Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏం చేయాలో ఎటూ తేల్చరు… ఏటా కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు…

June 14, 2026 by M S R

.
Ashok Kumar Vemulapalli …. నిజమే కదా …
రుషికొండ భవనాలని ఇంతవరకు ఎందుకు వినియోగంలోకి తేవడం లేదు ?
గతంలో అసెంబ్లీలో , ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు ఈ భవనాల వినియోగం గురించి ఏమి చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని అందర్నీ సలహా కూడా అడిగారు.

కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా .. ఇంతవరకు .. ఈ భవనాలను ఏ విధంగానూ వినియోగించడం లేదు .. ఎందుకు ?
ఇందులో ఉన్న కీపాయింట్ .. రుషికొండపై నిర్మించిన భవనాల మెయింటెనెన్స్ కి నెలకి 25 లక్షలు ఖర్చు బెడుతున్నారు. అంటే రెండేళ్లలో 6 కోట్లు.

మాజీ సీఎం జగన్ గారు.. ప్రజల సొమ్ముతో ప్యాలెస్ లు కట్టుకున్నారని వినర్శించింది కూడా కూటమి నాయకులే .. అది పర్యాటక భవనమో .. వీళ్ళు ఆరోపించినట్టు ప్యాలెసో తెలీదు కానీ .. ఆరోపణలు పక్కన పెడితే ఆయన ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ భవనాలే నిర్మించారు . ప్రభుత్వంలో ఎవరు ఉన్నా అవి ప్రభుత్వానికి మాత్రమే చెందుతాయి .. అవి జగన్ సొంత ప్రాపర్టీ కాదు .

Ads

ఎదుటి పార్టీల మీద , నేతల మీద ఎన్నైనా పొలిటికల్ ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు కానీ మన చేతిలోకి అధికారంలోకి వచ్చాక వాటికి సొల్యూషన్ ఏమి చూపించామనేది ఇంపార్టెంట్ .. జగన్ గారు ఈ భవనాలు నిర్మించి డబ్బు వృధా చేశారని ఆరోపించిన టీడీపీ , జనసేన , బీజీపీ ఈ రెండేళ్ళల్లో ఆ భవనాలని వినియోగంలోకి తేకుండా నెలనెలా 25 లక్షలు ఖర్చు పెట్టడం ఇంకా పెద్ద తప్పు కదా ..

నాకు బాగా గుర్తు, పవన్ కళ్యాణ్ గారు .. జగన్ సీఎంగా ఉన్నపుడు రుషికొండ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారని నానా హడావిడి చేసారు . మళ్లీ ఆయనే డిప్యూటీ సీమ్ హోదాలో స్వయంగా అవే భవనాల దగ్గరకు వెళ్లి పరిశీలించి వచ్చారు కూడా కానీ .. ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదు.

రెండేళ్లు అనేది చాలా పెద్ద పీరియడ్ .. ఇంకా దయచేసి వృధా చేయకండి .. ప్రభుత్వ ఆసుపత్రిగానో ఇంకా ఏదైనా అవసరాల కోసమైనా వినియోగించండి .. ప్రైవేట్ సంస్థలకి దయచేసి ఇవ్వకండి .. అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏం చేయాలో ఎటూ తేల్చరు… ఏటా కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు…
  • కుట్రతో సంబంధం లేకపోతే… కుట్రదారులను కలిసే పనేముంది..?!
  • ఒక విలనీ అత్త… ఒక హీరో అల్లుడు… ఓ మాస్ మసాలా పల్లీ బఠానీ…
  • తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు..? నో వే…!!
  • కాలా హిరణ్..! పాపం, సల్మాన్ వ్యక్తిత్వ హక్కులకు విఘాతం అట..!!
  • రెండు కొప్పుల ‘సివిల్’ వార్‌… చివరకు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం..!!
  • ఆలియా భట్..! చెప్పే మాటలకూ చేసే పనులకూ ఎంత తేడా..?!
  • దృఢం..! జీతూ జోసెఫ్ మార్క్ ‘దృశ్యం’ లేదు… దృఢంగా లేదు…
  • ఒక షిండే… ఒక హిమంత… ఒక సువేందు… ఒక హరీష్ రావు..?!
  • అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ..! ఆల్ప్స్ పర్వతాల్లో విమాన ప్రమాదం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions