.
ప్రేరణ కంభం … చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు… ఒక టీవీ సెలబ్రిటీ ఆమె… తెలుగు టీవీ సీరియళ్లు చూసేవాళ్లకు కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌లో నటించిన ఈమె తెలుసు… అలాగే బిగ్‌బాస్ షో చూసే ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయమే… ఓ తెలుగు సీజన్‌లో టాప్ ఫోర్‌లో నిలిచిన ఫైనలిస్టు… ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..? ఐడెంటిటీ గురించిన చర్చ…
నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అని రాస్తుంటే… అదేమిటి..? ఆయనకంటూ ఓ ఐడెంటిటీ లేదా అనే చర్చ, ప్రశ్న ఉత్పన్నమవుతోంది కదా… ఇదీ అలాంటిదే… పాపం, ప్రేరణ అనగానే రష్మిక మందన్నా క్లోజ్ ఫ్రెండ్ ప్రేరణ అని రాస్తున్నారు… అంటే, తనకు రష్మిక మందన్నా స్నేహితురాలు అని తప్ప వేరే ఐడెంటిటీయే లేదానేది ఈమె చిరాకు…
Ads
ఏదో ఇంటర్వ్యూలో చెబుతోంది… ‘నాకెప్పుడూ పదే పదే రష్మిక స్నేహితురాలిని అని చెప్పుకోవడానికి ఇష్టముండదు… బిగ్‌బాస్ సమయంలో నాగార్జున ప్రస్తావించాడు, తరువాత సూర్య… నేను నేనే… అఫ్‌కోర్స్, రష్మిక నా ఫ్రెండే…’
అవును, ఎవరైనా ఫ్రెండ్ టాప్ ప్లేసులోకి వెళ్లిపోతే… తను నా ఫ్రెండే అని పదే పదే చెబుతూ ఓ ఆర్టిఫిషియల్ పాపులారిటీకి ప్రయత్నిస్తారు చాలామంది… దాంతో పోలిస్తే ప్రేరణ మాటలు డిఫరెంట్… కరెక్టు కూడా… తనకంటూ ఓ ఐడెంటిటీ ఉంది కదా… రష్మిక ఫ్రెండ్ తప్ప మరేమీ కాదా తను..?

నిజమే… రష్మిక, ప్రేరణ ఒకే రూమ్‌లో ఉంటూ… తినీతినక అవకాశాల కోసం బెంగుళూరు వీథుల్లో తిరిగిన రోజులున్నాయి… కలిసి ఆడిషన్లకూ వెళ్లిన రోజులూ ఉన్నాయి… కానీ ఎవరి డెస్టినీ వాళ్లది… రష్మిక అలా అలా ఎదిగిపోయింది… కిరిక్ పార్టీ అనే సినిమా చాన్స్ దొరికి, ఇప్పుడు ఏకంగా నేషనల్ క్రష్… తెలంగాణ కోడలు అయ్యింది… హైదరాబాద్ చేరింది…
కానీ ప్రేరణ..? తనది బేసిక్‌గా హైదరాబాద్… కానీ కెరీర్ ఎక్కడికక్కడే ఆగిపోయింది… సరైన అవకాశాలు దొరకలేదు… అడపాదడపా టీవీ సీరియళ్లు తప్ప… ఆమెకు రాసిపెట్టి ఉంది అంత మాత్రమే… ఓసారి ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఒకవేళ ఈ షో ద్వారా రష్మికకు ఏదైనా చెప్పాలని ఉందా అని… ‘ఓసారి కాల్ చేయరా’ అని చెబుతాను అని జవాబిచ్చింది ప్రేరణ, అంతే…
ఈమధ్య చాలామంది మళ్లీ అలాగే రాసుకొచ్చారు రష్మిక బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ అంటూ… సందర్భం ఏమిటయ్యా అంటే..? మూడేళ్ల క్రితం తను పెళ్లి చేసుకుంది… రీసెంటుగా సీమంతం చేసుకుని, ఆ ఫోటోల్ని తన సోషల్ ఖాతాలో షేర్ చేసుకుంది… రణబాలిలో జయమ్మ పాత్ర పోషించిన రష్మిక ఎలాగైతే సీమంతం జరుపుకుందో అచ్చం అలాగే, అదే ప్యాటర్న్‌లో సీమంతం జరుపుకుంది…
ఆ వార్తలు రాస్తూ రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనే రాశారు చాలామంది… వద్దూవద్దనుకున్నా సరే, రష్మిక తమ పాత స్నేహాన్ని పట్టించుకోకపోయినా సరే, ఏదోరకంగా రష్మిక నీడ ప్రేరణ మీద కనిపిస్తూనే ఉంది..!! జయమ్మ తరహా సీమంతం తాజా ఉదాహరణ అన్నమాట..!!
Share this Article