-
సాధారణంగా బౌలర్ క్రీజు లోపల నుంచి బంతిని వేస్తాడని బ్యాటర్ ఊహిస్తాడు… కానీ ఎరాస్మస్ అంత వెనక నుంచి బంతిని వేయడం వల్ల బంతి గాలిలో ప్రయాణించే సమయం (Trajectory) పెరిగింది…
-
దీనివల్ల తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి కీలక బ్యాటర్లు టైమింగ్ అంచనా వేయలేక వికెట్లు సమర్పించుకున్నారు…
-
మొత్తంగా 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఎరాస్మస్ రికార్డు సృష్టించాడు…

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
నిజానికి, ఐసీసీ లా 24.5 ప్రకారం… బౌలర్ పాపింగ్ క్రీజు దాటి ముందుకు వెళ్తేనే నో బాల్ అవుతుంది కానీ, వెనక్కి ఎంత దూరమైనా వెళ్లి బౌలింగ్ చేయవచ్చు… అయితే, దీనిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి…
-
మంటల్ డిస్ట్రాక్షన్…: బ్యాటర్ దృష్టి మళ్లించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు…
-
బౌలింగ్ యాక్షన్…: ఎరాస్మస్ అంత వెనక నుంచి వేగంగా వేయడానికి తన మోచేయిని (Elbow) 15 డిగ్రీలకంటే ఎక్కువగా వంచుతున్నాడనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు…
ఈ వింత బౌలింగ్ శైలి ప్రస్తుతానికి లీగలే కావొచ్చు, అదొక టాక్టిస్ కావొచ్చు… కానీ భవిష్యత్తులో బ్యాటర్లకు, అంపైర్లకు ఇబ్బంది కలగకుండా ఐసీసీ ఈ నిబంధనలను మరోసారి సమీక్షించే అవకాశం ఉంది…
Share this Article