.
రెండు హైప్రొఫైల్ కేసులు… ఒకటేమో టీవీ సెలబ్రిటీ ఆషురెడ్డి కేసు… పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 10 కోట్ల దాకా బంగారం, ప్రాపర్టీస్ కొనుగోలు చేయించి, తీరా ఏం జరిగిందో ఏమో గానీ… నువ్వు అక్కర్లేదుపో అని మొహం చాటేసింది ఓ లండన్ సాఫ్ట్‌వేర్‌ను… మరి ఆ 5 కిలోల బంగారం, ఇతర గిఫ్టుల మాటేమిటి..? చివరకు సీసీఎస్ పోలీసులు ఏం తేలుస్తారో తెలియదు గానీ… గోడకు వేసిన సున్నమే…
పూర్తిగా కంట్రాస్టు కేసు మరొకటి… ఇది టీడీపీ నేత, నోవా విద్యా సంస్థలకు చెందిన ముత్తంశెట్టి కృష్ణారావు కుమార్తె వివాహానికి సంబంధించింది… దివీస్ లేబరేటరీలో మాంచి ఉద్యోగంలో ఉన్నాడని చెప్పారట, దాంతో పెండ్యాల సుధాకర్ కొడుకు అక్షయ్ కుమార్‌తో పెళ్లి నిశ్చయమైంది… భారీగా నిశ్చితార్థం కూడా జరిగింది…
Ads
ఇక్కడి వరకూ వోకే… పెళ్లికి ముందే ఓ బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన వాచీలు, కోటి రూపాయల నగదు కట్నం అడ్వాన్సుగా ఇచ్చారట… అంటే, అసలు కట్నం ఎంత మాట్లాడుకున్నారో… తీరా ఏం జరిగిందో గానీ పెళ్లి కేన్సిల్… కట్నం అడ్వాన్సులు మాత్రమే కాదు, అబ్బాయి ఉద్యోగం గురించి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారు కాబట్టి నిశ్చితార్థం ఖర్చులు కూడా ఇవ్వాలని అమ్మాయి తరఫు డిమాండ్..,
అసలు మాకు కట్నమే అవసరం లేదన్నారనీ, కానీ ఇంకా ఇంకా కోరికలు పెరిగిపోయాయని వీళ్ల ఆరోపణ… అంతేెకాదు, అమ్మాయి తరఫున 70 మంది వరకూ అబ్బాయి ఇంటి మీదకు దాడికి వెళ్లి నిలదీశారు… ఆ గ్రూపుకి నేతృత్వం ఎవరంటే… ఆర్టీఐ మాజీ కమిషనర్, అమ్మాయి తల్లి విజయనిర్మల…
(ఫైల్ ఫోటో, గూగుల్ సౌజన్యం)
తమ ఇంటి మీద దాడి చేసినట్టు… గేట్లు, ఫర్నీచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్టు అబ్బాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు… ఒకటి వరకట్న నిషేధ చట్టం, మరొకటి దాడి… రెండు కేసులూ నమోదైనట్టున్నాయి… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? అబ్బాయి వాళ్లు కట్నం వద్దన్నారని మీరే చెబుతున్నారు కదా, మరి బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన గిఫ్టులు, వాచీలు ఇస్తున్నప్పుడు అదీ కట్నమేనని గుర్తుకురాలేదా..? పైగా నిశ్చితార్థం ఖర్చులు అబ్బాయి వాళ్లు ఎందుకు భరిస్తారు..?
టీడీపీ నేత కాబట్టి, పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి మెయిన్ పేజీల్లో కనిపించింది వార్త… లేకపోతే క్రైం కార్నర్‌లో కనీకనిపించనట్టు వేసేవి పత్రికలు… ఇక్కడ రెండు కేసుల గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే… రెండూ కంట్రాస్టు కేసులు… ఒక దాంట్లో అమ్మాయి అబ్బాయి నుంచి 10 కోట్లు కన్యాశుల్కం (?) లేదా రివర్స్ కట్నం గుంజడం, పెళ్లికి ముందు, తరువాత ఎహెఫో అనేయడం… మరో దాంట్లో అబ్బాయికి కట్నకానుకలొద్దు అంటూనే ఏక్‌సేఏక్ ఖరీదైన అడ్వాన్స్ కట్నం అలియాస్ కానుకలు సమర్పించుకోవడం, అదీ పెటాకులు కావడం..!!
Share this Article