Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శెభాష్ రెడ్డీ..! ఎందరో ఎంతో సంపాదిస్తారు, సొసైటీకి తిరిగి ఇచ్చేవాడో తోపు..!!

February 23, 2026 by M S R

.

వందలు, వేల కోట్లు సంపాదించొచ్చు… ప్రతిభ, అవకాశం, అదృష్టం వంటివి ఎన్నో సహకరించవచ్చు… ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక అనుకూలించిన అదృష్టం పాత్ర కూడా ఉంటుంది…

కానీ ఇంత ఇచ్చిన జనానికి మనం ఏం తిరిగి ఇస్తున్నాం అనే భావనకు అదృష్టం, ప్రతిభ, అవకాశం అవసరం లేదు… హృదయంలో నుంచి రావల్సిన కృతజ్ఞతాభావన అది… జనం రుణం ఎంతో కొంత తీర్చుకోవాలనే సత్సంకల్పం, నిజాయితీ…

Ads

సంపాదించిన ధనాన్ని దాచుకునేవాడిని చరిత్ర గుర్తించదు… సమాజానికి తిరిగి చెల్లించేవాడిదే చరిత్ర… కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలం, జనగామ గ్రామానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో రాణించాడు… సొసైటీకి కొంత తిరిగి ఇచ్చేస్తున్నాడు…

ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం… ఆయన పేద పిల్లలకు మంచి చదువు అందాలని ఆరాటపడుతుంటాడు… తన దగ్గరకు ఎవరైనా పేద పిల్లలు వచ్చి ఉన్నత చదువులకు సాయం అడిగితే కాదనకుండా వాళ్ల ఫీజులకు సరిపడా డబ్బు ఇచ్చి పంపిస్తాడు…

తాను చదువుకున్న బడిని కార్పొరేట్ తరహాలో తిరిగి నిర్మించాడు… నిజానికి కార్పొరేట్ స్కూళ్లకూ ఈ లుక్ లేదు, ఇన్ని సౌకర్యాలు ఉండవు… రూ. 7 కోట్లు ఖర్చు చేసి, ఆధునిక భవనం, డిజిటల్ క్లాస్ రూమ్‌లు… కార్పొరేట్ బడుల్లో లేని సౌకర్యాలు ఎన్నో ఉంటాయి… ఆ బడిలో ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటారు …

శెభాష్ రెడ్డీ నెలసరికి సంబంధించి ప్యాడ్స్ మార్చుకునే సౌకర్యం కల్పించడంతోపాటు వాడేసిన ప్యాడ్‌లు కాల్చేసే మిషన్ కూడా ఏర్పాటు చేశాడు… గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కనీసం సర్పంచ్ కూర్చునే సరైన కుర్చీ కూడా లేని ఎన్నో పంచాయతీలు ఉన్నాయని గుర్తించి, ఒక్కో పంచాయతీకి రూ 2 లక్షలు విలువైన ఫర్నిచర్ ను 50 పంచాయతీలకు అందజేశాడు…

కామారెడ్డి ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సర్పంచ్ లు ఫర్నిచర్ తీసుకువెళ్తున్నారు…
ఆయన గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు… ఇటీవల తన కొడుకు పెళ్లి సందర్భంగా సొంతూరు జనగామలో ప్రతీ ఇంటికి పెళ్లి పత్రికతో పాటు చీరె సారే పంపించాడు… పెళ్ళికి ఊరు వాళ్ళు వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేశాడు… అంతటితో ఆగకుండా ఒకరోజు ఊర్లో రిసెప్షన్ ఏర్పాటు చేసి, ఊరందరు ఆరోజు పొయ్యి వెలిగించొద్దు అని చెప్పి మరీ అందరికీ భోజనాలు పెట్టించాడు…

రామారెడ్డి మండలం రెడ్డిపేట, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామాల్లో కూడా సొంత డబ్బులతో స్కూలు భవనాలు నిర్మిస్తున్నాడు… త్వరలోనే అవి పూర్తి కానున్నాయి… ఎస్, ఎంతోకొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆత్మతృప్తి మరెందులోనూ లేదు… శెభాష్ రెడ్డీ… కీపిటప్… దేవుడు నీకు మరింత సంపద ఇవ్వాలనీ, మరింతగా అది జనానికి ఉపయోగపడాలనీ మా ఆకాంక్ష..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శెభాష్ రెడ్డీ..! ఎందరో ఎంతో సంపాదిస్తారు, సొసైటీకి తిరిగి ఇచ్చేవాడో తోపు..!!
  • మావోయిస్టు లొంగుబాట్లకు తెలంగాణ పోలీసుల ఫినిషింగ్ టచ్..!!
  • ఓడినందుకు కాదు బాధ..! ఓడిన తీరే సగటు ఫ్యాన్‌కు మంటెక్కించింది..!!
  • 1961 లో ఎన్టీయార్… 1990 లో చిరంజీవి… అదే జగదేకవీరం… అతిలోక సుందరం…
  • బయటికి కనిపించని రంగుల మాయాలోకం… ముంబై నైట్ లైఫ్…
  • కాలం మారిపోతోంది..! భారతీయ వైవాహిక వ్యవస్థలో ఓ నిశ్శబ్ద విప్లవం..!!
  • దోషి – నిర్దోషి… ఓ మంచి స్టోరీ లైన్… పైగా పకడ్బందీ స్క్రీన్‌ప్లే…
  • తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ ‘పింక్ మేనియా’ నుంచి బయటపడలేదా..?!
  • ఆయేషా మీరా..! కేస్ ఖతం..!! మరి ఎవరు హత్యాచారానికి పాల్పడింది..!?
  • ఓ తండ్రి చితి… పక్కన కొడుకు… ఈ వైరల్ కథకు వాస్తవ ముగింపు అదేనా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions