Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…

May 16, 2026 by M S R

.

రాధన్ పండిట్ వెట్రివేల్… తెలుసు కదా… సీఎం జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడు… స్టాలిన్ ఓడిపోతాడనీ, డీఎంకే పవర్ లోకి రాదనీ, ఉదయనిధి గెలుస్తాడనీ, విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పానని చెప్పుకుంటున్నాడు కదా… అలాగే జరిగింది కదా… కాకపోతే విజయ్ ఆతృపడి, తనను ఓఎస్డీగా నియమంచుకోవడం, వెంబనే తన నాస్తిక భాగస్వాములు కస్సుమనేసరికి గంటల్లోనే ఊస్టింగ్ చేశాడు…

సరే, అసలు విషయానికొస్తే… పండితుల వారు ఇంకా చెబుతున్నారు… కేఏ పాల్ బెటర్ అనిపించేలా… నవ్వకండి, సీరియస్ మ్యాటర్… సోయి లేదు, హాస్యాస్పదం వంటి పదాలు వాడకండి… ఆయన ఏమంటాడంటే..? మచ్చుకు కొన్ని…

Ads

1. విజయ్ యాభయ్యేళ్లు పాలిస్తాడు… వందేళ్లు బతుకుతాడు… అంతటి గట్టి జాతకం… (ప్రస్తుతం విజయ్ వయస్సు 51, మరో 50 ఏళ్లు అంటే, 101 ఏళ్లు వచ్చేదాకా అన్నమాట… అంటే ఒక ఏడాది అటూఇటూ మరణించేదాకా విజయే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నమాట… రాసుకోరా సాంబా…)

2. విజయ్ శక్తి సామర్థ్యాలు తమిళనాడుకే పరిమితం కావు, రష్యా- అమెరికా అధ్యక్షుల నడుమ విభేదాల వంటి అంతర్జాతీయ సమస్యల్ని కూడా పరిష్కరించగలడు… (రహస్యంగా మధురై స్టార్ హోటల్ రూంలో కూర్చోబెట్టి, నిర్బంధంగా సంతకాలు పెట్టాలనీ, కాదంటే మెడల మీద కత్తులు పెడతాడా పండిట్ సాబ్..?)

3. తమిళ హీరోల్లో విజయ్, అజిత్‌లకు మాత్రమే సీఎం అయ్యే యోగం, సమర్థత, అదృష్టం ఉన్నాయి… జయలలిత చనిపోయాక ఇద్దరినీ కలుపదామని అనుకున్నాను… కానీ అజిత్ అపాయింట్‌మెంటే ఇవ్వలేదు, సో, ఇప్పుడు ఆ యోగం కూడా తప్పిపోయినట్టే… తనకు ఆసక్తి కూడా లేదు… (పోనీ, ప్రస్తుతం ఆసక్తి కలిగితే… కొంగునాడును విడదీసి దానికి ఒకరిని సీఎం చేస్తే బెటరంటారా..?)

4. అన్నాడీఎంకే అతి చిన్న పార్టీగా మిగిలిపోతుంది… (ఇది నిజమే… విజయ్ పార్టీలో షణ్ముగం అండ్ బ్యాచ్ విలీనమై పోవడం బెటర్)…

రీసెంట్ ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పాడు కానీ… ఇండి కూటమిని బలోపేతం చేస్తాడనీ, మోడీకి ఇక రాను రాను చుక్కలేననీ, జాతీయ స్థాయిలో పెరివార్‌వాదం బలం పుంజుకుంటుందనీ, మమత బెనర్జీ మళ్లీ బలోపేతం అవుతుందనీ, చంద్రబాబు రాష్ట్రపతి అవుతాడనీ చెప్పలేదు… బహుశా సెకండ్ ఎడిషన్‌లో ఉంటాయేమో ఈ పేలుళ్లు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బస్తీమే సవాల్… లై డిటెక్టర్ టెస్టుకు రెడీయా… పీకేకు కేవీపీ సవాల్…
  • ‘వరి వేస్తే ఉరే’ అన్న కేసీయార్‌ది ఒప్పట..! రేవంత్ చెబితే తప్పట..!!
  • ఈ పూసల ప్రేమ – రెండు రాష్ట్రాల నడుమ న్యాయపోరాటం ఐపోయింది…
  • సినిమాల్లో జియో అంబానీకి అదృష్టలక్ష్మి..! జ్యోతి దేశ్‌పాండే…!
  • పెద్ది..! ఇది మరో కోణం… డిఫరెంట్ రివ్యూ… దారితప్పిన దర్శకుడిపై…
  • ఒకరకంగా నెహ్రూకన్నా మోడీయే డిస్టింక్షన్ పాస్… ఎందుకంటే..?
  • ఈ అమర గాయకుడు సుస్వర దర్శకుడు కూడా..! ప్రతి పాటా ముత్యమే..!
  • కార్తీకదీపం కథ మళ్లీ మొదటికి..! సీఎం జోసెఫ్ విజయ్‌కు తొలి పరీక్ష..!!
  • ఆ గోల్డ్ కంపెనీ కథేంటి..? KTR తో ఒప్పందమేంటి..? ఏం జరుగుతోంది..?
  • సూర్య కుమార్ ఔట్..! క్రికెట్ అన్ని పాఠాలూ నేర్పించే ఓ గురువు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions