.
Subramanyam Dogiparthi …. చిరంజీవి , అమల హీరోహీరోయిన్లుగా నటించిన ఏకైక సినిమా 1990 లో వచ్చిన ఈ రాజా విక్రమార్క సినిమా . 1988 లో వచ్చిన Coming to America అనే హాస్యభరిత వినోదాత్మక సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా వచ్చింది . సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి , జయప్రద , సుమలత నటించిన వేట సినిమా గుర్తుకొస్తుంది .
వేట పూర్తిగా ఏక్షన్ , సీరియస్ మూవీ . అయితే ఈ రాజా విక్రమార్క సినిమా ఎక్కువగా కామెడీ , రొమాంటిక్ , మ్యూజికల్ సినిమా . తర్వాత ఏక్షన్ . చిరంజీవి ఉన్నాక ఏక్షన్ సీన్లు , ఫైట్లు , డాన్సులు , గట్రా లేకపోతే ఎలా ?! అన్నీ మస్తుగా ఉన్నాయి .
Ads
కాస్త విఠలాచార్య , యన్టీఆర్ అగ్గిబరాటా , కాస్త మళ్ళా వాళ్ళిద్దరిదే బందిపోటు , కాస్త చిరంజీవి వేట అన్నీ గుర్తుకొస్తాయి . ఇవన్నీ గుర్తుకొచ్చినా సినిమా గుర్తుంటానికి ముఖ్య కారకుడు ప్రభుదేవా . అధికారికంగా అతను నృత్య దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది .
నాగినివో భోగినివో కామకళా యోగినివో వెన్నెలకే విభావనివో జాబిలికి సహోదరివో . వేటూరి వారి ఈ పాటకు ఖైదీ సినిమాలోని పాము డాన్స్ లాగా చాలా బాగా వచ్చింది . రాజ్- కోటి లకు 100 వ సినిమా . మరెందుకనో ఖైదీ సినిమాలోని రగులుతుంది పాట ట్యూన్ గుర్తొచ్చేలా ట్యూన్ కట్టారు ఈ పాటకు అక్కడక్కడా . అయిననూ చిరంజీవి , అమలలు నృత్యించిన ఈ పాట సినిమాకు హైలెటే .
క్లైమాక్సులో యన్టీఆర్ బందిపోటు సినిమాలో లాగా ఓ మెగా ట్రూప్ డాన్స్ , అట్టహాసాలతో విలన్లను తుదముట్టించటానికి ముందు భళా చాంగు భళా యహో మహరాజు కళా పాట కూడా బాగుంటుంది . మరో హిట్ సాంగ్ గగన కిరణ గమనమిది అంటూ సాగే పాటలో 1+2 కలిసి ప్రేక్షకులను మురిపిస్తారు .
రాధిక చిరంజీవి డ్యూయెట్ ఆనాటి నుండి ఈనాటి వరకు నీమీద నాకు కన్నయ్యో చాలా బాగా కంపోజ్ చేసారు . అయితే రాధిక కాస్త గుండ్రాయిలాగా కనిపిస్తుంది . అయినా చిరంజీవికి దీటుగానే డాన్సించింది . కొండా కోన తాంబూలాలే ఇచ్చే వేళ కోకిలమ్మ పేరంటాలే వచ్చేనమ్మా డ్యూయెట్ చిరంజీవి , అమల మీద అందంగా చిత్రీకరించబడింది .
ఏరరోయ్ సూర్యుడ్ని జాబిల్లి వాటేసుకుంది ఏరరోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసింది తాగి పాడే పాట చిరంజీవి మీద ఉంటుంది . వేటూరి లిరిక్సు మెచ్చుకోక తప్పదు . Of course . అన్నీ ఆయనే వ్రాసారు . అన్నీ హిట్టయ్యాయి కూడా . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర , రాధిక శ్రావ్యంగా పాడి పాటల్ని హిట్ చేసారు .
రవిరాజా పినిశెట్టి , సత్యానంద్ ఇరువురు కలిసి నేసిన కధను ట్రిం చేసుకుని ఉండాల్సింది . డైలాగులను సత్యానంద్ ఒక్కరే వ్రాసారు . రిచ్ గా తీయబడిన ఈ సినిమాకు తొలి క్లాప్ రజనీకాంత్ కొట్టారు బెంగుళూరులో . ఈ సినిమా హిందీ , తమిళ భాషల్లోకి డబ్ చేయబడింది .
1+2 అయిన ఈ సినిమాలో చివర్లో రాధికను లేపేస్తారు . ముగ్గురూ చాలా బాగా నటించారు . Most romantic performance by all of them .
తల్లిదండ్రులుగా సత్యనారాయణ , కె ఆర్ విజయ , దోస్తుగా బ్రహ్మానందం , రాజ వంశ విలన్లుగా కోట శ్రీనివాసరావు , అరుణ్ కుమార్ (subject to correction) , అమల వైపు విలన్లుగా రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , సుధాకర్ , గొల్లపూడి మారుతీరావు , ఇతర పాత్రల్లో హరిప్రసాద్ , శ్రీలత , సంధ్య , నారాయణరావు , ప్రసాద్ బాబు , శ్రీలక్ష్మి , మాణిక్ ఇరానీ , అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు .
సినిమా చాలా సినిమాలలాగానే దుష్టశిక్షణ , శిష్టరక్షణ . తేడా ఏంటంటే హీరో స్కంధ దీవి రాజకుమారుడు . అంతఃపురంలో స్వేచ్ఛ లేని భోగభాగ్యాలతో విసుగెత్తి బయట ప్రపంచాన్ని చూడటానికి బయలుదేరుతాడు . బయటకు వచ్చాక కష్టాల్లో ఉన్న హీరోయిన్ని కాపాడటానికి నడుం బిగిస్తాడు . క్లైమాక్సులో ఇద్దరి విలన్లు జాయింట్ ఆపరేషన్లు చేసి ఓడిపోతారు . రాజకుమారుడు తన ప్రేయసిని పెళ్ళి చేసుకుని సింహాసనం ఎక్కటంతో సినిమా శుభాంతం అవుతుంది .
సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ట్రై చేయవచ్చు . పాటలు మాత్రం unmissable . It’s a romantic , comedy entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article