.
రిషబ్ vs శెట్టి గ్యాంగ్: రష్మికకు ఇది డబుల్ ధమాకా? ఒకప్పుడు ఆమెను ‘టార్గెట్’ చేసిన శెట్టి గ్యాంగ్‌లో ఇప్పుడు ఒకరినొకరు ‘అన్‌ఫాలో’ చేసుకుంటున్నారు… కన్నడ చిత్ర పరిశ్రమలో ‘శెట్టి గ్యాంగ్’ మధ్య మొదలైన ఈ చిచ్చు, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు తెలియని ఉపశమనాన్ని, ఒక రకమైన ‘స్వీట్ రివెంజ్’ ఫీలింగ్‌ను ఇస్తోందనడంలో సందేహం లేదు…
ఆమెను వెలివేసిన వారే… ఇప్పుడు విడిపోతున్నారు! ‘కాంతార’ సమయంలో రష్మికపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు… రిషబ్ శెట్టి అప్పట్లో చేసిన ఒక చిన్న సైగ (థియేటర్ల గురించి మాట్లాడుతూ వేళ్లతో చూపిన తీరు) రష్మికను కన్నడ పరిశ్రమలో విలన్‌గా నిలబెట్టింది… రక్షిత్ శెట్టితో బ్రేకప్, ఆపై రిషబ్ గ్యాంగ్ ఆమెను దూరం పెట్టడం… వెరసి రష్మికకు శాండల్‌వుడ్ ఒక చేదు జ్ఞాపకంగా మారింది… కానీ, కాలం చక్రం తిరిగింది… సీన్ రివర్స్…
Ads
-
అప్పుడు…: రిషబ్, రక్షిత్, రాజ్ బి శెట్టి… ముగ్గురూ కలిసి రష్మికను విమర్శిస్తూ ‘కన్నడ అస్తిత్వం’ గురించి మాట్లాడేవారు… ఆమెను టార్గెట్ చేసేవాళ్లు… ఒకరకంగా ఆమెను శాండల్ వుడ్ నుంచి బయటికి తోసేశారు… కానీ కాలం ఆమె పట్ల సానుకూలంగా ఉంది… ఎదిగింది… ఆ శెట్టి గ్యాంగ్ కుళ్లుకునేలా, రీసెంటుగా పెళ్లి చేసుకుంది…
-
ఇప్పుడు….: అదే రిషబ్ శెట్టి ఇప్పుడు తన ‘శెట్టి గ్యాంగ్’ మిత్రుడు రాజ్ బి శెట్టిని, ఆత్మీయురాలైన రుక్మిణి వసంత్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేస్తూ షాక్ ఇచ్చాడు… (కాంతార-1 ఫేమ్)…
హోంబలేతో విభేదాలు… ఆమెకు మరో ప్లస్! రష్మికను లైట్ తీసుకున్న హోంబలే ఫిల్మ్స్‌తో కూడా రిషబ్‌కు ఇప్పుడు పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి… రిషబ్ ఆ సంస్థ అధికారిక ఖాతాను అన్‌ఫాలో చేయడం చూస్తుంటే, అక్కడ ‘ఈగో’ క్లాష్ మొదలైందని స్పష్టమవుతోంది… ఒకప్పుడు తనను పక్కన పెట్టిన వ్యవస్థలన్నీ ఇప్పుడు అంతర్గత పోరుతో సతమతమవ్వడం రష్మికకు కచ్చితంగా కలిసొచ్చే అంశమే… లోలోపల ఖుషీ ఈ నేషనల్ క్రష్…

వ్యక్తిగత జీవితంలో టాప్.. వృత్తిగతంగా డబుల్ హ్యాపీ! రష్మిక ఇప్పుడు కేవలం ఒక నటి మాత్రమే కాదు, మెగా పవర్ హౌస్… ఇటీవల ఆమె తన చిరకాల మిత్రుడు, నటుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది… ఈ పెళ్లితో ఆమె వ్యక్తిగత జీవితం స్థిరపడింది… పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాలతో దూసుకుపోతోంది…
ముగింపు: ‘కర్మ’ ఈజ్ ఏ బూమరాంగ్? ఒకప్పుడు తనను హేళన చేసిన వారు, గ్రూపులుగా విడిపోయారు… తనను టార్గెట్ చేసి విమర్శించిన వారు… ఇప్పుడు గ్రూపులుగా విచ్ఛిన్నం అవ్వడం చూస్తుంటే రష్మికకు ఇది ‘డబుల్ హ్యాపీ’ న్యూసే… అటు వివాహ బంధంతో సంతోషంగా ఉంటూ, ఇటు తన ‘బద్ధ ప్రత్యర్థులు’ తమలో తాము కొట్టుకోవడం చూస్తుంటే, కన్నడ మీడియాలో ఒకటే టాక్: “కర్మ ఎవరికి ఎప్పుడు ఎలా తిరిగి వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది!”

Share this Article