Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…

February 18, 2026 by M S R

.

మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం… ఇళయరాజా అత్యంత గొప్ప గ్రేట్ కంపోజర్ కావచ్చుగాక… మనిషి వ్యక్తిత్వంపరంగా చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడని… లిటిగెంట్ అని… ఎవరో తన సినిమాలో ఇళయరాజా పాటల్లోని ఓ చిన్న పల్లవిని హమ్ చేసినా సరే కోర్టుకు ఈడ్చిన ఉదంతాలూ చదివాం…

కటువుగా ఉన్నా సరే, ఉన్నదున్నట్టు చెప్పుకుందాం… తన పాటలు పాడితే రాయల్టీ ఇవ్వాలంటూ, తనను పైకి తీసుకొచ్చిన బాలసుబ్రహ్మణ్యం మీద కూడా కేసులు పెట్టాడు… ఎవరో స్టూడియో యజమాని దయతో ఓ రూం ఇస్తే, అది నాదేనంటూ కోర్టుకెక్కాడు..,

Ads

ఎవరు, ఎక్కడ తన పాటలు పాడినా సరే, రాయల్టీ కట్టాల్సిందేనంటూ వ్యాజ్యాలకు వెళ్తున్నాడు… మనం ఇంతకుముందే చెప్పుకున్నాం చాలాసార్లు… ఒక నిర్మాత తన సినిమా కోసం, తన పెట్టుబడితో ఓ పాటను క్రియేట్ చేయించుకుంటాడు…

రిస్క్ తనదే… తనకు తగిన టేస్టుతోనే… తన కథకు తగిన పాట, సందర్భానికి తగిన పాట… నిర్మాత ఇష్టం… గాయకులు, రచయితలు, కంపోజర్లు డబ్బు తీసుకుని మరీ… డిమాండ్ చేసి మరీ… గిరాకీకి తగినంత తీసుకుని మరీ పాడుతున్నారు, రాస్తున్నారు, ట్యూన్లు కడుతున్నారు… మరి మంచీచెడుకు నిర్మాతే కదా బాధ్యుడు… హక్కుదారు…

మరి వీళ్లందరికీ రాయల్టీ ఎందుకు ఇవ్వాలి…? ఇక్కడ వస్తుంది సమస్య… ఇప్పుడు ఏమైంది..? న్యాయంతో, చట్టంతో ఆడుకున్న ఇళయరాజాకు జబరస్త్ షాక్ తగిలింది… 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల పాటలను అసలు ఇళయరాజా వాడుకోవద్దని ఢిల్లీ హైకోర్టు ఓ మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది… ఎందుకు..?

ఆ సినిమాల పాటల హక్కుల్ని ఇళయారాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు హక్కులు ఇచ్చాడు, నిజానికి అది అనైతికం… ఎందుకంటే..? ఆ శాశ్వత హక్కుల్ని ఆ సినిమాల నిర్మాతలు సరిగమ ఆడియో సంస్థకు అమ్మేశారు… మరి వాళ్లు కొన్న రైట్స్‌ను ఇళయరాజా వేరేవాళ్లకు ఎలా ఇస్తాడు…?

అక్కడ వచ్చింది పంచాయితీ… సదరు సరిగమ సంస్థ కోర్టుకెక్కింది… అసలు నిర్మాతల నుంచి కొనుగోలు చేశాక, ఇక పూర్తి హక్కులు వాటిని కొనుగోలు చేసిన సరిగమ సంస్థకే ఉంటాయని స్పష్టం చేసింది… సరైన మధ్యంతర తీర్పు…

మళ్లీ చెప్పుకుందాం… ఒక వ్యక్తి ఒక రంగంలో అపరిమిత, అసాధారణ మేధస్సును, ప్రతిభను, క్రియేటివిటీని చూపించవచ్చుగాక… కానీ అదే వ్యక్తి నిజజీవితంలో ఆదర్శప్రాయంగా ఉండాలని ఏమీ లేదు… ఇళయరాజా అతి పెద్ద ఉదాహరణ..!! పనిలోపనిగా కోర్టు ఈ రాయల్టీ వివాదానికి తెరదించేసి, డబ్బు పెట్టుబడి పెట్టే నిర్మాతనే పూర్తి హక్కుదారుగా ప్రకటించాలని కోరుకుందాం… ఎందుకంటే అదే న్యాయం కాబట్టి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…
  • స్వరరచనలో లబ్ధి ప్రతిష్ఠుడే… లిటిగెంటుగా పే-ద్ద లుబ్ధ ప్రతిష్ఠుడే…
  • ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…
  • కరీంనగర్ ఇషాన్ కిషన్… బండి సంజయ్… ఓ ఉత్కంఠభరిత మ్యాచ్..!!
  • మేడం సార్, మేడం, అంతే… వయస్సు మీద పడినా భానుమతి లెవల్ అదే…
  • 24 ఏళ్లు సరే… అసలు ప్రత్యూష కేసులో న్యాయం జరిగినట్టేనా..?
  • నచ్చిన వార్త..! కొన్ని ఉద్వేగాలకు లెక్కలు, లాజిక్కులు ఉండవ్..!!
  • ఉత్తమ పురుష్..! లేడీ ఐఏఎస్‌లకు ఆయనంటే ఎందుకో క్రేజ్..?
  • పోచమ్మ దయ..! పొడుగోడు కేటీయార్ కోరిక తీర్చిన పొట్టోడు రేవంత్..!!
  • చూస్తూ ఉండండి… జియో ఆయిల్ పాలిటిక్సులో… పాకిస్థాన్ 4 ముక్కలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions