Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మీడియా ఫ్యామిలీ’ అనగానేమి..? మంగ్లి జర్నలిస్టా..? సినీ సెలబ్రిటీయా..?

April 13, 2026 by M S R

.

హేమిటో ఈమె… అదేనండీ మంగ్లీ… చేసేవన్నీ చేస్తుంటుంది… రాస్తే మీడియా మీద రుసరుసలాడుతుంది… అన్నీ చెక్ చేసి రాయండి అని దబాయిస్తుంది… అదేమంటే తను కూడా మీడియా ఫ్యామిలీ అంటుంది… నిన్న కోట్ల అక్రమ వసూళ్లకు సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో ఓ కేసు నమోదైంది కదా… అది తప్పు అంటుంది, తెలుసుకుని రాయాలి కదాని ప్రెస్‌మీట్‌లో మీడియాను నిందించే పనికి పూనుకుంది… తప్పు…

ఈ పర్టిక్యులర్ కేసు గురించే చూద్దాం… ఓ లాయర్ తనను చంపేస్తామని బెదిరించారని మంగ్లీ మీద, ఆమె తమ్ముడి మీద ఫిర్యాదు చేశాడు… ఆ అక్రమ వసూళ్ల కథేమిటో వదిలేస్తే… ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది… నో, నో, నన్నే బెదిరించాడు అని మంగ్లి మీద ఫిర్యాదు చేసింది పోలీసులకు, అది మరో కేసు నమోదైనట్టుంది…

Ads

ఈ రెండు వార్తలూ కవర్ చేసింది మీడియా గానీ, సోషల్ మీడియా గానీ..! ఎవరూ ఆమె మీద ఉద్దేశపూర్వకంగా ఏమీ రాయలేదు… అవి పోలీస్ కేసులు, నిజానిజాలు తేల్చాల్సింది మీడియా పని కాదు… పోలీసులు తేలుస్తారు, లేదా కోర్టులో తేలుతుంది… నేను మీడియా ఫ్యామిలీ అంటోంది… గతంలో కూడా ఆమె ఫీల్డ్ జర్నలిస్టేమీ కాదు, కొన్నాళ్లు వీ6లో పనిచేసింది… ప్రధానంగా ఓ ఆర్టిస్ట్… తరువాత యూట్యూబ్ ఫ్యామిలీ… సింగింగ్ ప్రొఫెషన్, తరువాత సినిమా ఫ్యామిలీ…

అన్నింటికీ మించి సినిమా సెలబ్రిటీగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే… వాళ్ల ప్రభావం సొసైటీ మీద ఉంటుంది కాబట్టి, రీడర్‌షిప్ ఎక్కువ కాబట్టి మీడియా ఫోకస్ ఉంటుంది… కేడీ, ది డెవిల్ రోత పాట దగ్గర నుంచి మంగ్లీ అనేక వివాదాల్లో ఉంది… అవే రాసింది మీడియా… పనిగట్టుకుని, కావాలని ఆమెను డీఫేమ్ చేయాలని ఎవరూ ఏమీ రాయలేదు… ఆస్కారమిస్తున్నది ఆమే…

సేమ్, దర్శకుడు వేణు ఊడుగుల… నాపేరు ఎఫ్ఐఆర్‌లో లేదు, అకారణంగా నా పేరు రాశారని బాధపడ్డాడు… కానీ ఈ వివాదంలో తను ఎవరినైనా బెదిరించాడా లేదా తెలియదు గానీ, వివాదంలో మాత్రం ఉన్నాడు… ఎఫ్ఐఆర్‌లో తను నేరం చేసినట్టు రాశారా లేదా తెలియదు గానీ, తన పేరు కూడా కేసు వివరణలో ఉంది… ఏమైనా సెక్షన్లు పెట్టారా లేదా పోలీసులే చెప్పాలి…

కానీ ఈ మొత్తం కేసుకు సంబంధించి ఇరుపక్షాలూ కేసులు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి తమ వెర్షన్ చెప్పుకుంటున్నాయి, మీడియా అదే రాస్తోంది… పోలీసులు మాత్రం సైలెంట్… మరిక మీడియాను దేనికి నిందించడం..!!

నాకు గత ఎన్నికల సమయంలో కోట్లకుకోట్లు ఇస్తామన్నా పాడలేదు, నాకు డబ్బు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం అంటున్నది ఓసారి… అంటే పార్టీలకు పాటలు పాడితే వ్యక్తిత్వం లేనట్టేనా..? పైగా శ్రీముఖి అంటే క్రష్ అట, అతను బిగ్‌బాస్ కోసం వెళ్లడానికి ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నాడు అని మరోసారి అంటున్నది… ఓహ్, ఇలా ఫేమ్ అయితేనే బిగ్‌బాస్‌లోకి వెళ్తారా..? సెలబ్రిటీలందరినీ ఇలాగే సతాయిస్తుంటాడు అట… మరి అలాంటోడు 10 లక్షలు డిమాండ్ చేశాడని మల్లీ తనే చెబుతోంది… అంతా సెల్ప్ కంట్రడిక్షన్…

పైగా నాకు ఏ ప్రమేయం లేకపోతే మీరు సుబ్బారావును ఏం చేస్తారు అనడుగుతోంది… సుబ్బరావునైనా, మంగ్లీనైనా మీడియా ఏం చేస్తుంది..? ఎందుకు చేయాలి..? కేసులు, వివాదాల పాలయితే జనానికి చెబుతుంది మీడియా, అంతే… అదేమీ దర్యాప్తు సంస్థ కాదు, శిక్షలు వేసే కోర్టు కాదు…

రేప్పొద్దున మరో ఇంట్రస్టింగ్ కేసు దొరికితే మీడియా ఇక దానిమీద పడుతుంది… మంగ్లీ కేసు పట్టించుకోదు… సహజం…!! మంగ్లీ కేసులో బయటపడ్డ నోట్ల కట్టలు అంటూ సోషల్ మీడియాలో కనిపించిన వీడియోలు చూసి మంగ్లి బాధపడి ఉంటుంది బహుశా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కొలువు – కొడుకును అమెరికాలో చదివించడం ఏమంత కష్టం?
  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions