Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రానురాను ఈ మాఫియాలే మానవాళికి అతి పెద్ద విపత్తు… పీల్చి చంపేస్తయ్…!!

October 15, 2021 by M S R

మొన్న హెటిరో డబ్బు కట్టలు అంటూ ఓ బీరువా నిండా పేర్చిన కరెన్సీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది… దాదాపు 1200 కోట్ల మేరకు అవకతవకలు ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ అంటోంది… ఎహె, అసలు హెటిరో ఏమిటి..? డ్రగ్ కంపెనీలన్నీ కరోనా సీజన్‌లో కరెన్సీ నోట్లను తవ్వుకున్నయ్… వందలు, వేల కోట్లు… ఇక హాస్పిటల్స్ అయితే పక్కా నిలువు దోపిడీ కేంద్రాలుగా మారిపోయినయ్… ప్రాణాలు దక్కుతాయా లేదా అనేది లేదు… రోజుకు ఎంత..? నో ఇన్స్యూరెన్స్, వోన్లీ క్యాష్ అంటూ ప్రత్యేకంగా నోట్ల లెక్కింపు యంత్రాలు కొన్న హాస్పిటల్స్ బోలెడు… బీమా కార్డులు అనుమతించినా, ఎంతవరకు గరిష్ట పరిమితి ఉందో అన్నిరోజులు ఐసీయూలో ఉంచి.., ఆ కార్డు ఖాళీ కాగానే ‘మీవోడు రాత్రిపూట చచ్చిపోయిండు’ అని పీనుగల్ని అప్పజెప్పిన కథలు వేలల్లో… అంతెందుకు..? వాటర్ బాటిల్ ధర సరిపోతుంది అన్న భారత్ బయోటెక్ కంపెనీ ఆ తరువాత ఎంత ధర పెట్టి, ఎన్ని వేల కోట్లను జమచేసుకుందో తెలుసు కదా… సర్కారీ సపోర్ట్ కూడా..! దాదాపు అన్ని కంపెనీలూ కరోనాకు ముందున్న మందుల రేట్లను కనీసం రెట్టింపు చేశాయి ఇప్పుడు…

కరోనా మూడో సీజన్, వీలయితే నాలుగో సీజన్ రావాలని డ్రగ్ మాఫియా, హాస్పిటల్ మాఫియా రోజూ కోటి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నాయి… మళ్లీ మైనింగ్ షురూ… రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి నిత్య విపత్తు అంటే ఈ మాఫియాలే… మన డ్రగ్ అథారిటీల నుంచి WHO దాకా అన్నీ మాదచ్చోద్ వ్యవస్థలే… ప్రత్యేకించి హాస్పిటల్స్ మాఫియా చేసే దోపిడీలతో ఇప్పటికే పల్లెల్లో అనేకానేక కుటుంబాలు ఆస్తులు అమ్ముకుంటున్నయ్, అప్పుల పాలవుతున్నయ్, ఆత్మహత్యలకు గురవుతున్నయ్… రాబోయే రోజుల్లో ఈ కల్లోలం మరింత ఆవరించనుంది… తెల్లారి లేస్తే డబ్బులు, ఆస్తుల లెక్కలు, పొలిటికల్ జిత్తుల తప్ప, కడుపులో వీసమెత్తు జ్ఞానం, ప్రజల మీద ప్రేమ ఎరుగని మన పాలకులు ప్రజల ఖర్మ… అంతే… ఇదంతా చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది…

corona

Ads

ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది… (మిగతా డప్పు పత్రికలకు ఎలాగూ చేతకావడం లేదు, మానవీయ కోణమున్న వార్తల్ని సరిగ్గా పట్టుకుని ఈ పత్రిక మెయిన్ పేజీల్లో పబ్లిష్ చేస్తోంది… అభినందనలు…) ఒక యువరైతు కరోనా బారిన పడ్డాడు… సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం, పరెడ్డిగూడెం… అమ్మానాన్న, భార్య, ఇద్దరు పిల్లలు, మంచి ఆర్థిక స్థితి… కానీ బ్యాడ్ లక్… ఇంటి వద్ద రెండురోజులు చికిత్స, ఫలితం లేదు… ఖమ్మం తీసుకుపోయారు, ఫలితం లేదు… హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్, వాడు రోజు ప్యాకేజీ చెప్పాడు, రోజుకు 1.8 లక్షలు… విపరీతంగా స్టెరాయిడ్స్ వాడుతూ పోయారు… (హాస్పిటల్స్‌లో అధికశాతం మంది రోగులు మరణించడానికి ఇదే కారణమట… అంటే కరోనా చికిత్స ప్రోటోకాల్ లేదు, మన్ను లేదు, హాస్పిటల్ వాడికి ఏది తోస్తే అదే వైద్యం… అక్షరాలా వేల మందిని మింగేశాయి ఈ హాస్పిటల్స్…) బిల్లు కడుతూ పోయింది కుటుంబం…

చివరకు చెన్నైకి తీసుకుపోవడానికి ఎయిర్ అంబులెన్స్ కూడా మాట్లాడారు, ఈ హాస్పిటల్ వాడు ఒప్పుకోడు, మరి వాడికి వచ్చే సంపాదన పోతుంది కదా… చివరకు ఆ రైతు సత్యనారాయణరెడ్డి కన్నుమూశాడు… అక్షరాలా వైద్యంలో లోపమే… కానీ ఎవడూ నిరూపించలేడు… ఎవడూ పట్టించుకోడు… మొత్తం బిల్లు ఎంతో తెలుసా..? 1.46 కోట్లు… అందులో 33 లక్షల రిబేటు ఇచ్చారట… అక్షరాలా కోటీ 13 లక్షలు కట్టారు… ఐనా మనిషి దక్కలేదు… మరి ఓ మధ్యతరగతి మనిషికి, ఓ పేదవాడికి ఈ ఆపద వస్తే ఏమిటి మార్గం..? ఆరోగ్యశ్రీ కార్డుల్ని ఎడమచేత్తో కూడా తాకడం లేదు హాస్పిటల్స్… పైగా ఆ ఖర్చుకూ పరిమితి ఉంది… సర్కారీ వైద్యం సంగతి తెలిసిందే… అంటే ఇలాంటి రోగమొస్తే మనిషి చావాల్సిందేనా..? ఏమీ చేయలేక, ఏమీ చేతకాక ఆ కుటుంబాలు నిస్సహాయింగా కన్నీళ్లు కారుస్తూ కాటికి సాగనంపాల్సిందేనా..? మొన్న ఓ మిత్రుడు అన్నాడు… ‘‘ఒరేయ్ అంబానీ, ఒరేయ్ ఆదానీ… ఇంకా ఎన్నిరోజులురా ఈ మైనింగులు, ఈ ఎదవ ఆయిల్, టెలికాం, పోర్టు వ్యాపారాలు..? లక్షల కోట్ల డబ్బు ఉన్నది డ్రగ్గుల్లో, వేక్సిన్లలో, హాస్పిటళ్లలో.,. మనుషుల రోగాల్లో… మారండ్రా… హెటెరోలను, భారత్ బయోటెక్కుల్ని, సీరం, యశోదల్ని చూడండ్రా…!’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions