Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…

March 15, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తెలుగు సినిమా రంగంలో Made for each other జోడీలలో ఒకటి ఏయన్నార్-వాణిశ్రీ . ఏయన్నార్- సావిత్రి తర్వాత వీళ్ళిద్దరిదే హిట్ కాంబినేషన్ . దసరా బుల్లోడు కావచ్చు , ప్రేమనగర్ కావచ్చు , గ్రేట్ జోడీ . చాలా రోజుల తర్వాత 1990 లో వచ్చిన ఈ రావు గారింట్లో రౌడీలో మరలా ఈ జోడీ హడావుడి చూస్తాం .

కోడి రామకృష్ణ దర్శకత్వంలో సంస్కరణ వాదం చుట్టూ అల్లబడిన కధ . రావు గారి కూతురిని గాయపరిచి ఆయన అల్లుడిని కిడ్నాప్ చేస్తాడు రౌడీ గారు . ఆ ఘర్షణలో మతిస్థిమితాన్ని పోగొట్టుకుంటుంది రావు గారమ్మాయి . ఈ వ్యవహారమంతా నడిపించేది ముగ్గురు దుష్టులు . ఆ దుష్టుల ఆంబోతు కుమారులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావు గారు ఉరిశిక్ష వేయిస్తారు కోర్టులో . ఆ పగ మీద రావు గారి కుటుంబాన్ని చిందరవందర చేస్తారు ముగ్గురు విలన్లు .

Ads

ఈ విలన్ల చేతిలో కిరాయి రౌడీ సుమన్ . అతన్ని కూడా ఓ హత్యానేరంలో జైలుకు పంపుతారు విలన్లు . రావు గారు తన పలుకుబడితో , తన హామీ మీద రౌడీ గారిని జైలు నుంచి తప్పించి తమ ఇంటికి తీసుకుని వెళతారు . పది రోజులు వారింట్లో ఉండే ఒప్పందం మీద రావు గారింట్లో రౌడీ గారుంటారు .

ఆ పది రోజుల్లో రావు గారి మనమరాలికి దగ్గరవుతాడు రౌడీ . అప్పుడు రావు గారు ఆయన భార్య డాక్టర్ పాత్రలో వాణిశ్రీ రౌడీ చేసిన నష్టాన్ని వివరించి అతనినే అస్త్రంగా ప్రయోగించి విలన్ల వద్ద బందీగా ఉన్న రావు గారి అల్లుడిని విడిపించుకుంటారు . పూర్వాశ్రమంలో చేసిన నేరాలకు శిక్ష అనుభవించాక అతని కోసమే కాచుకుని కూర్చున్న అతని ప్రేయసితో పెళ్లితో సినిమా శుభాంతం అవుతుంది .

రావు గారిగా ఏయన్నార్ , ఆయన డాక్టర్ భార్యగా వాణిశ్రీ సినిమాకు హైలైట్ . మధ్యమధ్యలో పాత రొమాన్స్ సరదాగా ఉంటుంది . ఫస్ట్ హాఫ్ లో సత్యనారాయణ , షావుకారు జానకిల తాయారమ్మ బంగారయ్య పాత్రలు గుర్తుకొస్తాయి . రౌడీగా సుమన్ బాగా నటించాడు . అతని ప్రేయసిగా రజని గ్లామర్ స్పేసుని భర్తీ చేసింది .

మరో ప్రధాన పాత్ర రావు గారి మనమరాలు పాత్ర . బేబీ సౌమ్య హంస చక్కగా నటించింది . దుష్టులుగా కోట శ్రీనివాసరావు , రాజా కృష్ణమూర్తి , సుదర్శన్ ; ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , భాగ్యలక్ష్మి , మల్లిఖార్జున రావు , బాబూమోహన్ , ప్రభాకరరెడ్డి  ప్రభృతులు నటించారు .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . మనసనేది మాయాబజార్ అది మంత్రాల మాంత్రికుని దర్బార్ అంటూ సాగే సుమన్ మీద పాట బాగుంటుంది . ఏయన్నార్ , వాణిశ్రీల మీద అర్ధరాత్రి కోడి అంటూ సాగే అల్లరి పాట చాలా హుషారుగా ఉంటుంది . ఇద్దరి గెంతులు కాసేపు ప్రేక్షకులకు దసరా బుల్లోడు గెంతుల్ని గుర్తుచేస్తాయి . పాట మధ్యలో రాజ్- కోటి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల ట్యూన్ని కూడా రన్ చేస్తాడు .

సుమన్ , రజని మీద రెండు డ్యూయెట్లు హుషారుగానే ఉంటాయి . కన్నా నా చిట్టి కన్నా ఒకటి . మరొకటి ఎర్రెట్టి పోయే . డాన్సులనన్నీ శివ , సుబ్రమణ్యం , శివ శంకర్ బాగానే కంపోజ్ చేసారు . జొన్నవిత్తుల వారి లిరిక్సుని బాలసుబ్రమణ్యం , జానకమ్మ పాడారు . తోటపల్లి మధు డైలాగులను వ్రాసారు . బాగానే ఉంటాయి .

ఏయన్నార్ కాస్ట్యూమ్స్ బాగుంటాయి . నాలాంటి వస్త్రప్రియులకు బాగా నచ్చుతాయి . సినిమా యూట్యూబులో ఉంది . ఏయన్నార్ , వాణిశ్రీ , సుమన్ అభిమానులు తప్పక చూడవచ్చు . ముఖ్యంగా నాలాంటి వాణిశ్రీ అభిమానులు . అప్పటికింకా గుండ్రం కాలేదు . ఆ క్రమంలో ఉంటుంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”
  • మన్ పిశాచ్… ఐఫోన్, 33 వేల ఖర్చు, ఒకేరోజు షూట్… సినిమా కంప్లీట్…
  • ఏక్‌సేఏక్… దొందూ దొందే… బంగ్లా, పాక్ క్రికెటర్ల ‘చీప్ యాక్షన్’…
  • మూసీపై ఆ ముగ్గురు పాత సీఎంలు చేతులెత్తేసిన విధంబెట్టిదనిన..!!
  • టైటిల్‌లో అగ్ని ఉంటే చాలు… ఆ సినిమా మండిపోయి మసి..!
  • అమెరికా- ఇజ్రాయిల్ ప్లాన్లు ఎక్కడ బెడిసికొట్టాయి..? నెతన్యాహూ సేఫేనా..?
  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…
  • నో…! మెగా క్యాంపుకీ బన్నీకి నడుమ గ్యాప్ అలాగే ఉందన్నమాట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions