Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంచు అల్లుడు గారు… కామెడీ విలన్ నుంచి ‘మంచి’ పాత్రల్లోకి…

February 10, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మళయాళంలో బ్లాక్ బస్టరయిన చిత్రం సినిమాకు రీమేక్ 1990 లో వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ అల్లుడు గారు . మళయాళంలో మోహన్ లాల్ , రంజని , లిజీ , నెడుమూడి వేణు , ప్రభృతులు నటించారు . మన తెలుగులో మోహన్ బాబు , శోభన హిట్ పెయిర్లో వచ్చింది .

మోహన్ బాబే నిర్మాత . ఆయన అదృష్టవంతుడు కాబట్టి సినిమా శుభాంతం కాకపోయినా సూపర్ హిట్టయింది .‌ Of course . ముగింపు శుభాంతం కాకపోయినా సినిమా అంతా హుషారు హుషారుగా సాగుతుంది . మోహన్ బాబు శోభన , మోహన్ బాబు రమ్యకృష్ణ జోడీలు చాలా అందంగా ఉంటాయి . రాఘవేంద్రరావు దర్శకుడు కాబట్టి ఆయన మార్కులో డ్యూయెట్లు ఉన్నాయి .

Ads

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో మంచి సాహిత్యంతో శ్రావ్యమైన పాటలు ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి . ముద్దబంతి నవ్వులో మూగ భాషలు సూపర్ డూపర్ హిట్ సాంగ్ . ఈ పాటకే జేసుదాసుకు నంది అవార్డు కూడా వచ్చింది . ఈ పాట వ్రాసింది ఆత్రేయ శిష్యుడు గురుచరణ్ . ఎక్కువగా మోహన్ బాబు సినిమాలకే పాటల్ని వ్రాసారు .

అన్నమయ్య , త్యాగయ్య కీర్తనలను చాలా గొప్పగా ఉపయోగించుకున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు . కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కీర్తనలో సినిమాకు అనుగుణంగా మరి కొంత మసాలాని మిక్స్ చేసి గొప్పగా చిత్రీకరించారు రాఘవేంద్రరావు .‌

అలాగే నగుమోము గనలేని నా జాలి తెలిసి అనే త్యాగరాజు కీర్తనను కూడా . ఇంక మోహన్ బాబు , శోభన మీద డ్యూయెట్లు రాఘవేంద్రరావు ఫక్తు చిత్రీకరణ చూడొచ్చు . ముఖ్యంగా కొండ మీద సుక్కపోటు పాట .
శోభన , రమ్యకృష్ణ ఇద్దరూ స్వతహాగా మంచి నర్తకీమణులు కావటంతో నృత్యాలన్నీ బాగుంటాయి .

జాలాది , జొన్నవిత్తుల , గురుచరణ్ , రసరాజు మంచి పాటల్ని అందించారు . జేసుదాస్ , బాలసుబ్రమణ్యం , చిత్ర , పూర్ణచందర్ శ్రావ్యంగా పాడారు . సినిమా విజయానికి సత్యానంద్ సంభాషణలు బ్రహ్మాండంగా ఉపకరించాయి . ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో డైలాగులు  బాగుంటాయి . సినిమాలో చాలా ఎమోషనల్ సీన్లు ఉంటాయి .

ఎమోషనల్ సీన్లలో మోహన్ బాబు  గొప్పగా నటించారు . కామెడీ విలనుగా నటించటానికి అలవాటు పడ్డ మోహన్ బాబు ఈ సినిమాలో కామెడీ + ట్రాజెడీ హీరోగా అల్లరి సీన్లలో , ఎమోషనల్ సీన్లలో బాగా నటించారు . అభినందనీయుడు .

ఇతర ప్రధాన పాత్రల్లో ముందుగా చెప్పుకోవలసింది చంద్రమోహన్ , సత్యనారాయణలు . వెటరన్స్ కదా ! గొప్పగా పండించారు . ఇతర పాత్రల్లో జగ్గయ్య , గొల్లపూడి , సుధాకర్ , సారధి , తమిళ నటుడు నిళల్గల్ రవి , తదితరులు నటించారు .

కధ చెప్పాల్సిన అవసరం లేదు . బహుశా చూడని వారు ఉండరనే అనుకుంటాను . టూకీగా : మోహన్ బాబుని అల్లుడిగా అద్దెకు తెచ్చుకుంటారు చంద్రమోహన్ , శోభన . ముందు ద్వేషించినా తర్వాత తర్వాత ప్రేమలో పడుతుంది శోభన .

ఆ సమయంలో తెలుస్తుంది మోహన్ బాబు ఫ్లాష్ బేక్ . పొరపాటున భార్యనే హత్య చేసి ఉరిశిక్షను అనుభవించపోతున్న వ్యక్తి అని . మోహన్ బాబు మూగ కొడుకు సంరక్షణ వహిస్తానని మాట ఇస్తుంది . మోహన్ బాబుని జైలర్ సత్యనారాయణ తీసుకుని పోవటంతో సినిమా ముగుస్తుంది .

చాలామంది ప్రేక్షకులు ముగింపు మరోలా అంటే ఉరిశిక్ష ఏ ఏడేళ్ళో , నాలుగేళ్ళో శిక్షగా మారి శోభనను జీవిత భాగస్వామిగా చేసుకుని ఉంటే బాగుండేదని అనుకునే వారు .

ఈ అందమైన సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉన్నా మరలా మరలా చూడవచ్చు . ముఖ్యంగా పాటల సీన్లు . Another feather in the caps of Raghavendra Rao and Mohan Babu . నేను పరిచయం చేస్తున్న 1234 వ సినిమా . ఫేన్సీ నంబర్ కదా ! #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ట్రెండ్ సెట్టర్ కవి వైరముత్తు… అందుకే వరించిన జ్ఞానపీఠ్…
  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”
  • మన్ పిశాచ్… ఐఫోన్, 33 వేల ఖర్చు, ఒకేరోజు షూట్… సినిమా కంప్లీట్…
  • ఏక్‌సేఏక్… దొందూ దొందే… బంగ్లా, పాక్ క్రికెటర్ల ‘చీప్ యాక్షన్’…
  • మూసీపై ఆ ముగ్గురు పాత సీఎంలు చేతులెత్తేసిన విధంబెట్టిదనిన..!!
  • టైటిల్‌లో అగ్ని ఉంటే చాలు… ఆ సినిమా మండిపోయి మసి..!
  • అమెరికా- ఇజ్రాయిల్ ప్లాన్లు ఎక్కడ బెడిసికొట్టాయి..? నెతన్యాహూ సేఫేనా..?
  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions