.
వైభవ్ సూర్యవంశీ..! బాల్ తనవైపు వస్తుందంటే చాలు, బౌండరీకి కొట్టేయడమే అలవాటు… మరీ ఫస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టడం అంటే మహా సరదా… కాదు, అది తన ఆట స్టయిలే అది… అలా ఆడి ఔటవుతూ ఉంటాడు కూడా… అందుకే ఈమధ్య అందరూ తనకు సలహా ఇస్తున్నారు… మొదట్లో కుదురుగా ఆడు, భారీ ఇన్నింగ్స్ నిర్మించు, మంచి బాల్స్‌ను గౌరవించు… ఇలా…
కానీ తన భావన వేరు, మంచి బాల్‌ను కూడా బౌండరీ దాటిస్తేనే దాన్ని గౌరవించినట్టు అనుకుంటాడు… కుర్రతనం కాదు, అలా ఆడటంలోనే తనకు కిక్కు… అందరూ చెబుతున్నారు కదాని నిన్న రాత్రి లక్నోతో జరిగిన మ్యాచులో మొదట్లో నెమ్మదిగా ఆడసాగాడు… ఎక్కువగా స్ట్రయిక్ యశస్వి జైస్వాల్‌కు ఇవ్వసాగాడు… ఒక దశలో (పవర్ ప్లేలో) యాభై రన్స్ వస్తే అందులో జైస్వాల్ 38, వైభవ్ కేవలం అయిదు మాత్రమే…
Ads
కాసేపటికి అర్థమైంది, తను తనలా మాత్రమే ఆడాలని… ధాటిగా ఆడితేనే వైభవం అని… ఇక తరువాత బ్యాట్ ఝలిపించడం స్టార్ట్ చేశాడు… 10 సిక్సులు, 7 ఫోర్లు… ఓవరాల్‌గా 240 స్ట్రయిక్ రేట్‌తో 93 రన్స్ చేసి ఔటయ్యాడు కానీ రాజస్థాన్ జట్టును తను గెలిపించడమే కాదు, ప్లేఆఫ్ దిశలో మరో మెట్టు ఎక్కించాడు… స్థూలంగా ఈ సీజన్‌లో వైభవ్ ధాటిగా ఆడితేనే రాజస్థాన్ గెలుపు, లేదంటే ఓటమి…
ఒక ఐపీఎల్ సీజన్‌లో 50 దాటి సిక్సులు కొట్టిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్… ఇప్పుడు తన కన్ను క్రిస్ గేల్ రికార్డు మీద ఉంది… తనకు ఈ సీజన్‌లో ఇంకా కనీసం ఓ మ్యాచ్ మిగిలే ఉంది… గేల్ 14 మ్యాచుల్లో 59 సిక్సులు కొట్టాడు… అదీ 2012 లో…
ప్రస్తుతం ఆరెంజ్ కప్ పోటీలో 579 రన్స్‌తో టాప్ తను… మొదట్లో ఈ పోటీలో ఎక్కడో దూరంగా ఉన్న మార్ష్ ఈమధ్య మెరుపు ఇన్నింగ్స్‌తో 563 రన్స్ చేసి, వైభవ్‌తో పోటీపడుతున్నాడు… తరువాత ప్లేసుల్లో క్లాసెన్ 555, సాయి సుదర్శన్ 554, శుభమన్ గిల్ 552 …

ఈమధ్య పలువురు ప్లేయర్లు ఫిఫ్టీ చేసినప్పుడు లేదా మంచి వికెట్ తీసినప్పుడు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు… కొందరు కాగితాలపై ఏవో రాసుకొచ్చి ప్రేక్షకులకు చూపిస్తుంటారు… వాటిని క్లోజప్పులో ప్రదర్శించే బాధ్యత కెమెరాలది…
వైభవ్ సెలబ్రేషన్ ఈ ముద్ర… కొందరు యంగ్ ప్లేయర్లు anime references ఎక్కువగా వాడుతున్నారు… జపనీస్ అనిమో సీరీస్ నరుటోలో రకరకాల వేలి ముద్రలు కనిపిస్తాయి… ఈ గెశ్చర్ కూడా అదే వైబ్ ఇస్తోంది… “Naruto-style jutsu celebration” అవునో కాదో, ఇంకేదైనా అర్థముందో తెలియదు గానీ… Naruto fan culture క్రికెట్, ఫుట్‌బాల్ సెలబ్రేషన్లలో ఎక్కువగా కనిపిస్తుంది…
Share this Article