Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?

May 11, 2026 by M S R

.

విజయవాడ నగరంలోని ఒక ఖరీదైన క్లబ్ అది. ఓ రెడ్ లైట్ క్లబ్… అందరికీ తెలుసు… అక్కడి లేడీ మేనేజర్ దగ్గరికి ఒక రోజు సాయంత్రం చాలా హుందాగా ఉన్న ఒక మధ్యవయస్కుడు వచ్చాడు. పట్టు చొక్కా, చేతికి బంగారు గడియారం.. చూడగానే పెద్ద మనిషిలా ఉన్నాడు.

అతను నేరుగా వెళ్లి, “నాకు ఇక్కడ మాయ అనే ఆవిడను కలవాలి” అన్నాడు.

Ads

మేనేజర్ ఆశ్చర్యపోయి, “అయ్యా, మాయ ఇక్కడ అందరికంటే కాస్ట్లీ. ఆమెను కావాలంటే సెషన్‌కు లక్ష రూపాయలు అవుతుంది. వేరే ఎవరైనా తక్కువలో చూద్దామా?” అన్నదామె…

అతను ఏమాత్రం తడుముకోకుండా, “లేదు, నాకు మాయే కావాలి” అని ఖచ్చితంగా చెప్పాడు.

సరేనని మాయ వచ్చింది. “నా రేటు తెలుసుగా?  పర్ సెషన్ లక్ష రూపాయలు.. పైగా నా దగ్గర బేరసారాలు ఉండవు” అంది. ఆ వ్యక్తి వెంటనే జేబులోంచి కట్టలు తీసి లక్ష రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు, గంట తర్వాత అతను ప్రశాంతంగా వెళ్ళిపోయాడు.


మరుసటి రోజు రాత్రి మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు. మాయ ఆశ్చర్యపోతూ, “ఏంటి సార్, వరుసగా రెండో రోజు వస్తున్నారు? ఇక్కడ ఎవరూ అంత ఖర్చు పెట్టి వరుసగా రారు. డిస్కౌంట్ ఏమీ ఉండదు సుమా!” అంది.

అతను నవ్వి, “పర్లేదు, ఇదిగో మరో లక్ష” అని ఇచ్చి లోపలికి వెళ్ళాడు.


మూడవ రోజు రాత్రి కూడా అతను వచ్చేసరికి క్లబ్ అంతా షాక్! మాయకు కూడా కుతూహలం ఆగలేదు. గంట సేపు గడిచాక ఆమె అడిగింది, “సార్, మీరెవరో గానీ చాలా గొప్పవాళ్లులా ఉన్నారు. ఇంత డబ్బు తగలేస్తున్నారు.. నా రేటు తట్టుకోలేరు చాలామంది… అసలు మీరెవరు, మీ సొంత ఊరు ఏది?” అని.

ఆ వ్యక్తి నిమ్మళంగా, “మాది గుంటూరు పక్కన ఒక చిన్న పల్లెటూరు” అన్నాడు. పేరు చెప్పాడు…

“అవునా! నాది కూడా అదే ఊరు! మా అమ్మ, తమ్ముడు ఇప్పటికీ అక్కడే ఉంటారు” అంది మాయ ఆశ్చర్యంగా.

అప్పుడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ఇలా అన్నాడు: “నాకు తెలుసు అమ్మాయ్.. మీ తమ్ముడు చనిపోయే ముందు మీ నాన్నగారి ఆస్తిలో నీకు రావలసిన ‘మూడు లక్షల’ వాటాను నీకు అందజేయమని నాకే చెప్పాడు. నేను మీ తమ్ముడి తరపు లాయర్ని. ఇదుగో నీ మూడు లక్షల బాకీ తీరిపోయింది!”

.

మిగతా కథ, ఇప్పటిదాకా చదివిన కథలో సందేహాలకు జవాబులు మీ ఇష్టం… (ఓ మిత్రుడు పంపిన వాట్సప్ ఇంగ్లిషు సరదా పోస్టుకు తెలుగీకరణ ఇది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions