Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భగీరథ్ కేసులో ట్విస్ట్..? ఆ అమ్మాయి అసలు మైనర్ కాదా..?!

May 12, 2026 by M S R

.
బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో ఓ కీలకమైన ట్విస్టు..? ఆ అమ్మాయి మైనర్ కాబట్టే పోక్సో కేసు పెట్టారు కదా… అసలు ఆ అమ్మాయి మైనర్ కాదని తేలితే..? అమ్మాయి, తనూ పరస్పర సమ్మతితోనే కొంతకాలం ‘కలిసి తిరిగామని’ భగీరథ్ ఆధారాలు సమర్పిస్తే..? తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనీ, లైంగికంగా వేధించాడని కదా ఆమె చెబుతున్నది… కానీ..?

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం… భగీరథ్ హైకోర్టు ఎదుట దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లో అసలు ఆ అమ్మాయి మైనర్ కాదని పేర్కొనడం ఓ మలుపు… అంతేకాదు, పరస్పర సమ్మతి (Consensual) ఉందంటున్నాడు, కేవలం రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగా తప్పుడు కేసు పెట్టారని భగీరథ్ వాదన…

హైకోర్టు వెకేషన్ బెంచ్ ఎదుటకు 14న వస్తుందని భావిస్తున్నారు… అంతకుముందు తను ‘హానీ ట్రాప్’ ఫిర్యాదు చేశాడు… ఇటు అమ్మాయి ఫ్యామిలీ పోక్సో కేసు పెట్టారు.., భగీరథ్ వేధించడంతోనే అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందని ఆ ఫ్యామిలీ చెబుతోంది… కానీ తమ ఇద్దరి నడుమ సంబంధం సజావుగా కొనసాగినన్ని రోజులు ఏ కంప్లయింట్ లేకుండా ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారని భగీరథ్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నట్టు టైమ్స్ వార్త చెబుతోంది…

Ads

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఓ సిట్ ఏర్పాటు చేసింది, బండి సాయి భగీరథ్‌తో పాటు మరికొందరిపై కేసు పెట్టారు… BNS 74, 75తో పాటు POCSO 11,12 కింద తొలి కేసు నమోదు కాగా, బాధితురాలి వాంగ్మూలం తర్వాత POCSO 5(l), 6గా సెక్షన్ల మార్పు… పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు…

నిజంగానే ఓ మిస్టరీగా మారుతోంది కేసు… ఆమె భగీరథ్‌తో దిగినట్టు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు ఇద్దరూ ఇష్టపడి దిగినట్టే కనిపిస్తున్నాయి… ఆమె మైనర్ అన్నట్టుగా కూడా కనిపించడం లేదు… సరే, ఒకవేళ హైకోర్టు భగీరథ్ వాదనను పరిగణనలోకి తీసుకుంటే… అమ్మాయి ఏజ్ ప్రూఫ్ అడుగుతుందేమో… ఐనా పోక్సో సెక్షన్లను మార్చి, ఆమె వాంగ్మూలం తీసుకున్నప్పుడు పోలీసులు ఆమె ఏజ్ ఖరారు చేసుకునే ఉంటారు కదా..! మొత్తానికి గందరగోళంగా ఉంది కేసు…

పైగా సంజయ్ కూడా ఆమె మైనర్ కాదని ఎక్కడా అనడం లేదు, తనపై పొలిటికల్ కుట్ర అని చెబుతున్నాడు, అంతే… అమ్మాయి ఫ్యామిలీ స్థితిమంతులేననీ, సంజయ్ కొడుకు మీద హానీ ట్రాప్ వేయాల్సిన ఖర్మ వాళ్లకు లేదని మరో వాదన వినిపిస్తోంది… మరి మొయినాబాద్ ఫామ్‌హౌజులో ఆరోజు రాత్రి ఏం జరిగింది..? ఇదీ తేలాల్సి ఉంది…

ఒకవేళ అమె మైనర్ కాదని తేలితే కథ ఇక వేరే ఉంటుంది… లేదు, మైనరే అయ్యే పక్షంలో భగీరథ్ మెడకు కేసు బలంగా బిగుసుకున్నట్టే…!! సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశం అయ్యింది… పొలిటికల్ కలర్స్ కూడా పులమబడుతున్నాయి..!!

https://timesofindia.indiatimes.com/city/hyderabad/relationship-was-consensual-union-minsiter-bandi-sanjay-kumars-son-seeks-anticipatory-bail-in-pocso-case-in-telangana-high-court/amp_articleshow/131036038.cms

బండి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు
  • Pepsi Blunder — ఓ మార్కెటింగ్ తొందరపాటు — దేశమంతా అల్లర్లు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions