Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…

March 11, 2026 by M S R

.

రాజేంద్ర ప్రసాద్ గొప్ప నటుడా, గొప్ప కమెడియనా, నాలుగైదు తరాల నటుడా… మనిషా..? ఇవన్నీ సగటు తెలుగు ప్రేక్షకుడికి దేనికి..? వర్తమానంలో తను ఏమిటి అనేదే ముఖ్యం…

వేదిక ఎక్కితే చాలు, తుచ్ఛమైన పదాలు… బూతులు… ఎవరిని పడితే వారిని కించపరిచే కూతలు… అసలు ఏమైంది ..? ఎవరో కుటుంబసభ్యులు చనిపోయాక మైండ్ దెబ్బతిని ఇలా అయ్యాడు అని ఏదో విఫల సమర్థనలు కనిపిస్తుంటాయి మీడియాలో… కానీ..?

Ads

మరి అలా మతితప్పిన మనిషిని ఎందుకు పిలుస్తున్నారు..? ఎందుకు ఈ పిచ్చి కూతలు..? వ్యక్తి ప్రతిభ ఎంత గొప్పదైనా కావచ్చుగాక… పిచ్చి కూతలతో తనంతటతనే భ్రష్టుపట్టిపోతుంటే ఎవడికైనా ఎందుకు సానుభూతి ఉండాలి.., మైండ్ సరిలేకపోతే ఇంట్లో ఉండాలి…

తాజా ఉద్దారకం ఏమిటీ అంటే..? తనకు కత్తి కాంతారావు అని పురస్కారం ఏదో ఇచ్చారట ఎవరో… ఇంకేం, అక్కడే… ఆ సందర్భంగా మైకు పట్టుకుని పిచ్చి కూతలకు దిగాడు… ఇది ఓసారి చూడండి…

 

కాంతారావు వేసే జానపద హీరో వేషాలు చూసి ఎంజీఆర్ వంటి సూపర్ స్టార్ కూడా ఉచ్చ పోసుకునేవాడు, భయపడిపోయేవాడు అని ఏదో కూశాడు… కాంతారావును మెచ్చుకోవాలంటే తమిళ జనం ఆరాధించే ఎంజీఆర్‌ మీద ఆ బజారు భాష ఏమిటి..?

ప్రైవేటు సంభాషణల్లో ఎవరి మీదో ఇంకెవరో ఏదో అంటారు, అవి బయటికి రావు… కానీ బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు ఓ సభాసంస్కారం అవసరం… సరైన భాష అవసరం… ఒక విజ్ఞత, ఒక పరిణతి, ఒక హుందాతనం అవసరం… ఈ రాజేంద్ర ప్రసాద్‌కు అవేవీ లేవు… కొన్నాళ్లుగా చూస్తున్నాం కదా…

కనీసం క్షమాపణలు చెప్పే సంస్కారం కూడా లేదు … మరి పిలిచి బిరుదులు ఇచ్చి, భుజకీర్తులు తొడిగి, కిరిటాలు పెట్టి మరీ మైకు ఇచ్చేవాళ్లకు ఎందుకు లేదు అంటారా..? అదేకదా అసలు విషాదం…

ఎంజీఆర్… గొప్ప నటుడా కాదానేది పక్కన పెడదాం… ఇదే రాజేంద్ర ప్రసాద్ ఈరోజుకూ గొప్పగా ఆరాధించే ఎన్టీఆర్ చరిత్రే తమిళనాట ఎంజీఆర్ చరిత్ర… ఈరోజుకూ కోట్ల మంది ప్రేమిస్తారు తనను… మరి ఇంత చీపుగా ఎలా తీసిపడేశాడు సదరు రాజేంద్ర ప్రసాదుడు…

ప్చ్, ఏదో నాలుగు తరాల సీనియర్ నటుడు కదా అని మర్యాదకు పిలిస్తే, మైక్ ఇస్తే… ఏం వాగుతాడోనని నిర్వాహకులు ఉచ్చ పోసుకునే సిట్యుయేషన్‌లోకి జారిపోతున్నాడు… కాదు, జారిపోయాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఏదో కూశాడు… ఇక మారడు, సైకియాట్రిస్టులే శరణ్యం…
  • జ్యోతిష నామ ధూర్తత్వం సమాజానికి కీడు చేస్తోంది… జాగ్రత్త సుమీ…
  • నేపాలీ సెన్సేషన్… ఓ ఆయుర్వేద డాక్టర్ కొడుకు, ఓ ర్యాపర్… ఎవరితను..?!
  • తర్జుమాలే ఉద్యమంగా! … Tribute to Mukthavaram Pardhasaaradhi ….
  • అసలెవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్..? పాకిస్థాన్ పుండు మీద కారం..!!
  • అమెరికా, ఇజ్రాయిల్‌లతో యుద్ధం చేస్తున్నది చైనా- రష్యాలే…!!
  • “పట్టు పురుగుకు పూరీ ప్రాణభిక్ష… పట్టు అవసరమే లేని తిరుమల!”
  • …. చివరకు తన రక్తపు వేలిముద్రతో సాక్షి సంతకం చేస్తుంది…
  • ‘‘చూడు కమల్.., నీ చేతినీ, నా చేతినీ పోల్చి చూడు… ఎంత తేడా ఉందో…’’
  • శివాజీ ఆ గరుడ పురాణ ప్రవచనాలు మళ్లీ మొదలెట్టాడురా బాబోయ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions