Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్లీజ్ నమ్మండయ్యా… నాకస్సలు సంబంధం లేదు… నాకేమీ తెలియదు…

March 8, 2026 by M S R

.

సరే, ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్ రాజకీయ ధోరణుల మీద, వైసీపీ దుర్నీతి మీద తన పత్రికలో సరికొత్త పాత పలుకు రాసుకున్నాడు… దాని జోలికి ఎందుకులే గానీ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి మీద సాగుతున్న ప్రచారానికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదు బాబోయ్ అని సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకున్న తీరు మాత్రం విస్తుగొలిపింది… సాధారణంగా తను అనుకున్నది రాసేస్తాడు, అంతేతప్ప తను ఎవరికీ ఏ అంశంలోనూ వివరణలు ఇచ్చుకోడు… ఆ టెంపర్‌మెంట్ ఉంది తనలో… కానీ ఇప్పుడేమిటి మరిలా..?

విషయం ఏమిటంటే..? నాయుడు ఎవరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఓ చిన్న వీడియో బిట్ వెలుగులోకి తీసుకురాబడింది… అందులో పెద్ద అభ్యంతరకర దృశ్యాలేమీ లేవు… కాకపోతే ఆయన వెలగబెడుతున్న పదవి ఏమిటి..? ఈ అనైతికుడికా అంత పెద్ద ధార్మిక పదవి అన్నట్టుగా దాన్ని రచ్చ రచ్చ చేయడానికి సోషల్ మీడియా ప్రయత్నించింది…

Ads

అఫ్‌కోర్స్, అందివచ్చిన అవకాశంగా వైసీపీ భావించి, దాన్ని వాడుకుందో మరేమిటో తెలియదు గానీ… సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడం, ఆయన గాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం, టీడీపీ కూటమి ఎదురుదాడికి దిగడం గట్రా చకచకా జరిగిపోయాయి… ఏపీ పాలిటిక్స్ తీరు వేరు కదా… అసలు రాధాకృష్ణే బీఆర్ నాయుడి మీద కోపంతో, తను ఆశించిన పదవిని నాయుడు దక్కించుకున్నాడనే అక్కసుతో తనే ఈ వీడియోలను బయటికి వదిలాడనే ప్రచారం కూడా జోరుగా సాగింది…

వైసీపీ వాళ్లే నాయుడి మీద వీడియోలు, ఫోటోలను బయటికి వదిలి, దాన్ని రాధాకృష్ణ మీదకు తోసేసి, తంపు పెట్టే ప్రయత్నం చేశారేమో తెలియదు గానీ… ఏబీఎన్ గత ధోరణి దృష్ట్యా జనం నమ్మడానికి మాత్రం చాన్స్ ఏర్పడింది… ఎన్‌డీ తివారీ రాసలీలల యవ్వారం ఓ ఉదాహరణ.., సేమ్, యెల్లో కూటమి అయినా సరే బదనాం చేయడానికి చాన్స్ దొరికితే వదలడు అనడానికి ఎన్టీవీ నైనీ బ్లాక్ యవ్వారం మీద కథనాలు మరో ఉదాహరణ…

సో, అటు తిరిగి ఇటు తిరిగి ఇదంతా తనకు చుట్టుకుంటున్న తీరుతో ఇక రాధాకృష్ణకు తప్పలేదు… ఇలా చెప్పుకొచ్చాడు తన వ్యాసంలో…

  • నాయుడికీ, ఆ మహిళకూ మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు. అది వారి వ్యక్తిగతం. అయితే బీఆర్‌ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్‌ కనుక నైతికత అనే అంశం తెరమీదకు వస్తుంది. (టీటీడీ చైర్మన్ అనే పదవికి కావల్సిన నైతికార్హతలు ఏమిటి సర్..?)

 

  • కల్తీ నెయ్యి విషయంలో మమ్మల్ని అల్లరి చేసినందుకు ప్రతిగా ఇప్పుడు మిమ్మల్ని అల్లరి చేస్తాం అన్నట్టుగా వైసీపీ సోషల్‌ మీడియా రంగంలోకి దిగి బీఆర్‌ నాయుడిని అల్లరి చేసింది. (అంటే కల్తీ నెయ్యి విషయంలో జరిగింది కేవలం అల్లరేనా సర్..?)
  • ఎంతటి వారైనా కాంత దాసులే అన్న నానుడి ఊరకే రాలేదు. ప్రముఖులకు మహిళలతో అనైతిక సంబంధాలు కొత్త కూడా కాదు. భారత తొలి ప్రధాని నెహ్రూపై కూడా ఎన్నో వదంతులు వచ్చాయి. (సో, అంత నెహ్రూకే తప్పలేదు, ఉంటే తప్పేమిటి అంటున్నారా సర్..?)

 

  • రాజకీయాలలో కీలక పదవులలో ఉన్న వారిపై గతంలో కూడా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ నాయుడు వ్యవహారం తెరమీదకు వచ్చింది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాసలీలలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. (సో, ఆ ప్రచారానికీ ఈ ప్రచారంతో చెల్లు అంటారా అయితే..? )
  • చలామణిలో ఉన్న వీడియోలు, ఇతరత్రా అంశాలు ఆయన టీటీడీ చైర్మన్‌గా నియమితులు కాక ముందటివి కనుక నాయుడు మహాపరాధం చేశారని చెప్పడానికి లేదు. (ఇకపై పద్దతిగా ఉంటే చాలు అని చెబుతున్నారా సర్..?)

 

  •  సదరు వీడియోలను నేనే సామాజిక మాధ్యమాలలో పెట్టించానని ప్రచారం చేయడం ద్వారా నాకూ నాయుడికీ మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేశారు. ( అంతేతప్ప, నన్ను నమ్మండి, నా తప్పేమీ లేదు అంటున్నారా సర్..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంస్కారం తప్పిన సాయి మాధవుడు… రైట్ రాయల్ వరలక్ష్మి వివరణ…
  • ప్లీజ్ నమ్మండయ్యా… నాకస్సలు సంబంధం లేదు… నాకేమీ తెలియదు…
  • ఈ వెలుగుమట్ల విధ్వంసం వెనుక చీకటి కథలెన్నో… చెప్పుకోవల్సిందే…
  • మమత నా చెల్లెలు- ఎందుకిలా చేసింది..? హర్టయిన రాష్ట్రపతి ముర్ము..!!
  • రై రై రా రా… పెద్ది శ్రీరామ్‌కు యుద్ధ విధ్వంసాభివందనాలు…
  • టాప్ వన్ బౌలర్ అండ్ టాప్ వన్ బ్యాటర్… తీసేస్తారా, ఉంచేస్తారా…
  • శృతి మించిన శృంగారం… నారీ నారీ నడుమ ‘లైన్’ తప్పిన మురారి…
  • మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
  • “హే గూగుల్… గతం మరవనివ్వవా..! కర్ణాటక హైకోర్టుకు శ్రీలంక సుప్రీం జడ్జి”
  • ఇరాన్ యుద్ధాన్ని ఎఐ శాసిస్తోంది… ఇది కృత్రిమ మెదళ్ల సమరం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions