Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యో సర్పంచ్ సాబ్..! ప్రీతి జింటాను దెబ్బతీసిన నీతా అంబానీ..!!

May 15, 2026 by M S R

.

చివరి బాల్… గెలవరని తెలుసు… ఐనా బ్యాటర్ సిక్స్ కొట్టాలని ట్రై చేస్తాడు… అది ప్రొఫెషనల్ స్పిరిట్… సేమ్, ముంబై ఐపీఎల్ జట్టు… ఎంత తన్నుకున్నా అది ప్లేఆఫ్‌కు వెళ్లేది లేదు, అది ఫిక్స్… ఐనా సరే, పరువు కోసం, ప్రొఫెషనల్ స్పిరిట్ వదలకుండా పోరాడి, రాత్రి పంజాబ్ జట్టు మీద గెలిచింది… మన తిలక్ వర్మ జస్ట్ 33 బంతుల్లో ఏకంగా 75 రన్స్ చేసి గెలిపించాడు ముంబైని… దాంతో జరిగింది ఏమిటి..?

ఫాఫం, నీతా అంబానీ తను గెలిచే సిట్యుయేషన్ లేకపోయినా ప్రీతి జింటా ఆశలకు గండికొట్టింది… అంటే పంజాబ్ ఆశలు పూర్తిగా అడుగుంటిపోయాయని కాదు, కాకపోతే మరీ క్లిష్టంగా మారిపోయాయి అవకాశాలు… కంఫర్టబుల్ పొజిషన్ నుంచి సంక్లిష్టంలోకి ప్రవేశించింది…

Ads

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? మనం ఇన్నాళ్లూ ఏం చెప్పుకున్నాం… శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో తను  ఏ జట్టుకు ఆడితే ఆ జట్టును ఏకంగా ఫైనల్స్ దాకా తీసుకుపోతాడని కదా… కానీ ఆ సర్పంచ్ సాబ్ వరుసగా అయిదు పరాజయాలు మూటగట్టుకుని దిక్కులు చూస్తున్నాడు ఇప్పుడు… నిజం, వరుసగా అయిదు పరాజయాలు…

పాపం, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చకచకా వికెట్లు పడ్డా, తరువాత తేరుకుని 200 రన్స్ చేసింది జట్టు, మంచి ఫైటింగ్ స్కోర్… కానీ నాసిరకం ఆటకు ప్రస్తుతం పేరొందిన ముంబై పుంజుకుంది… రోహిత్ మరోసారి విఫలమైనా తిలక్ వర్మ మంచి బ్యాటింగ్ ఆటతీరుతో ముంబై గెలిచింది… పంజాబ్ బౌలర్లు తేలిపోయారు…

ప్రస్తుతం టేబుల్ చూస్తే ముంబై రెండు పాయింట్లు సంపాదించి, మొత్తం 8 పాయింట్లు పొందింది… ఐతేనేం, అక్కడే, అదే తొమ్మిదో స్థానంలో కూరుకుపోయే ఉంది… కానీ పంజాబ్‌కు జరిగిన నష్టం ఏమిటంటే..? ఓ దశలో టేబుల్ టాప్‌లో ఉన్న జట్టు ఇప్పుడు అయిదు వరుస అపజయాలతో 13 పాయింట్లతో ఉంది, మరో 2 మ్యాచులున్నాయి గానీ… చెన్నై, రాజస్థాన్ దూసుకొస్తే పంజాబ్ పరిస్థితి క్లిష్టమవుతుంది…

ప్రస్తుతానికి బెంగుళూరు, గుజరాత్ కంఫర్ట్ పొజిషన్‌లో ఉన్నాయి… ఇక హైదరాబాద్, పంజాబ్, చెన్నై, రాజస్థాన్‌ల సమరం కీలకమవుతుంది… అవునూ, గుజరాత్‌కు ఫైనల్ ఈజీ ఉండటం కోసం పంజాబ్ వంటి బలమైన జట్లను మెల్లిగా దూరం చేస్తున్నారంటారా..?! లేక టీమ్ మేనేజ్‌మెంట్, తన కెప్టెన్సీలోనే వైఫల్యాలున్నాయా..?

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టుది ఎప్పుడూ ఇదే పరిస్థితి… కంఫర్టబుల్ పొజిషన్ నుంచి అనవసరంగా సెల్ఫ్ గోల్స్ వేసుకుని ప్లేఆఫ్ రేసును సంక్లిష్టం చేసుకోవడం వారికి అలవాటుగా మారింది… ఇప్పుడూ అదే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యో సర్పంచ్ సాబ్..! ప్రీతి జింటాను దెబ్బతీసిన నీతా అంబానీ..!!
  • sugarexportban… ముందు మా దేశ ప్రజలు…. తర్వాతే ప్రపంచ మార్కెట్…
  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions