Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…

March 3, 2026 by M S R

.

రష్మీ గౌతమ్…! ఓ చిన్న నటి, టీవీల్లో కూడా ఈటీవీకే కమిటైన ఆర్టిస్టు… అడపాదడపా సినిమాల్లో చాన్సులొస్తే సరి, లేకపోయినా పర్లేదు… ప్రధానంగా సుడిగాలి సుధీర్‌తో ఆమె ప్రేమాయణంతో, బుల్లితెర స్టార్ హీరోయిన్ ఆమె… ఒడిశా, తెలుగు ఈరోజుకూ సరిగ్గా పలకలేదు, కానీ తెలుగుజనం ఆమెను ఓన్ చేసుకున్నారు… అయితే..?

నిన్నటి నుంచీ ఒకటే హడావుడి… ఆమెకు వ్యతిరేకంగా, ఆమెకు సానుకూలంగా… ఎందుకు..? నిన్న ఉదయం నుంచీ ఆమె కొన్ని పోస్టులు పెడుతోంది… ఇరాన్ ఖమేనీ మరణంపై గుండెలు బాదుకుంటున్న వారిపై స్ట్రెయిటుగా స్పందిస్తోంది…

Ads

సరే, ఆమె అభిప్రాయాలతో మనం ఏకీభవించాలనేమీ లేదు, వ్యతిరేకించాలనీ లేదు… కానీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తోపులకే వర్తమాన వ్యవహరాలపై నోరు పెగలదు… మెదళ్లలో డొల్ల, ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అని భయం, జడుపు, వణుకు… తెల్లారిలేస్తే టీవీ డిబేట్లలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో భయంభయంగా ఏవేవో మాట్లాడే, రాసే సోకాల్డ్ మేధావులతో పోలిస్తే… ఆఫ్టరాల్ ఒక సెమీ సినిమా, ఒక సెమీ టీవీ ఆర్టిస్టుగా తీసిపారేయబడే ఆమె ధైర్యంగా మాట్లాడుతోంది… అదీ విశేషం…

ఓ ప్రకాష్ రాజ్‌లా ఆమె యాంటీ- నేషన్,  కూడా కాదు… వోకే, తనతో పోలిక ఎందుకులే గానీ… మొన్న వీథి కుక్కల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు మీద కూడా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌‌తో కలిసి ప్రెస్ మీట్ పెట్టింది… వ్యతిరేకించింది… తన గళం ధైర్యంగా విప్పింది…

చిల్లరచిల్లరగా తిరుమలలో రీల్స్ చేస్తూ… గుళ్లల్లో డాన్స్ వీడియోలు చేస్తూ… పైగా దబాయిస్తూ బతికే ఒక గీతూ రాయల్, ఒక ప్రియాంక జైన్, ఒక మంగ్లీ, ఒక మధుప్రియ ఎట్సెట్రా కేరక్టర్లతో పోల్చండి ఒకసారి రష్మీ గౌతమ్‌ను…

rashmi

https://x.com/rashmigautam27    ఇరాన్‌ సంక్షోభంపై రష్మీ గౌతమ్ గత కొన్ని గంటలుగా… ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, దానికి సంబంధించి భారత్‌లో జరుగుతున్న కొన్ని నిరసనలపై చాలా ఘాటుగా స్పందిస్తున్నది… ఆమె ప్రధాన ఉద్దేశ్యం ఇరాన్ వంటి దేశాల్లో ఉన్న “నిరంకుశ పాలన” (Dictatorship), అక్కడ మహిళల హక్కుల హరణను ఎత్తిచూపడం…

రష్మి

ఆమె చేసిన పోస్టుల సారాంశం ఇదే… ఇరాన్ నిరసనలపై ప్రశ్న…: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం లేదా అక్కడ జరుగుతున్న దాడులకు నిరసనగా భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో (ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల) నల్ల జెండాలతో ర్యాలీలు తీయడాన్ని ఆమె తప్పుబట్టింది… “మన దేశంలో ఉంటూ మరో దేశంలోని నిరంకుశ పాలకుల కోసం ఎందుకు ఏడుస్తున్నారు?” అన్నది ఆమె ప్రశ్న…

sudheer

మహిళల స్వేచ్ఛ…: ఇరాన్‌లో మహిళలకు కనీస స్వేచ్ఛ ఉండదని, చిన్న పిల్లలపై అరాచకాలు జరుగుతాయని, అలాంటి వ్యవస్థ ఉన్న దేశానికి ఇక్కడ మద్దతు తెలపడం ఏంటని ఆమె నిలదీస్తోంది… “మీకు ఇరాన్ లాంటి పాలన కావాలా? అక్కడ మహిళలకు స్వేచ్ఛ ఉండదు, మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం మీకు వద్దన్నట్లుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?” అని చాలా ఆవేశంగా ట్వీట్ చేసింది…

rashmi

పోస్ట్‌లు ఎందుకు కనిపించడం లేదు?…: ఆమె చేసిన కొన్ని ట్వీట్లు చాలా వివాదాస్పదంగా మారడం, నెటిజన్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్, రిపోర్టింగ్ జరగడంతో కొన్ని పోస్ట్‌లు “Unavailable” అని చూపిస్తున్నాయి… అలాగే, తీవ్రమైన వాదనల మధ్య ఆమె కొన్నింటిని డిలీట్ చేసి ఉండవచ్చు లేదా ఎక్స్ (X) సంస్థ వాటిని నిలిపివేసి ఉండవచ్చు…

rashmi

ఎస్, ఆమెతో అందరూ ఏకీభించాలని ఏమీ లేదు... కానీ ఆమె బతుకుతున్న అత్యంత వివక్షాపూరిత, డొల్ల ఫాల్స్ ఇమేజీలు, ఫేక్ స్టార్‌డంల వాతావరణంలో... తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలిగే సాహసం ఎందరికి ఉంది..? సుధీర్, నువ్వు లక్కీ..!!

“అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు… కానీ మాట్లాడే ధైర్యాన్ని మాత్రం గౌరవించాలి…”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తమ్మినేనికి అభిశంసన..! సీపీఎం కేంద్ర కమిటీ మండిపాటు..?!
  • ఆ రష్మిక మంధన్నా గురించే కాదు… ఈ రష్మి గౌతమ్ గురించీ ఓసారి చెప్పుకోవాలి…
  • విజయ శాంతిని ఏకంగా ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్‌ను చేసింది..!
  • రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!
  • డెడ్లీ మొసాద్- ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తుపోయే ఆపరేషన్లు…
  • రోబోటిక్ గన్… బ్లో టార్చ్‌లు… నమ్మలేని మొసాద్ ఇరాన్ ఆపరేషన్లు…
  • ఖమేనీ ఉన్నచోటు అంత కచ్చితంగా ఎలా తెలిసింది ఇజ్రాయిల్‌కు..?!
  • మూఢ నమ్మకం మెదడుకెక్కితే… జరిగేది ఇదుగో ఇలాంటి అనర్థాలే…
  • అనాలోచిత వ్యాఖ్యలతో… తనంతతానే పలుచన అవుతున్న హరీషుడు…
  • రేపు చంద్రగ్రహణం- దీనికి ఓ విశిష్టత… ఇవీ జాగ్రత్తలు- పరిహారాలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions